సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదం | younger suffered from vidyut shock | Sakshi
Sakshi News home page

సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదం

Published Sun, Apr 12 2015 10:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:13 AM

younger suffered from vidyut shock

అనంతపురం జిల్లా: సెల్‌ఫోన్ చార్జీంగ్ పెట్టి తీస్తుండగా ఒక యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఉమేష్ (20) తన సెల్‌ఫోన్‌కీ చార్జింగ్ పెట్టి తీస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఉమేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో మెరుగైన వైద్యం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అంతేకాకుండా ఆదివారం అదే గ్రామంలో పలు ఇళ్లలో కొంత మందికి కరెంట్ షాక్ కొట్టినట్లు సమాచారం. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా, విద్యుదాఘూతానికి గత కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
(రాయదుర్గం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement