పవర్ స్టార్ సినిమాలో సూపర్ స్టార్..? | Trivikram Srinivas and Pawan Kalyan film has Mohanlal | Sakshi
Sakshi News home page

పవర్ స్టార్ సినిమాలో సూపర్ స్టార్..?

Published Sun, Dec 25 2016 10:48 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవర్ స్టార్ సినిమాలో సూపర్ స్టార్..? - Sakshi

పవర్ స్టార్ సినిమాలో సూపర్ స్టార్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను ఫైనల్ చేశాడు పవర్ స్టార్. తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో వేదలం రీమేక్తో పాటు తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాలకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రను స్టార్ ఇమేజ్ ఉన్న నటుడితో చేయించాలని ఫిక్స్ అయ్యారు. అందుకే త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో నటించిన ఉపేంద్రను పవన్ సినిమాకు తీసుకున్నారన్న టాక్ వినిపించింది.

అయితే తాజాగా ఆ ప్లేస్లో మరో స్టార్ హీరో పేరు వినిపిస్తోంది. ఇటీవల మనమంతా, జనతా గ్యారేజ్, మన్యం పులి లాంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి సక్సెస్లు సాధించిన మలయాళ సూపర్ స్టార్  మోహన్ లాల్, పవన్ సినిమాలో కీలక పాత్రలోనటించనున్నాడు. ప్రస్తుతానికి ఈ విషయంపై అధికారిక ప్రకటన లేకపోయినా.. పవర్ స్టార్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement