సూపర్ స్టార్ సినిమాలో మోహన్లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు పరాభాష సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఈ స్టార్ హీరో తాజాగా మరో భాషలోనూ అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. అన్ని భాషల్లోనూ మల్టీ స్టారర్ సినిమాలతోనే ఎంట్రీ ఇస్తున్నాడు ఈ కంప్లీట్ యాక్టర్.
అదే బాటలో త్వరలో ఓ కన్నడ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల వరుస బ్లాక్ బస్టర్స్ తో సత్తా చాటుతున్న మోహన్ లాల్ ఈ సినిమాతో తన మార్కెట్ రేంజ్ ను మరింతగా పెంచుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.