'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు | Sai Kumar to play NTR's father in 'Janatha Garage' | Sakshi
Sakshi News home page

'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు

Published Mon, Feb 22 2016 12:04 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు

'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు

హైదరాబాద్‌: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'జనతా గ్యారేజ్'లో సీనియర్ నటుడు 'డైలాగ్ కింగ్' సాయికుమార్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ తండ్రి పాత్రను ఆయన పోషించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మలయాళ నటులు మోహన్‌లాల్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు పెదనాన్నగా మోహన్ లాల్ నటించనున్నారని సమాచారం. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. మార్చి 5 నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర యూనిట్ తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న 'జనతా గ్యారేజ్'ను ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement