నన్ను కుక్కలా చూసుకో: హీరో | SR Kalyana Mandapam Teaser Out Now | Sakshi

'ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం' టీజర్‌ రిలీజ్‌

Feb 4 2021 12:43 PM | Updated on Feb 4 2021 1:47 PM

SR Kalyana Mandapam Teaser Out Now - Sakshi

‘రాజావారు రాణిగారు’ ఫేమ్‌ కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణ మండపం. ‘టాక్సీవాలా’ ఫేమ్‌ ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆ మధ్య రిలీజైన చూశాలే కళ్లారా... పాట సూపర్‌ హిట్టైన విషయం తెలిసిందే. తాజాగా గురువారం నాడు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌లో దాదాపు ముఖ్యమైన పాత్రలన్నింటినీ చూపించారు. డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌ ఈసారి సీరియస్‌ లుక్‌లో కాకుండా కామెడీకి స్కోప్‌ ఉన్న పాత్రలో నటించి అందరికీ కితకితలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: టాలీవుడ్‌లోకి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఎంట్రీ ఫిక్స్‌)

ఇక హీరో ఇంట్రడక్షన్‌లోనే మందు తాగుతూ కనిపించాడు. ప్రతి ఒక్కడికీ తన గర్ల్‌ఫ్రెండ్‌ నడుము మీదనే పంచాయితీ అని తెగ విసుక్కుంటున్నాడు. కానీ తన మీద అంత ప్రేమ చూపిస్తున్న హీరోను కుక్కతో పోల్చుతోంది హీరోయిన్‌. 'నేను నీకెప్పటికీ పడను. నా దృష్టిలో నువ్వు కుక్కవు' అని చీదరించుకుంటోంది. అయినా సరే, వెనకడుగు వేయని హీరో నన్ను కుక్కలా చూసుకుంటూ నీ దగ్గరే పెట్టేసుకో అంటూ ఆమెను ప్రేమలోకి దింపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. (చదవండి: ఫ్యాన్స్‌కు శింబు బర్త్‌డే గిఫ్ట్‌)

బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌ అయిన కిరణ్‌.. జీవితంలో బాగుపడుదాం అని ఎస్‌ఆర్‌ కల్యాణ మండపం పెడతాడు కానీ, అందులో పెళ్లిళ్లు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు. మరోవైపు చిన్నప్పటి నుంచి కిరణ్‌ ఒక్కరినీ కొట్టడం చూడటం లేదన్న తండ్రి ముందే హీరోయిజం చూపిస్తూ ఫైటింగ్‌ ఇరగ దీస్తున్నాడు‌. ఓవరాల్‌గా ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ ట్రైలర్‌ లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement