umesh
-
ఇదే నిజమైన నివాళి.. సీఎం యోగికి ధన్యవాదాలు..
లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ మాజీ ఎంపీ, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ కొడుకు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఘటన హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఓ హత్య కేసు(ఉమేశ్ పాల్‌కు సంబంధించిన కేసు)లో నిందితుడిగా ఉన్న అసద్‌ను.. ఝాన్సీ వద్ద పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. గురువారం అతిఖ్‌ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలోనే.. ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. ఇక, ఈ ఎన్‌కౌంటర్‌పై ఉమేశ్ పాల్ తల్లి శాంతి దేవి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్కౌంటర్.. నా కొడుకు మరణానికి ఇచ్చిన నిజమైన నివాళి అంటూ సంతోషం వ్యక్తం చేశారు. నాకు, మా కుటుంబానికి న్యాయం చేసినందకు సీఎం యోగికి జీకి ధన్యవాదాలు. మున్ముందు కూడా మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం యోగిపై మాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. తమ విధులను నిర్వర్తించిన ముఖ్యమంత్రికి, పోలీసు శాఖకు ధన్యవాదాలు అని అన్నారు. After the encounter of former MP Atiq Ahmed's son Asad and his aide, CM Yogi Adityanath took a meeting on law and order. CM Yogi praised UP STF as well as DGP, Special DG law and order and the entire team. Sanjay Prasad, Principal Secretary Home informed the CM about the… pic.twitter.com/4IzTxkLwxs — ANI (@ANI) April 13, 2023 మరోవైపు.. ఈ ఎన్‌కౌంటర్‌పై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. ఈ సందర్బంగా అఖిలేష్ మాట్లాడుతూ.. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి కోర్టులపై నమ్మకం లేదని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోందని విమర్శించారు. ఏది ఒప్పో, ఏది తప్పో నిర్ణయించే హక్కు వారికి లేదన్నారు. ఇదిలా ఉండగా, అంతకుముందు.. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ అనే లాయర్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉమేశ్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని ఆయన ఇంటి వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో అసద్‌తో పాటు గులాం అనే ఇద్దరు నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో గురువారం వాళ్లను పట్టుకునే యత్నం చేసిన పోలీసులపై ఇద్దరూ కాల్పులు ప్రారంభించగా.. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో అసద్‌తో పాటు గులాం కూడా చనిపోయాడు. వీళ్లిద్దరిపై ఐదేసి లక్షల రూపాయల రివార్డు ఉంది. మరోవైపు.. బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను 2006లో కిడ్నాప్ చేశాడనే కేసు అతిఖ్ అహ్మద్‌పైనా ఉంది. ఈ కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అయిన అతిఖ్ అహ్మద్‌కు నెలలో శిక్ష కూడా పడింది. సుమారు వంద కేసుల్లో నిందితుడైన అతిఖ్ అహ్మద్.. యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌పేరుతో తననూ చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. "Tribute to my son," Umesh Pal's mother thanks CM Yogi after Atiq Ahmed's son killed in encounter Read @ANI Story | https://t.co/i9jHYMPmaZ #UmeshPal #CMYogi #AtiqAhmed #Encounter pic.twitter.com/4Ifyz9Z8MQ — ANI Digital (@ani_digital) April 13, 2023 -
నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మీరే కారణం.. థ్యాంక్స్: గ్యాంగ్‌స్టర్
లక్నో: ఉమేష్ పాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ అతిక్ అహ్మద్‌ను బుధవారం గుజరాత్ సబర్మతి జైలు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జైలుకు తరలించారు అధికారులు. ఈ సమయంలో పలు మీడియా సంస్థలు పోలీసుల వాహనాలను అనుసరించాయి. అతిక్ అహ్మద్‌ను సురక్షితంగా జైలుకు తీసుకెళ్లేంత వరకు కెమెరాలతో రికార్డు చేశాయి. దీంతో తాను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మీడియానే కారణమని అతిక్ అహ్మద్ అన్నారు. అందుకు మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. మీరు భయపడుతున్నారా అని అడిగిన ఓ ప్రశ్నకు అతడు ఈమేరుక సమాధానం ఇచ్చాడు. అలాగే ఉమేష్ పాల్ హత్య కేసుతో మీకున్న సంబంధం ఏంటి? మీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది? అని మీడియా అడగ్గా.. తన ఫ్యామిలీ నాశనం అయిందని అతిక్ బదులిచ్చాడు. జైలులో ఉన్న తనకు కుటుంబసభ్యులు ఎలా ఉన్నారో.. ఎక్కడ ఉంటున్నారో ఎలా తెలుస్తుందని అన్నాడు. Rajasthan | Prayagraj Police convoy taking criminal-turned-politician-mafia Atiq Ahmed from Sabarmati Jail to Prayagraj, to present him in a murder case, took a halt in Bundi. pic.twitter.com/ntwPenvf6v — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023 2006లో ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో అతిక్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు దోషులుగా తేలారు. వీరికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అతిక్ సోదరుడు ఖలీద్ అజీమ్‌తో పాటు మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. 2006లోనే జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య ఘటనలో ఉమేష్ పాల్ కీలక సాక్షిగా ఉన్నాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ ప్రయాగ్ రాజ్‌లోని తన నివాసం ఎదుట దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగులు ఆయనను తుపాకులతో కాల్చిచంపారు. అతిక్ అహ్మద్‌తో పాటు అతని సోదరుడు అశ్రఫ్లే ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలున్నాయి. #WATCH | Bundi, Rajasthan: "My family has been ruined...I was in jail what will I know about it (Umesh Pal murder case)," says criminal-turned-politician-mafia Atiq Ahmed while being taken from Sabarmati Jail to Prayagraj pic.twitter.com/LTc869VdxQ — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 11, 2023 చదవండి: నేను ఇంకా ప్రాణాలతో ఉన్నానంటే మీరే కారణం.. థ్యాంక్స్: గ్యాంగ్‌స్టర్ -
అతీక్ అహ్మద్‌కు జీవిత ఖైదు
ప్రయాగ్‌రాజ్(యూపీ): 2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో గ్యాంగ్‌స్టర్–రాజకీయ నేత అతీక్ అహ్మద్, మరో ఇద్దరికి కఠిన జీవిత ఖైదు విధిస్తూ ఎంపీ–ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. తలా రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. అతీక్‌పై నమోదైన 100కు పైగా కేసుల్లో శిక్ష పడిన మొట్టమొదటి కేసు ఇదే. ఇదే కేసులో అతీక్ సోదరుడు ఖాలిద్ అజీం అలియాస్ అష్రఫ్, మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. తీర్పుపై హైకోర్టుకు వెళతామని అతీక్ పోలీస్ వ్యాన్ నుంచి విలేకరులతో అన్నాడు. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు ముగ్గురినీ వేర్వేరు వ్యాన్లలో నైని జైలుకు తరలించారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు హత్య కేసులో అహ్మద్ తదితరులు నిందితులు. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను అతీక్ కిడ్నాప్ చేసి, బెదిరించాడు. ఈ కేసులో అతీక్ జైలుపాలయ్యాడు. -
పర్వతం అతనికి పాదాక్రాంతం
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): కృషితో పట్టుదలతో ఆ యువకుడు ఏ పర్వతాన్నయినా అవలీలగా అధిరోహిస్తున్నాడు. ఆరేళ్ల క్రితం మనసులో వచ్చిన ఆలోచనకు పదును పెట్టి ఆచరణ సాధ్యం చేస్తున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన అతని పేరు ఉమేష్ ఆచంట. ఇతని తల్లిదండ్రులు బాలాజీ..పద్మావతి. ఉమేష్ చదువులో దిట్ట. టేబుల్ టెన్నిస్ అంటే ప్రాణం. ఈ ఆటలో అద్భుత ప్రావీణ్యం కనబరిచాడు. బీకాం ఉత్తీర్ణుడైన ఈ యువకుడు స్టోర్ట్సు కోటాలో రాజమహేంద్రవరంలోని పోస్టల్ డిపార్టుమెంట్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2016లో చూసిన ఎవరెస్ట్ సినిమా ఇతని ప్రవృత్తిని మార్చేసింది. తాను కూడా ఎవరెస్ట్ ఎక్కాలని బలంగా సంకల్పించాడు. వాస్తవానికి పర్వతారోహణ అనేది సాహస విన్యాసం. అయినప్పటికీ కృతనిశ్చయంతో తల్లితండ్రులను ఒప్పించి అరుణాచల ప్రదేశ్ వెళ్లాడు. కఠోరమైన శిక్షణ పొందాడు. అప్పటి నుంచి చిన్న చిన్న కొండలను ఎక్కడం ప్రారంభించి నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. చూసి తాను కూడా ఎవరెస్ట్ ఉమేష్ అంచెలంచెలుగా తన లక్ష్యాన్ని పెంచుకుంటూ పోయాడు. మూడు ఖండాలలో అతి ఎత్తయిన శిఖరాలను అధిరోహించగలిగాడు. గతేడాది మార్చిలో ఆఫ్రికాలో అతి పెద్ద పర్వతం కిలిమంజారోను అధిరోహించి ఔరా అనిపించాడు. అదే ఏడాది ఆగస్టులో యూరప్ ఖండంలో అతిపెద్ద పర్వతం మౌంట్ ఎలబస్ని ఎక్కాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో అతిపెద్ద పర్వతం మౌంట్ కోజిస్కోని అధిరోహించి అందరి దృష్టీ ఆకర్షించాడు. తాజాగా ఎవరెస్ట్ ఎక్కడానికి సన్నద్ధమవుతున్నట్లు ఉమేష్ సాక్షికి చెప్పాడు. ప్రమాద అంచున పయనం కిలిమంజారో ఎత్తు 19340 అడుగులు. మొదటి రెండు రోజులు ఏ ఆటంకాలు లేకుండా ఎక్కగలిగాడు. మూడో రోజు ఆక్సిజన్ లెవల్ తగ్గిపోయింది. దీంతో ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న అధికారవర్గాలు వెంటనే స్పందించాయి. అక్కడికి గైడ్, రిస్క్యు టీంను పంపాయి. దీంతో ఉమేష్ ప్రాణాలతో బయట పడ్డాడు. అలాగే మౌంట్ కోజిస్కోపర్వతం ఎత్తు 2228 మీటర్లు. ఆస్ట్రేలియా ఖండంలో ఈ పర్వతం పూర్తిగా మంచుతో నిండి ఉంటుంది. దీంతో అక్కడ పర్వతారోహనను ఆపేశారు. కానీ ఉమేష్ ప్రత్యేక అనుమతి తీసుకుని ఈనెల 11న బేస్ క్యాంపు నుంచి బయులుదేరాడు. సుమ్మిట్ పూర్తి చేసుకుని కిందకు రాత్రి లోపు వచ్చేయాలి. జీపీఎస్ సిగ్నల్స్..తీప్ర మంచు సమస్యలతో రూట్ మ్యాప్‌లో ఇబ్బందులు ఎదురయ్యాయి. రావ్సన్ వద్ద ఎడమ వైపునకు వెళ్లాల్సి ఉంది. కానీ పొరపాటున దారి తప్పిపోయాడు. ఆ రాత్రి మళ్లీ కిందికి చేరుతానో లేదో అని తాను తీవ్ర ఆందోళన చెందానని ఉమేష్ చెప్పాడు. రాత్రి 12 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ టీంకు సమాచారం ఇద్దామన్నా సిగ్నిల్స్ లేవన్నాడు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రెస్క్యూ అపరేషన్ టీం ఇతడ్ని గుర్తించింది. అతి జాగ్రత్తగా బేస్ క్యాంపునకు తీసుకు వచ్చింది. అయినా పట్టు వీడకుండా ఈనెల 12న బేస్ క్యాంప్ నుంచి మళ్లీ బయలుదేరి మౌంటైనీర్ అవిన జోష్ మాతేవ్తో కలిసి మౌంట్ కోజిస్కోను అధిరోహించగలిగాడు. ఉమేష్ సాధించిన మెడల్స్ ఒడిదుడుకులు ఎదుర్కొని.. ప్రపంచంలో అతి ఎత్తయిన ఏడు పర్వతాలత్లో మౌంట్ ఎల్బస్ ఒకటి. పూర్తిగా మంచుతో కప్పబడి ఉండే పర్వతమిది. సముద్రమట్టానికి 16510 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీనిని కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా చేరుకోగలిగాడు. టీటీలో పలు ర్యాంకింగులు సాధించిన ఉమేష్ పర్వతరోహణలో ఏడు ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు. -
మహారాష్ట్రలో కెమిస్ట్ దారుణ హత్య
నాగపూర్: మహారాష్ట్రలోని అమరావతి నగరంలో దారుణం జరిగింది. బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టును షేర్ చేశాడన్న కారణంతో 54 ఏళ్ల కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు కొల్హేను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. జూన్ 21న ఈ సంఘటన జరిగిందని, ఇప్పటిదాకా ఆరుగురిని అరెస్టు చేశామని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తీసింగ్ శనివారం తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ (32)ను నాగపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్యలాల్ హత్య కంటే వారం ముందే ఉమేశ్ హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. నుపుర్ శర్మకు మద్దతుగా నిలిచినందుకు కన్హయ్యలాల్‌ను ఇద్దరు వ్యక్తులు పొడిచి చంపేసిన సంగతి తెలిసిందే. ఉమేశ్ అమరావతి సిటీలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ గ్రూప్‌ల్లో ఒక పోస్టును షేర్ చేశాడని పోలీసులు చెప్పారు. సదరు గ్రూపుల్లో అతడి కస్టమర్లతోపాటు కొందరు ముస్లింలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉమేశ్‌పై కక్ష పెంచుకున్న ఇర్ఫాన్ ఖాన్ అతడిని హత్య చేయాలని పథకం రచించాడని, ఇందుకోసం ఐదుగురిని రంగంలోకి దింపాడని తెలిపారు. హత్య చేస్తే రూ.10,000 ఇస్తానని, పోలీసులకు దొరక్కుండా పారిపోవడానికి కారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడని వివరించారు. జూన్ 21న రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దుకాణం మూసివేసి, ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఉమేశ్‌ను మెడపై పదునైన కత్తితో నరికి, హత్య చేశారని వెల్లడించారు. నిందితులంతా కూలీలు.. ఉమేశ్ కుమారుడి ఫిర్యాదు మేరకు ఇర్ఫాన్ ఖాన్, ముదాసిర్ అహ్మద్(22), షారుఖ్ పఠాన్(25), అబ్దుల్ తౌఫిక్(24), షోయబ్ ఖాన్(22), అతీబ్ రషీద్(22)పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. వీరంతా అమరావతి వాసులేనని, రోజు కూలీలుగా పనిచేస్తున్నారని చెప్పారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. హత్య దృశ్యాలు నమోదైన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ(ఎన్జీవో)ను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అమరావతికి ఎన్ఐఏ బృందం అమరావతిలో కెమిస్ట్ ఉమేశ్ ప్రహ్లాదరావు హత్యపై ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. ఉమేశ్ హత్య కేసును ఎన్ఐఏకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్ఐఏ బృందం శనివారం అమరావతికి చేరుకుంది. ఆదివారం నుంచి దర్యాప్త చేపట్టనుంది. మహారాష్ట్ర పోలీసు శాఖకు చెందిన యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) టీమ్ కూడా ఔరంగబాద్ నుంచి అమరావతికి వచ్చింది. ఉదయ్‌పూర్‌లో దర్జీ కన్హయ్యలాల్ హత్యపై ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిన విషయం విదితమే. కన్హయ్య కుటుంబానికి రూ.కోటి విరాళంగా సమకూర్చి అందజేస్తామని బీజేపీ ప్రకటించింది. -
కొట్టేసిన బంగారాన్ని తన ఇంట్లోనే దాచాడు
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ ఎట్టకేలకు నోరు విప్పాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో కొట్టేసిన బంగారం తన ఇంట్లోనే ఉందని వెల్లడించాడు. ఉద్దేశపూర్వకంగానే అహ్మదాబాద్ పోలీసులకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్లు అంగీకరించాడు. ఇతడిని వారం కస్టడీలోకి తీసుకుని విచారించిన పేట్ బషీరాబాద్ పోలీసులు 19 తులాల బంగారం రికవరీ చేసినట్లు బాలానగర్ డీసీపీ గోనె సందీప్ బుధవారం వెల్లడించారు. ► అహ్మదాబాద్‌లోని నారన్పురకు చెందిన ఉమేష్ విలాసవంతమైన జీవితం గడపడానికి చైన్ స్నాచింగ్స్ చేసేవాడు. గతేడాది ఆగస్టులో జైలు నుంచి బయటకు వచ్చి అహ్మదాబాద్‌లో స్నాచింగ్స్ చేశాడు. డిసెంబర్లో బెంగళూరులో పంజా విసిరాడు. నగరాన్ని టార్గెట్‌గా చేసుకుని ఈ ఏడాది జనవరిలో వచ్చాడు. ► అదే నెల 18న నగరంలోని నాంపల్లిలోని మెజిస్టిక్ లాడ్జిలో దిగిన ఉమేష్ అదే రోజు ఆసిఫ్‌నగర్‌లో యాక్టివా చోరీ చేశాడు. మరుసటి రోజు దానిపైనే సంచరిస్తూ అల్వాల్‌లో మొదలు పెట్టి మేడిపల్లి వరకు వరుసపెట్టి నేరాలు చేశాడు. ► వీటిలో రెండు యత్నాలు విఫలం కాగా.. అయిదు ప్రాంతాల్లో 19 తులాల బంగారం చేజిక్కించుకున్నాడు. కొన్ని గంటల్లోనే ఉమేష్‌ను గుర్తించడంతో పాటు అహ్మదాబాద్‌లో ఆచూకీ కనిపెట్టిన నగర పోలీసులు అక్కడి అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు పట్టుకున్నారు. తమ కేసుల్లో అరెస్టు చూపించుకుని కొంత బంగారం రికవరీ చేశారు. ఆ సందర్భంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులతో పాటు బెంగళూరు అధికారులూ అహ్మదాబాద్ వెళ్లినా... ఉమేష్ అప్పగించమంటూ స్పష్టం చేసి, కనీసం మాట్లాడేందుకూ అవకాశం ఇవ్వలేదు. పక్కా విచారణతో.. ► ఉమేష్‌ను అరెస్టు చూపించిన వడాజ్ పోలీసులు నేరాంగీకార వాంగ్మూలం నమోదు చేశారు. ఆ సందర్భంలో నిందితుడు తాను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో నేరాలు చేశానని, తెంచిన గొలుసులన్నీ అక్కడే పడిపోయాయంటూ చెప్పాడు. నిందితుడిని పక్కాగా విచారించకపోవడంతో ఆ పోలీసులు విషయం రాబట్టలేక ఇదే రికార్డు చేసుకున్నారు. హఠాత్తుగా పోలీసు కస్టడీ నుంచి ఉమేష్ పారిపోవడంతో అహ్మదాబాద్ పోలీసుల తీరుపై సందేహాలు తలెత్తాయి. ► ఉమేష్ కోసం ముమ్మరంగా గాలించిన అక్కడి క్రైమ్ బ్రాంచ్ గత నెల్లో పట్టుకుంది. ఆపై నిందితుడిని పీటీ వారెంట్‌పై బెంగళూరు పోలీసులు తీసుకువెళ్లి అరెస్టు చేయడంతో పాటు రూ.4 లక్షల విలువైన బంగారం రికవరీ చేశారు. ► కొన్ని రోజుల క్రితం ఉమేష్‌ను పీటీ వారంట్‌పై తీసుకుచ్చిన పేట్ బషీరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మంగళవారం వరకు చాకచక్యంగా విచారించిన అధికారులు ఉమేష్ నోటి వెంట నిజం చెప్పించారు. ఇక్కడి అయిదు నేరాల్లో కాజేసిన 19 తులాల బంగారం నరన్పురలోని తన ఇంట్లోనే దాచి ఉంచానని బయటపెట్టాడు. దీంతో ఉమేష్‌ను తీసుకుని అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ఈ బంగారం రికవరీ చేసుకువచ్చింది. ► హైదరాబాద్, రాచకొండ పోలీసులూ ఉమేష్‌ను పీటీ వారంట్‌పై అరెస్టు చేయనున్నారు. తమ రెండు కేసులకు సంబంధించిన బంగారం మినహా మిగిలింది ఆయా అధికారులకు అప్పగించాలని పేట్ బషీరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఈ వార్త కూడా చదవండి: ట్రావెల్స్ బస్సు.. లారీ ఢీ -
సూత్ర ఎగ్జిబిషన్ ప్రారంభం..
-
హారర్ కథా చిత్రం
రుషి లక్ష్మణ్, ఉమేశ్, సాయికుమార్, జాకీష్రాఫ్, షీనారాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సినిమా కథా చిత్రం’. రామ్‌ఫిలిమ్స్ పతాకంపై మదన్ మోహన్ నాయుడు, జి.తిమ్మారెడ్డి గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి రామ్ మధుసూదన్ దర్శకుడు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టి.రామసత్యనారాయణ, సాయివెంకట్, మోహన్ గౌడ్లు పాల్గొన్నారు. రామ్ మధుసూదన్ మాట్లాడుతూ– ‘‘గతంలో నేను తెరకెక్కించిన ‘వంశం’ చిత్రానికి 13 అవార్డులు వచ్చాయి. లేటెస్ట్గా రుషిని హీరోగా పరిచయం చేస్తూ ‘సినిమా కథా చిత్రం’ చేశాను. హారర్ కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. -
ఎన్నికల అధికారులకు ఈసీఐ దిశానిర్దేశం
అమరావతి: ఎన్నికల ఫలితాల రోజున అనుసరించాల్సిన విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) డిప్యూటీ చీఫ్ ఉమేశ్ సిన్హా దిశానిర్దేశం చేశారు. పోలింగ్ నాడు చోటుచేసుకున్న సంఘటనలుల దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టాలని, ప్రణాళిక విభాగం రూపొందించిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. స్ట్రాంగ్ రూంల భద్రతపై వారాంతపు నివేదికలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా పంపించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు వివరాలు ఈసీఐ అధికారిక పోర్టల్ న్యూసువిధకు అనుసంధానం చేసిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని తెలియజేశారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సంతకాలు తీసుకున్న తర్వాతే ఫలితాలు ప్రకటించాలని సూచన చేశారు. రోజువారీ నివేదికలివ్వండి: సుజాత(అడిషల్ సీఈఓ) స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై రోజువారీ నివేదికలివ్వాలని కలెక్టర్లను ఏపీ అదనపు ప్రధాన ఎన్నికల అధికారిణి సుజాత శర్మ ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియను ప్రోటోకాల్ ప్రకారం అత్యంత పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. 17న కౌంటింగ్‌పై రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమం విజయవాడలో నిర్వహిస్తామని చెప్పారు. -
ఎన్ఐఎస్ కోచ్ ఉమేశ్ పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్, ఎన్ఐఎస్ కోచ్ జి. ఉమేశ్ శనివారం పదవీ విరమణ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఎందరో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్విమ్మర్లుగా రూపుదిద్దుకున్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అదనపు స్పోర్ట్స్ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్, స్పోర్ట్స్ డైరెక్టర్ శశికిరణ్ చారి, జీహెచ్ఎంసీ ఓఎస్డీ ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ ఆయనను ఘనంగా సన్మానించారు. -
జయంతి మహల్
జయంతి మహల్లో ఎవరో వార్డుబాయ్ చెట్టుకుఉరేసుకున్నాడని అన్నారు. అంతే! ఆ విషయం విన్న కొందరు గ్రామస్తులు ఇది అంత మంచి స్థలం కాదని తాము ముందే చెప్పామని, ఎప్పుడూ ఏదొక కీడు జరుగుతూనే ఉందని అన్నారు. అంతకు ముందు వరకు జయంతి మహల్ సందడిగా ఉండేది. ఇప్పుడు అది అరణ్యంలా మారింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రామ్ నగర్లో గెలుపు మాత్రం తులసీదాస్దే. నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరమొచ్చినా నిత్యం అందుబాటులో ఉంటాడు. ఎమ్మెల్యే అయినా సాధారణ జీవనాన్నే గడుపుతాడు. తులసీదాస్‌కు అచ్చం తన తండ్రి పోలికలే వచ్చాయని వయసులో పెద్దవారు అనుకుంటూ ఉంటారు. తులసీదాస్ తండ్రి రఘురామయ్య కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆరు సార్లు గెలిచారు. ఈ ప్రాంత ప్రజలకు ఆయన దేవుడితో సమానం. రఘురామయ్య మీదున్న ప్రేమని యథావిధిగా ఆయన కూమారుడు తులసీదాస్‌పై చూపిస్తుంటారు. రఘురామయ్యకు తులసీదాస్ ఒక్కడే కుమారుడు. ఆయన చనిపోయాక తులసీదాస్ మొదటిసారి బై ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలుపొందినప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తులసీదాస్‌కు కూడా ఒక్కడే కుమారుడు. పేరు సంహిత్. సంహిత్ ఐర్లాండ్‌లో కార్డియాలజీలో పీజీ చేస్తున్నాడు. కొడుకు తన చదువును పూర్తి చేసి వచ్చాక తన నియోజకవర్గంలోనే ఒక పెద్ద ఆస్పత్రి కట్టించి ఉచిత వైద్యం అందించాలని భావించాడు. రాజధాని నుంచి తన నియోజకవర్గమైన రామ్‌నగర్‌కు వచ్చే దారిలో వాళ్ల నాన్న ఉన్న కాలంలో జయంతి మహల్ అనే సినిమా థియేటర్ ఉండేది. ప్రస్తుతం అది పూర్తిగా శిథిలమై ఉంది. కానీ అది విశాలంగా ఉన్న అయిదు ఎకరాల విస్తీర్ణంలో ఉండటంతో ఎక్కువ స్థలముందని, కావాలంటే ఆ మహల్‌ను కూలగొట్టి ఆస్పత్రి కట్టించొచ్చు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ థియేటర్‡యజమాని ఎక్కడున్నాడో కనుక్కొమ్మని తన అనుచరులను పురమాయించాడు. తర్వాత ఆ థియేటర్ యజమాని అతని కుటుంబ సభ్యులు ఆ థియేటర్ ప్రాంగణంలో ఉన్న వాళ్లింట్లో దారుణంగా హత్యకు గురయ్యారని వారి బంధువుల ద్వారా తులసీదాస్‌కు తెలిసింది. దాంతో ఆ నియోజకవర్గ ప్రజలకు ఆ థియేటర్ అంటే చాలా భయం పట్టుకుంది. దాన్ని ఒక భూత్ బంగ్లాగా చూస్తారని, రాత్రి వేళల్లో ఆ దారివైపు ఒంటరిగా ఎవరూ వెళ్లరని తులసీదాస్‌కు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు తులసీదాస్. ఒక రోజు నియోజకవర్గ ప్రజలతో తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశాడు. తను ఆ థియేటర్ స్థానంలో ఆస్పత్రి కట్టించబోతున్నానని తన అభిప్రాయాన్ని చెప్పాడు తులసీదాస్. ఎన్నాళ్లని భయపడుకుంటూ ఉంటారు. నేను చిన్నతనంలో ఉన్నప్పటి నుంచి ఇవే గుసగుసలు. అపోహలు. ఆ రోజుల్లో అంటే ఎలాంటి అక్షరాస్యత లేక నమ్మారనుకుంటే, ఇప్పుడు ఉన్న వాళ్లకేమైంది? ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఇంకా దెయ్యాలు, భూతాలు అంటూ భయపడుతూనే ఉన్నారని తలసీదాస్ గద్దించాడు. ఆ మాటకు అందరూ కిమ్మనకుండా ఆయన చెప్పింది వినసాగారు. అక్కడ ఆస్పత్రి కట్టించి తన కుమారుడితో వైద్యం చేయిస్తానని, వైద్యానికి దూరమైన మన ప్రజలకు ఇది గొప్పవరమని చెప్పి తన నిర్ణయాన్ని ప్రకటించాడు. మూడేళ్ల తర్వాత... ఏంటీ జయంతి మహల్ దగ్గర అంత జనం ఉన్నారని అక్కడ గుమిగూడిన వాళ్లలో ఒకరిని ఆ ఊరి వాడు అడిగాడు. ‘‘ఓరి..! నీకు తెలీదా? జయంతి మహల్‌ను ప్రభుత్వం అవయవ మార్పిడి ఆస్పత్రిగా మార్చిందిగా. దీన్ని ప్రారంభించడానికి ఆరోగ్య మంత్రి తులసీదాస్ వస్తున్నారు. అందుకే మేమంతా చూడ్డానికి వచ్చాం’’ అన్నాడు. ఇంతలోనే పోలీస్ కాన్వాయ్‌లో మంత్రి తులసీదాస్ వచ్చారు. దిగగానే పక్కనే ఎదురు చూస్తున్న ఆ గ్రామ జనంతోటి ‘బాగున్నారా’ అని పలకరించాడు. ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి భవనాన్ని పరిశీలించడానికని వైద్య బృందంతో లోపలికి వెళ్లాడు. ఇతరులనెవరినీ లోనికి రానీయకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘సర్..! ఇది గుండె మార్పిడి గది. దీనిలో నాలుగు ఎమర్జెన్సీ బెడ్స్‌తో సహా సకల సౌకర్యాలున్నాయి. ఇది బాడీని డీకంపోజ్ కాకుండా ప్రిజర్వ్ చేసే గది’’ అని జయంతి మహల్‌ను అవయవ మార్పిడి ఆస్పత్రిగా మార్చాక వైద్యులు ఒక్కొక్క దాని గురించి మంత్రికి వివరిస్తున్నారు. రెండున్నరేళ్ల క్రితం ఎమ్మెల్యే తులసీదాస్ జయంతి మహల్‌ను ఆస్పత్రిగా మార్చి ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశంతో తన కుమారుడి చేత ఆస్పత్రిని ప్రారంభించాలనుకున్న క్రమంలో దురదృష్టవశాత్తు సెలవులకని ఇంటికి వచ్చిన సంహిత్‌కు యాక్సిడెంట్ జరిగింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణంతో తులసీదాస్ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లాడు. ప్రజల పాలనకు తన వ్యక్తిగత జీవితానికి పూర్తిగా దూరమయ్యాడు. తర్వాత మెల్లమెల్లగా అంతా కుదుటపడ్డాక తన సాధారణ జీవితంలోకి వచ్చాడు. తులసీదాస్ ప్రజాసేవను, మచ్చలేని రాజకీయ జీవితాన్ని గుర్తించిన ప్రభుత్వం ఏడాది క్రితం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆరోగ్య శాఖను కేటాయించింది. తనకు వారసులు లేరని తన రాజకీయ జీవితాన్ని మొత్తం ప్రజలకే అంకితం చేయాలనుకున్నానని తన కుమారుడు ఉన్నప్పుడు ఏర్పాటు చేస్తానన్న ఆస్పత్రి స్థానంలో అవయవ మార్పిడి కేంద్రం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. రాజధానికి అంత దూరంలో అవయవ మార్పిడి ఆస్పత్రి ఏర్పాటు చేస్తే కష్టమని చెప్పిన ప్రభుత్వం రాజధానిలో ఉన్న కేంద్రానికి అనుబంధంగా ఎమర్జెన్సీ కేంద్రంగా ఏర్పాటు చేయడానకి అనుమతినిచ్చింది. అందులో భాగంగానే జయంతి మహల్‌ను పాక్షికంగా కూలగొట్టి ఆస్పత్రికి అనుగుణంగా మార్పు చేశారు. ఇక్కడే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇంకో కారణాన్ని పరిగణించింది. రాజధానిలో అవయవమార్పిడి కేంద్రంలో కేసులు ఎక్కువైతే ట్రాఫిక్ కారణంగా త్వరగా రోగులకు అవయవాలను తరలించలేమని, అత్యవసరం అయితే రామ్‌నగర్‌లో ఉన్న ఎమర్జెన్సీ హెలిప్యాడ్ కేంద్రాన్ని ఉపయోగించుకుని జయంతి మహల్‌కు చేరవేయొచ్చని భావించి అక్కడ ఏర్పాటుకు అనుమతిచ్చింది. అయితే ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వం చేపట్టిన అవయవాలను రోగులకు అమర్చే బాధ్యతను ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్మంతో జరుగుతుంది. ప్రైవేటు ఆస్పత్రి తరపున సుజనా హాస్పిటల్స్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రజనీకాంత్ ఆధ్వర్యంలో ఎన్నో అవయన మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయి. ఆయనకున్న మంచి పేరుకు ప్రభుత్వం ఆ ఆస్పత్రిని భాగస్వామ్యం చేసింది. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అవయవ మార్పిడి కేసుల్లో ఎక్కువ జయంతి మహల్‌కు తీసుకొస్తుంటారు. ‘‘ఏమైంది? అక్కడ అంతా పోలీసులు ఉన్నారు. జనమంతా అక్కడున్నారేంట’’ని రోడ్డు మీద వెళ్తున్న ఒకరు అటుపోతున్న వాళ్లని అడిగాడు. జయంతి మహల్లో ఎవరో వార్డుబాయ్ చెట్టుకు ఉరేసుకున్నాడని చెప్పారు. అంతే ఆ విషయం విన్న కొందరు గ్రామస్తులు.. ఇది అంత మంచి స్థలం కాదని తాము ముందే చెప్పామని, ఎప్పుడూ ఏదొక కీడు జరుగుతూనే ఉందని అన్నారు. అంతకు ముందు వరకు జయంతి మహల్ వద్ద రాకపోకలతో సందడిగా ఉండే ప్రాంతం ఒక్కసారిగా అరణ్యంలా మారింది. ఆస్పత్రిలో పనిచేసే వాచ్‌మన్ నుంచి వార్డుబాయ్ వరకు పని చేయడానికి కుదిరిన ఆ గ్రామస్తులంతా పని మానేశారు. తర్వాత అక్కడ పని చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి హిందీ వాళ్లని కొంతమందిని నియమించారు. పగటిపూట కేసుల్ని ఎక్కువగా తీసుకొస్తుండటంతో గ్రామస్తులు భయపడుతున్నారని రాత్రిపూటే అంబులెన్స్‌ల రాకపోకలు సాగేవి. పగలు తక్కువగా ఉండేవి. ‘‘అసలేం జరుగుతుందయ్యా! పోలీసులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఇన్ని కేసులు నమోదవుతున్నా ఏం తేల్చలేక పోతున్నారేంటి’’ అని పోలీసు అధికారులపై మంత్రి తులసీదాస్ తన చాంబర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నలభైరెండు అవయవాల మిస్సింగ్ కేసులు నమోదవగా రామ్‌నగర్ నియోజకవర్గంలోనే ఇరవైమూడు కేసులు నమోదయ్యాయి.æప్రజలంతా రోజూ తనని కలిసి తమ గోడు చెబుతుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయన్నారు. ప్రజలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలని పోలీస్, వైద్యాధికారులపై గుర్రుమన్నారు. ‘‘రామ్‌నగర్ డీఎస్పీ ఎవరయ్యా.. ఆయన అధికారిగా ఉన్నచోటే ఇంత జరుగుతున్నా కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు’’ అని మంత్రి అరిచేసరికి.. సర్ ఈయనే రామ్‌నగర్ డీఎస్పీ నరేశ్ అని, మూడ్రోజుల క్రితమే కామారెడ్డి నుంచి బదిలీ అయ్యి వచ్చారని పై అధికారి మంత్రికి వివరణ ఇచ్చుకున్నాడు. సరే తన శాఖలో ఇదంతా జరుగుతోంది కాబట్టి, ప్రభుత్వానికి తాను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, త్వరగా కేసులను ఓ కొలిక్కి తేమని హుకుం జారీ చేశాడు మంత్రి. డీఎస్పీ నరేశ్ తన పరిధిలోని అవయవాల మిస్సింగ్ కేసులను పరిశోధించసాగాడు. ఈ క్రమంలో ఆ మరుసటి రోజే బాధితుల్లో కొందరి కుటుంబ సభ్యులను డీఎస్పీ నరేశ్‌ను కలిశాడు. ‘‘సార్! మాది రామ్‌నగర్ నియోజకవర్గంలోని కొండాపూర్. మా అబ్బాయి ప్రసాద్ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో ఉండగా ఉన్నట్టుండి కిందపడిపోయాడు. కాలేజీ వాళ్లు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చూసి మా అబ్బాయికి సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ అయిందని వెంటనే గుండె మార్పిడి చేయాలన్నారు. అందుకోసం రాజధానిలోని అన్ని ఆస్పత్రులకు తిప్పి చివరికి కాపాడలేక చేతులెత్తేయగా ప్రసాద్ చనిపోయాడు. కానీ మా బంధువుల్లో ఒకరు మెడికల్ ఫీల్డులో ఉన్న వ్యక్తి ఇందులో అనుమానం ఉందని భావించి తనకు తెలిసిన డాక్టర్‌తో శవాన్ని పరీక్షింపచేయగా, మా అబ్బాయి శరీరంలో కిడ్నీలు, లివర్ లేవని తెలిసింది’’ అని ఏడుస్తూ చెప్పారు. తర్వాత కేసును ఈ స్టేషన్‌కు బదిలీ చేశారని సిబ్బంది తెలిపారు. తర్వాత ఆ డాక్టర్‌ను కలిసిన డీఎస్పీ నరేశ్.. ప్రసాద్‌ను ఏయే ఆస్పత్రులకు తిప్పారని, చివరకు ఏ ఆస్పత్రిలో చనిపోయాడని కనుక్కుని వివరాలన్నీ సేకరించాడు. అందులో సుజనా ఆస్పత్రి పేరు కూడా ఉంది. ప్రసాద్ శవాన్ని పరీక్షించినప్పుడు అవయవాలు లేవని తెలియడంతో పాటు ఈ చిన్న సర్జికల్ నైఫ్ శరీరంలోనే ఉందని డీఎస్పీ నరేశ్‌కు డాక్టర్ చూపించాడు. ఆ నైఫ్‌ను ఆపరేషన్ చేశాక శరీరంలోనే మర్చిపోయి ఉంటారని భావించిన నరేశ్ దాన్ని ల్యాబ్‌కు పంపించి వివరాలు కనుక్కోమని సిబ్బందికి చెప్పాడు. సాయంత్రం కల్లా వచ్చిన వివరాల్లో నైఫ్ మీద ‘ఎస్‌హెచ్’ అని చిన్న అక్షరాలున్నాయని, అది సుజనా హాస్పిటల్స్ లోగో అని నరేశ్‌కు విచారణలో తేలింది. దాంతో ఇప్పటి వరకూ మిస్సయిన కేసుల్లో కూడా ఆ హాస్పిటల్ వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటం, పైగా జయంతి మహల్లో కూడా భాగస్వామ్యం ఉండటంతో డీఎస్పీ నరేశ్‌కు ఆ ఆస్పత్రి ఎండీ డాక్టర్ రజనీకాంత్‌పై సందేహం కలిగింది. వెంటనే ఆస్పత్రి వివరాలు కావాలని అడిగేసరికి సిబ్బంది ఆస్పత్రికి సంబంధించిన బ్రోచర్‌ను చూపించారు. అందులో డాక్టర్ రజినీకాంత్ ఫొటో చూసి ఆశ్చర్యపోయాడు నరేశ్. అతనిపై అనుమానం కలిగినప్పటి నుంచి వివరాలన్నీ సేకరించి రజినీకాంత్‌ను అదుపులోకి తీసుకోవాలని పై అధికారులకు తెలిపారు. కష్టంగా లభించిన అనుమతితో రజినీకాంత్‌ను అదుపులోకి తీసుకున్న నరేశ్ ఇంటరాగేషన్ ప్రారంభించాడు. ‘‘ఆ.. చెప్పండి.. ఈ ఆర్గాన్ రాకెట్‌కు మీకు ఏంటి సంబంధం’’ అని రజినీకాంత్‌ను అడిగాడు నరేశ్. ఏదో ఇన్ఫర్మేషన్ కావాలని తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నారని ఎదురు ప్రశ్నించాడు రజినీకాంత్. ‘‘అసలు నన్నేమనుకుంటున్నావ్..?’’ అని లేచే సరికి పోలీసు ట్రీట్మెంట్ చవిచూపించాడు డీఎస్పీ. ‘‘చెప్పు.. నీకూ, మినిస్టర్ తులసీదాస్‌కు ఏంటి సంబంధం? అసలు ఈ అవయవ మార్పిడి కేంద్రంగా ఏం జరుగుతోంద’’ని బాంబు పేల్చేసరికి తెల్లబోయాడు రజినీకాంత్. ‘‘ఆ రోజు మినిస్టర్ చాంబర్ నుంచి నేను బయటికి వస్తుంటే నువ్వు మంత్రిని కలవడానికి అక్కడ కూర్చున్నావ్.. మా సిబ్బంది మీ ఆస్పత్రి బ్రోచర్‌ను చూపించినప్పుడే నీ ఫొటో చూసి అనుమానం కలిగింద’’ని చెప్పాడు. విచారణ కొంచెం హార్డ్‌గా చేసే సరికి నిజం కక్కాడు రజినీకాంత్.. ‘‘నేనూ, తులసీదాస్ కలిసి చదువుకున్నాం. కానీ మధ్యలో వాళ్ల నాన్న గారు చనిపోవడంతో అతను ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. తన కోరికను తన కొడుకు తీర్చాలని సంహిత్ను ఐర్లాండ్‌లో డాక్టర్ చదివించి పెద్ద ఆస్పత్రి నిర్మించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అందుకు తన నియోజకవర్గంలోనే ప్రజల మధ్య సంహిత్తో చిన్న ఆస్పత్రి ప్రారంభించి ఉచిత సేవలు ప్రారంభిద్దామని అనుకున్నాడు. సంహిత్ ఇక్కడెందుకు ఫారిన్లో ప్రాక్టీస్ చేయిద్దామనేసరికి, ఇక్కడైతే ప్రాక్టీసులో ఏమైనా పొరపాటు జరిగినా తాను చూసుకుంటానని, పైగా తనకు ఇక్కడి ప్రజల మధ్య మంచి పేరు వస్తే రాజకీయంగా ఉపయోగపడుతుందని అన్నాడు. కానీ సంహిత్‌కు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హార్ట్‌ను మార్చాలని డాక్టర్లు వెతుకుతుండగా, సరిగా అదే సమయానికి రామ్‌నగర్ వ్యక్తి ఒకరు బ్రెయిన్ డెడ్ అయ్యారు. అతని గుండె కావాలని వారి తల్లిదండ్రులను కోరితే వారు ఎంతకీ ఒప్పుకోలేదు. దీంతో సంహిత్ చనిపోయాడు. అంతే..! అప్పట్నుంచి కొడుకు పోయిన బాధ ఒక వైపు.. తాను ప్రజలకు ఇంత చేసినా.. తన కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే సాయం చేయాలేకపోయారని పగ మరోవైపు. రెండు రకాలుగా తులసీదాస్ నలిగిపోయాడు. తర్వాత తన పలుకుబడితో ఆరోగ్య శాఖ మంత్రి అయ్యాడు. ముందుగా అనుకున్న ప్రకారమే ప్రజలు భయపడుతున్న జయంతి మహల్‌ను ఆస్పత్రిగా కాకుండా, అవయవ మార్పిడి కేంద్రంగా మార్చాం. అక్కడ మా ఆస్పత్రి ఆధ్వర్యంలో రాజధాని నుంచి వచ్చే కేసుల్లో అవయవాలను వేరుచేసి వేరే దేశాలకు రహస్యంగా ఎగుమతి చేస్తున్నాం. అందులో భాగంగానే అక్కడ జనం ఎక్కువగా తిరుగుతూ పనికి ఇబ్బందిగా మారిందని వార్డ్‌బాయ్‌ని చంపి చెట్టుకు ఉరివేశాం. భయంతో అప్పట్నుంచి జనం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మా వ్యాపారానికి అవసరమైన అనుమతులు ఇచ్చి ప్రభుత్వం నుంచి తులసీదాస్ సహాయం చేసేవాడు’’ అని ముగించాడు రజనీకాంత్. ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత తులసీదాస్ మంత్రి పదవి ఊడింది. అంతేకాదు, డాక్టర్‌తో పాటు తులసీదాస్ కూడా జైలుపాలయ్యాడు. - ఉమేశ్ కోమటి -
ఆ సత్తా మాలో ఉంది: ఉమేశ్
న్యూఢిల్లీ: ‘దక్షిణాఫ్రికా పిచ్‌లు అనగానే సహజంగా అందరి దృష్టి పేస్ బౌలింగ్‌పైనే ఉంటుంది. దానికి తగ్గట్లే మా మీద అంచనాలూ ఉంటాయి. ప్రస్తుత మన పేస్ బృందానికి సఫారీలను రెండుసార్లు ఆలౌట్ చేయగల సత్తా ఉంది’ అని భారత సీమర్ ఉమేశ్ యాదవ్ అంటున్నాడు. ‘ఉపఖండంలో మేం రాణించేందుకు మంచి ఫిట్నెస్, చక్కటి ప్రణాళిక కీలకంగా నిలిచాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆశావహ దృక్పథంతో మైదానంలోకి దిగాం. ఇదే తీరును దక్షిణాఫ్రికాలోనూ కనబరిస్తే మమ్మల్ని ఎవరూ ఆపలేరు’ అని పేర్కొన్నాడు. దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌లా అవుట్ స్వింగర్ తన బలమని.., దానిని కాదని ఇన్‌స్వింగర్లకు ప్రయత్నిస్తే సహజ బలాన్ని కోల్పోతానని వివరించాడు. గత పర్యటనల్లో తామంతా యువకులం కావడంతో పాటు, భారీ అంచనాల ఒత్తిడితో ఇబ్బంది పడినట్లు ఉమేశ్ తెలిపాడు. ఈసారి తనతో సహా షమీ, ఇషాంత్, భువీ, బుమ్రా ఉత్సుకతను అదుపులో ఉంచుకుంటూనే పరిస్థితులను గమనిస్తున్నామని పేర్కొన్నాడు. -
పేదరికమే కట్టేసింది!
బతుకుఛిద్రం అవును, వాళ్లిద్దరినీ పేదరికమే కట్టేసింది. ప్రపంచంలో అన్నింటికంటే క్రూరమైనది ఏదంటే.. అది పేదరికమే. పేదరికం అంత క్రూరంగా ఉంటుందా? రాజస్థాన్‌లోని ఉమేశ్, జీవాలను చూస్తే అవునని చెప్పక తప్పదు. ఉమేశ్‌కి ఎనిమిదేళ్లు. రాజస్థాన్‌లోని కోల్యారి గ్రామం. గడచిన ఐదేళ్లుగా అతడు జీవిస్తున్నది పశువుల పాకలోనే, ఆవుల పక్కనే. మరో కుర్రాడు జీవాకి పదకొండేళ్లు. ఉదయ్‌పూర్‌కి దగ్గర్లోని బయాడి గ్రామం. అతడిని చెట్టుకి కట్టేసి పొలంలో పని చేసుకుంటాడు అతడి తండ్రి హుర్మారామ్. ఈ పిల్లలిద్దరికీ మతిస్థిమితం లేదు. ఎప్పుడు స్తబ్దుగా ఉంటారో, ఎప్పుడు మితిమీరిన ఉత్సాహంతో పరుగులు తీస్తారో ఊహించడం కష్టమే. అలాంటి పిల్లలను ఇరవై నాలుగ్గంటలూ కనిపెట్టుకుని ఉండడం ఒక మనిషికి సాధ్యమయ్యే పని కాదు. ఇంట్లో వాళ్లు వంతుల వారీగా పంచుకుంటే తప్ప సాధ్యం కానేకాదు. కన్న బిడ్డలను కడుపులో పెట్టుకుని సాకాలని ఎవరికుండదు? ఇలాంటి బిడ్డలనైతే మరీ ఎక్కువగా చూసుకోవాలి. మరి ఇలా కనిపెట్టుకుని చూడడానికి అమ్మానాన్న ఉంటేనే కదా! ఉమేశ్ తండ్రి భగవతి లాల్, తల్లి మనుదేవి హెచ్ఐవితో పోయారు. నానమ్మ, తాతే దిక్కు. వాళ్లకు వయసైపోయింది. అయితే ఆ కట్టేసేదేదో ఇంట్లోనే ఒక పక్కన కట్టేస్తే... ఇంట్లోనే ఆడుకుంటూ, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాడు కదా అంటే... నిజమే. కానీ ఉమేశ్‌కి ఒకటి, రెండు అవసరాలకు బయటకు వెళ్లడమూ తెలియదు. ఇంట్లోనే చేస్తే శుభ్రం చేసే ఓపిక ఆ ముసలివాళ్లకు లేదు. అందుకే ఉమేశ్ ఆవు పక్కన మరో గుంజకు బంధీ అయ్యాడు. ఆవు చేసినట్లే అక్కడే అన్నీ చేస్తున్నాడు. కట్టు విప్పితే పరుగులు పెట్టి పారిపోతాడని, అతడిని పట్టుకుని రావడం తన వల్ల అయ్యే పని కాదని, అందుకే కట్టేయక తప్పడం లేదంటోంది 75 ఏళ్ల నానమ్మ పీపీ బాయ్. ఉమేశ్ పుట్టడం బాగానే పుట్టాడని, మూడేళ్ల వరకు బాగానే ఉన్నాడని, తల్లిదండ్రులు మరణించిన తర్వాత అతడిలో విపరీత ప్రవర్తన మొదలైందంటోందామె. వైద్యం చేయించాలంటే డబ్బులేదని కన్నీళ్ల పర్యంతమైంది పీపీబాయ్. జీవాకి పోలియోతోపాటు బుద్ధిమాంద్యం కూడ. ఎక్కడ వదిలితే ఎటు వెళ్లిపోతాడో తెలియదు. ఎక్కడ నుంచి జారిపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడో ఊహించలేం. గతంలో జరిగాయి కూడా. అందుకే చెట్టుకి కట్టేసి పొలం పనులు చేసుకుంటున్నాననంటాడు హుర్మారామ్. ఆ రాష్ట్ర చైల్డ్వెల్ఫేర్ కమిటీ ప్రతినిధుల జోక్యంతో ఉమేశ్, జీవాలు ఇటీవల విడుదలయ్యారు. అధికారులు వాళ్లను రెస్క్యూ హోమ్‌కి తరలించారు. ఇలాంటి పిల్లలను కట్టేయడం నేరమని వారిని మందలించారు అధికారులు. వారి మేధోపరిణతికి తగ్గట్లుగా వ్యవహరిస్తూ అన్ని విషయాలనూ తెలియచెప్పాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. నిజానికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది ఆ పేద తండ్రికి, నానమ్మకు కాదు. దేశంలో ఇంకా పోలియోను తరిమి కొట్టలేని పాలకులకు, హెచ్ఐవి బాధితుల పిల్లలకు సరైన పునరావాసం కల్పించలేని ప్రభుత్వానికి. -
వేములవాడ యువకుడి దారుణ హత్య
కరీంనగర్ : వేములవాడ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన నలువల ఉమేష్ (24) అనే యువకుడు గురువారం అర్థరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఆగంతకులు ఉమేష్‌ను కత్తులతో పొడిచి దారుణంగా చంపి... పరారైయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకేసారి రెండు సినిమాలు
చంద్రకాంత్, ఉమేశ్, వర్షిత జంటగా ‘ప్రేమవేదం’, ‘సూర్యనేత్రం’ పేరుతో ఒకేసారి రెండు చిత్రాలు ప్రారంభమయ్యాయి. ఈ రెండింటికీ దర్శక - నిర్మాత వినోద్‌వర్మ. ఈ సినిమాలతో తమకు గుర్తింపు వస్తుందని హీరో హీరోయిన్లు ఆశాభావం వెలిబుచ్చారు. వినోద్‌వర్మ మాట్లాడుతూ, ‘‘ఇరవై మూడేళ్లుగా పరిశ్రమలో పలు శాఖల్లో పనిచేశాను. టాటా మూవీస్ సంస్థ స్థాపించి, కొత్తవారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాను. సెప్టెంబరులో చిత్రీకరణ మొదలుపెట్టి ఏకధాటిగా షూటింగ్ జరిపి, పూర్తిచేస్తాం’’ అని తెలిపారు. -
సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదం
అనంతపురం జిల్లా: సెల్‌ఫోన్ చార్జీంగ్ పెట్టి తీస్తుండగా ఒక యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఉమేష్ (20) తన సెల్‌ఫోన్‌కీ చార్జింగ్ పెట్టి తీస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఉమేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా ఆదివారం అదే గ్రామంలో పలు ఇళ్లలో కొంత మందికి కరెంట్ షాక్ కొట్టినట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, విద్యుదాఘూతానికి గత కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. (రాయదుర్గం) -
సెమిస్టర్ పద్ధతి రద్దు చేయండి
బళ్లారి అర్బన్, న్యూస్‌లై న్ : ఐటీఐ విద్యార్థులకు ఇబ్బందికరమైన సెమిస్టర్ పద్ధతిని రద్దు చేయకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని ఏఐడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రమోద్ హెచ్చరించారు. ఆయన గురువారం ఏఐడీవైఓ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఐటీఐ విద్యార్థులతో కలిసి స్థానిక జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యత ఉందని, అయితే ప్రభుత్వం సెమిస్టర్ పద్ధతిని ప్రవేశ పెట్టడం వల్ల భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు తక్కువగా అవుతాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఐటీఐ కోర్సులలో ఈ సెమిస్టర్ పద్ధతిని అమలుతో గందరగోళం నెలకొందన్నారు. సెమిస్టర్ పద్ధతిలో విద్యార్థులకు బోధించడంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల, గత నవంబర్ నెలలో పాఠ్యాంశాలు (సిలబస్) మార్పు చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. గతంలో విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేందుకు అనుకూలంగా ఉండేదని, అయితే ఈ సెమిస్టర్ పద్ధతి అమలు చేయడంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. 2011లో ఎన్‌సీబీటీ 39వ సమావేశంలో సెమిస్టర్ పద్ధతిని అమలు పరిచేందుకు పాఠ్యంశాల బోధన, పరీక్ష విధానాలు, ప్రయోగశాలలో పరికరాలు సమకూర్చడం వాటిపై సరైన సమాచారం లేకపోవటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. 2013 మార్చి 14న నిపుణులు నిర్వహించిన సమావేశంలో తక్కువ వ్యవధిలో పాఠాల బోధనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. గత ఏడాది ప్రశ్నపత్రం కన్నడలో ముద్రించారు. ఈ ఏడాది ఇంగ్లిష్, హిందీలో తయారు చేయడం వల్ల విద్యార్థులు మరింత ఆందోళన కు గురవుతున్నట్లు చెప్పారు. ఈ ఆందోళనలో ఏఐడీవైఓ జిల్లా ఉపాధ్యక్షుడు రంగయ్య, ఏఐడీఎస్ఓ జిల్లాధ్యక్షుడు గోవింద, జిల్లా కార్యదర్శి ఉమేష్ పాల్గొన్నారు.