బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని.. | bank managerharassment to business correspondent | Sakshi
Sakshi News home page

బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని..

Published Sat, Feb 6 2016 5:08 AM | Last Updated on Tue, Aug 28 2018 8:09 PM

బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని.. - Sakshi

బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని..

 కోదాడరూరల్: బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడని ఓ బిజినెస్ కరస్పాండెంట్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ  ఘటన కోదాడ మండల పరిధి అనంతగిరి చౌరస్తాలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఖానాపురం గ్రామానికి చెందిన సముద్రాల సాయికుమార్ అనంతగిరి ఎస్‌బీహెచ్ బ్యాంకు పరిధిలో బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్‌గా (బీసీఏ) ఉంటూ తన ఏరియాలో జీరో అకౌంట్‌లో తీసుకున్నాడు. ఇతడికి జీరో అకౌంట్లు తీసేందుకు ఎస్‌బీహెచ్ బ్యాంకు వారే ఎక్యుప్‌మెంట్స్ ఇచ్చారు. గత మే నెలలో 92 మంది ఖాతాలు తీసేందుకు సంబంధిత డాక్యుమెంట్స్‌ను బ్యాంకులో ఇచ్చి అప్‌లోడ్ చేయమన్నాడు.


ఈ సమయంలో బ్యాంకు మేనేజర్ బదిలీపై వెళ్లాడు. అప్పటి నుంచి సాయికుమార్  ఖాతాల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. ఇటీవల కాలంలో ఖాతా కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లు సాయికుమార్‌ను బ్యాంక్ పాస్‌పుస్తకాలు ఇవ్వాలని ఒత్తిడి పెంచారు. అతను కొద్ది రోజుల క్రి తం బ్యాంకుకు  వెళ్లి తాను తెచ్చిన జీరో అకౌంట్ తె రవాలని ప్రాథేయపడ్డాడు. కొత్తగా వచ్చిన మేనేజర్ బ్యాంకు అకౌంట్లు తెరవకుండా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని తెలిపాడు. ఈ విషయంపై ఈ నెల 1న సాయికుమార్ సూర్యాపేటలోని ఎజీఎంకు ఫిర్యాదు చేశాడు. అక్కడ ఆయన 3న బ్యాంకుకు వెళ్లి అకౌంట్లు తీసుకోవాలని సూచించాడు.


బ్యాంకుకు వెళితే మేనేజర్ నా మీద ఎంజీఎంకు ఫిర్యాదు చేస్తావానీపై ఎస్టీ కేసు పెడతానని సాయికుమార్‌ను వేధించాడు. దీంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ అనంతగిరి చౌరస్తాలో పురుగు మందు తాగా డు. బ్యాంక్‌కు వెళ్తుండగా మార్గ మధ్యలో ఆటో డ్రైవ ర్లు గమనించి అతడిని కోదాడలోని ఓ ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్ర స్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని రెండురోజులు గడిస్తేగాని ఎం చెప్పలేమని వైద్యుడు తెలిపారని కుటుంబసభ్యులు తెలిపారు.  ఈ సంఘటనపై  వేధింపులకు గురి చేసిన  బ్యాంకు మేనేజర్, అకౌంటెంట్‌పై  చర్యలు తీసుకోవాలని బాధితుడి భార్య వినీత కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement