kalyana mandapam
-
మోసం చేశాడని కేసు పెట్టి జైలుకు పంపి.. పెళ్లి చేసుకుంటుంటే పెట్రోల్‌తో..
సాక్షి, విశాఖపట్నం: ఓ యువతి తనను మోసం చేశాడని ప్రేమికుడిపై కేసు పెట్టి జైలుకు పంపింది. జైలు నుంచి విడుదలైన యువకుడు మరో పెళ్లి చేసుకుంటుంటే అదే యువతి కల్యాణ మండపానికి వచ్చి పెట్రోల్ బాటిల్‌తో రచ్చచేసింది. విషయం గాజువాక పోలీసులకు చేరడంతో వారు వచ్చి యువతి బంధువులకు నచ్చజెప్పారు. కోర్టు వివాదంలో ఉన్న అంశాన్ని కోర్టులో తేల్చుకోవాని సూచించారు. యువతి బంధువులకు నచ్చచెబుతున్న గాజువాక సీఐ భాస్కరరావు జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాం గ్రామానికి చెందిన ఎం. విజయ్ భగత్ ఓ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను పార్వతీపురానికి చెందిన డి. ప్రియాంక అనే యువతిని ప్రేమించి కొంత కాలం తర్వాత వదిలేశాడు. దీంతో ఆమె విజయ్‌భగత్ మోసం చేశాడని మే నెలలో కేసు పెట్టడంతో యువకునికి జైలు శిక్ష పడింది. జైలు నుంచి వచ్చిన విజయ్ భగత్ మరో సంబంధం చూసుకొని శనివారం నాతయ్యపాలెంలోని కల్యాణ మండపంలో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియాంక తన బంధువులు, స్నేహితులతో కల్యాణ మండపానికి చేరుకొని పెట్రోల్ బాటిల్‌తో బెదిరింపులకు దిగింది. సమాచారం అందుకున్న గాజువాక సీఐ ఎల్.భాస్కరరావు, ఎస్ఐ కొల్లి సతీష్ వచ్చి కోర్టు పరిధిలో ఉన్న అంశంలో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని యువతితో పాటు బంధువులకు సూచించారు. చదవండి: (విశాఖ.. ఎగుమతులకు స్వర్గధామం) -
భవిష్యత్తుపై ఎన్నో కలలు.. భర్తతో అమెరికా జీవితం గురించి ఆశలు..
వడమాలపేట (చెన్నై): ఆమె భవిష్యత్తుపై ఎన్నో కలలు కంది.. కాబోయే భర్తతో అమెరికాలో మొదలుపెట్టబోయే జీవితం గురించి ఆశలు.. అయితే విధి రోడ్డు ప్రమాదం రూపంలో కల్లలు చేసింది. ఆమె ఆశల్ని చిదిమేసింది. తన వివాహానికి కల్యాణ మండపం బుక్ చేయడానికి వస్తూ ఆమె తిరిగిరాని లోకాలకు చేరుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన సెల్వంకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె ప్రియాంక(30) ఎంఈ పూర్తి చేసింది. గత వారం ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. తిరుపతి లేదా తిరుమలలో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి తరువాత ఆమె భర్తతో అమెరికా వెళ్లాల్సి ఉంది. కల్యాణ మండపం బుక్ చేయడానికి అమ్మ, నాన్న, చిన్నాన్న కొడుకుతో కలిసి సోమవారం బొలెరో వాహనంలో ప్రియాంక తిరుపతికి బయల్దేరారు. నగరి వరకు కారును ఆమె తండ్రి నడుపుతూ వచ్చాడు. అయితే అతడు అలసిపోవడంతో ప్రియాంక అక్కడ నుంచి డ్రైవింగ్ చేసింది. మార్గమధ్యంలో వడమాలపేట మండలం అంజేరమ్మ ఆలయం వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ప్రియాంక తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రులకు ఎలాంటి గాయాలు కాలేదు. తమ్ముడికి మాత్రం స్వల్పగాయాలయ్యాయి. ప్రియాంక బంధువులు కాంచీపురం, చెన్నై, నగరి తదితర ప్రాంతాల నుంచి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రైవేటు అంబులెన్సులో మృతదేహాన్ని కాంచీపురానికి తరలించారు. చదవండి: (ఆమె కోసం ఎంతకైనా.. ప్రియురాలికి గిఫ్ట్ ఇచ్చేందుకు భార్య..) -
అన్నవరం: ఇక పేదలకు కల్యాణ వైభోగమే..
సాక్షి, అన్నవరం: సత్యదేవుని సన్నిధిన పేదలు ఉచితంగా పెళ్లి చేసుకునేందుకు ‘శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపం’ వేదిక కానుంది. దేవస్థానం అధికారులు ఇందుకు అనుమతిచ్చారు. ఆధునిక వసతులతో ఒకేసారి 12 వివాహాలకు వీలుగా ఇక్కడ వేదికలు నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రావణ మాసంలో జరిగే పెళ్లిళ్లకు అప్పుడే రిజర్వేషన్లు మొదలయ్యాయి. అన్నవరంలో పెళ్లి అదో ‘వరం’ రత్నగిరిపై పెళ్లి చేసుకున్న వారి బతుకులు బాగుంటాయన్నది భక్తుల విశ్వాసం. ఈ కారణంతోనే ఉభయ గోదావరి జిల్లాల వారే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వివాహాలకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆర్థిక స్తోమతను బట్టి ఇక్కడ కల్యాణ మండపాలను అద్దెకు తీసుకుంటారు. ఏటా ఐదు వేలు పైగా పెళ్లిళ్లు జరుగుతాయి. తక్కువ ఖర్చుతో వివాహం చేసుకోవాలనుకునేవారు ఇప్పటి వరకూ ఆరుబయట చేసుకునేవారు. వర్షం వస్తే వీరు చాలా ఇబ్బంది పడేవారు. పెళ్లి మధ్యలో వర్షం వస్తే షెల్టర్ కిందకు పరుగులు పెట్టిన సందర్భాలెన్నో. శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం 3.5 కోట్లతో కల్యాణ మండపం కొండపై పెళ్లిళ్లకు పేదలు పడుతున్న ఇబ్బందులకు స్పందించి శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. రూ.3.5 కోట్లతో శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం (ఏసీ) నిర్మించారు. ఈ నెల 16న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు దీనిని ప్రారంభించారు. మంటపం కేటాయింపులో పేదలకే అగ్రాసనమని ఆలయ ఈఓ త్రినాథరావు తెలిపారు. కల్యాణ మంటపంలో వివాహ వేదికలు సదుపాయాలివీ.. ► వివాహానికి 50 కుర్చీలు, జంబుఖానా, పెళ్లిపీటలు, కాడి, ఇతర వివాహ సామగ్రి. వధూవరులకు రెండు గదులు, బాత్రూం సౌకర్యం. ► వివాహ వేదికలు కావాలంటే వధూవరుల ఆధార్ కార్డులు, శుభలేఖ లేదా పురోహితుని లగ్నపత్రిక, అవసరం. ► నెల రోజులు ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. ఆగస్టులో పెళ్లికి బుక్ చేసుకున్నాం ఉచిత కల్యాణ మంటపం చాలా బాగుంది. వేదికలు ఇంకా బాగున్నాయి. ఆగస్టు 25న రాత్రి 2.37 గంటలకు జరిగే పెళ్లికి కల్యాణ వేదికను బుక్ చేసుకున్నాం. దాతకు, దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు. – ఎన్.శ్రీనివాస్, అరసవిల్లి, శ్రీకాకుళం జిల్లా -
నన్ను కుక్కలా చూసుకో: హీరో
‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం. ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీధర్ గాదే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆ మధ్య రిలీజైన చూశాలే కళ్లారా... పాట సూపర్ హిట్టైన విషయం తెలిసిందే. తాజాగా గురువారం నాడు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్లో దాదాపు ముఖ్యమైన పాత్రలన్నింటినీ చూపించారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఈసారి సీరియస్ లుక్‌లో కాకుండా కామెడీకి స్కోప్ ఉన్న పాత్రలో నటించి అందరికీ కితకితలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: టాలీవుడ్లోకి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఎంట్రీ ఫిక్స్) ఇక హీరో ఇంట్రడక్షన్లోనే మందు తాగుతూ కనిపించాడు. ప్రతి ఒక్కడికీ తన గర్ల్‌ఫ్రెండ్ నడుము మీదనే పంచాయితీ అని తెగ విసుక్కుంటున్నాడు. కానీ తన మీద అంత ప్రేమ చూపిస్తున్న హీరోను కుక్కతో పోల్చుతోంది హీరోయిన్. 'నేను నీకెప్పటికీ పడను. నా దృష్టిలో నువ్వు కుక్కవు' అని చీదరించుకుంటోంది. అయినా సరే, వెనకడుగు వేయని హీరో నన్ను కుక్కలా చూసుకుంటూ నీ దగ్గరే పెట్టేసుకో అంటూ ఆమెను ప్రేమలోకి దింపేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. (చదవండి: ఫ్యాన్స్‌కు శింబు బర్త్‌డే గిఫ్ట్) బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయిన కిరణ్.. జీవితంలో బాగుపడుదాం అని ఎస్ఆర్ కల్యాణ మండపం పెడతాడు కానీ, అందులో పెళ్లిళ్లు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాడు. మరోవైపు చిన్నప్పటి నుంచి కిరణ్ ఒక్కరినీ కొట్టడం చూడటం లేదన్న తండ్రి ముందే హీరోయిజం చూపిస్తూ ఫైటింగ్ ఇరగ దీస్తున్నాడు. ఓవరాల్‌గా ఇంట్రస్టింగ్‌గా ఉన్న ఈ ట్రైలర్ లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఆలయ మండపాలు
ఆలయంలో వాహనాలు దర్శించిన భక్తులు తర్వాత తప్పక దర్శించాల్సిన ప్రదేశం కల్యాణమండపం. లోకకల్యాణం కోసం స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం.. లేక వార్షిక కల్యాణం కోసం ఈశాన్యంలో ఎత్తైన మండపాన్ని... కొన్ని చోట్ల రెండవ ప్రాకారంలో కల్యాణమండపాన్ని నిర్మిస్తారు. కల్యాణమండపం మధ్యలో నాలుగు స్తంభాలతో కల్యాణవేదిక ఉంటుంది. నాలుగు వేదాలకు.. యుగాలకు ప్రతీకలు ఆ నాలుగు స్తంభాలు. కల్యాణం జరిగే ఎత్తైన వేదికపై ఉత్సవమూర్తులనుంచి జరిపే కల్యాణాన్ని దర్శించడం ప్రతి భక్తుడి విధి. ఎందుకంటే ఆ కల్యాణం లోకశాంతి గురించి జరుగుతుంది కనుక. పరోపకారం..పరహిత చింతన మనం అలవర్చుకోవాల్సిందిక్కడే. ఆలయంలో అనేక మండపాలు నిర్మించాలని ఆగమ, శిల్పశాస్త్రాలు చెబుతున్నాయి. స్వామివారి అభిషేకానికి స్నపనమంటపం.. నాట్యం జరిపే నత్తమంటపం.. దేవతా గీతాలను ఆలపించే గేయమంటపం.. సుశ్రావ్యంగా వాద్యాలను మ్రోగించే వాద్యమంటపం.. దేవస్థానంలోని స్వామి వైభోగానికి తగినట్లు ఆస్థానమంటపం.. నిత్యం అగ్నిపూర్వకంగా హవిస్సులు సమర్పించే యాగమంటపం.. పూజా, ఉత్సవాలకు మాలలు కూర్చే పుష్పమంటపం.. ప్రత్యేక సందర్భాలలో వేంచేసే విజయమంటపం.. నైవేద్యం జరుగుతోందన్న విషయాన్ని తెలిపే ఘంటామండపం. గుడిని చుట్టే భక్తులకు ప్రదక్షిణమంటపం.. ప్రత్యేక సందర్భాలలో జపతపాది కార్యాలకు జపతపోమంటపం.. స్వామివారు ఊరేగింపు మధ్యలో ఉపశమనం కోసం ఏర్పరచే ఉద్యానమంటపం... పూజాదికాలకు ఉపయోగించే శ్రీచూర్ణ, కష్ణగంధ,సుగంధాలను నూర్చే పరిమళ మండపం.. ఆగమాలను పఠించే జరిపే ఆగమమండపం.. శాస్త్రాలను చదివి భక్తులకు తెలియజెప్పే అధ్యయనమండపం.. ఇంతేగాక ఉత్సవమూర్తులను అలంకరించే అలంకారమంటపం.. వసంతోత్సవం కోసం వసంతమంటపం.. ప్రత్యేక ఉపచారాల నిమిత్తం ఉపచారమంటపం.. ఊయలపై ఊగే డోలారోహణమంటపం.. భక్తులను ఆధ్యాత్మిక పరులుగా తీర్చిదిద్దే దీక్షామంటపం ఉత్సవాల్లో ధ్వజాన్ని ఎగురవేసే ధ్వజారోహణమంటపం.. భక్తులు తమ బరువంత ద్రవ్యాన్ని మొక్కుకుని తూగి సమర్పించే తులాభారమండపం.. దేవతావస్త్రాలను భద్రపరిచే వస్త్రమండపం.. భక్తులు భజనలు చేసుకునే భజనామండపం.. ఆయుధాగారమండపం.. అదేవిధంగా నూరుస్తంభాల.. వేయిస్తంభాలమండపాలు..సాలుమండపాలు మొదలైనవి భక్తులవసతి కోసం ఏర్పరచేవి ఇంకా చాలా మండపాలు ఉన్నాయి. ఈ మండపాలన్నీ భక్తుల సౌకర్యార్థం విశాలంగా.. అన్నివైపులా భక్తులు చూసే విధంగా ఎటువంటి గోడలు లేక కేవలం స్తంభాలతో ఏర్పాటు చేయమని.. మండపస్తంభాలపై భక్తిభావం పెంపొందించే దేవతామూర్తులను.. పురాణఘట్టాలను.. చెక్కి భక్తులకు కనువిందు చేయమని ఆగమ, శిల్పశాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. ఇలా మండపం భక్తులకు మరో ఆలయమే. కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
పెళ్లి మండపంలో భారీ చోరీ జరిగింది.
పెళ్లి మండపంలో భారీ చోరీ జరిగింది. పెళ్లి కూతురుకు చెందిన మూడు నక్లెస్‌లను గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని వాసవి ధర్మశాల కళ్యాణ మండపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక కళ్యాణమండపంలోకర్ణాటక కొల్లగల్కు చెందిన మానసకు హిందూపురానికి చెందిన అక్షిత్‌తో బుధవారం తెల్లవారుజామున పెళ్లి జరగనుంది. దీనికోసం బందువులంతా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడ పెళ్లి కూతురు పెద్దమ్మ రాధ తన వెంట తెచ్చిన మూడు నక్లెస్‌లను గదిలో పెట్టి స్నానానికి వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు నగలు ఎత్తుకె ళ్లారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. గత వారం ఇదే కుటుంబానికి చెందిన మరో వివాహవేడుకలో కూడా 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురవడం గమనార్హం. -
నల్లారి సోదరులు భూ బకాసురులు
రూ.300 కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమించిన కిరణ్ అనుచరులు కుమ్మక్కు కుట్రలకు కేంద్ర బిందువు చంద్రబాబు చింతల రామచంద్రారెడ్డి ధ్వజం పీలేరు, న్యూస్‌లైన్: అధికారాన్ని అడ్డుపెట్టుకొని నల్లారి సోదరులు భూ బకాసురులుగా మారారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. పీలేరు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సోమవారం మధ్యాహ్నం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లలో పీలేరులో రూ. 300 కోట్ల విలువగల ప్రభుత్వ భూములను ఆక్రమించారని ఆరోపించారు. మరోవైపు పరిశ్రమల పేరిట భూములను లాక్కొని బడుగు రైతులను వేధించారని దుయ్యబట్టారు. అయితే కిరణ్ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా స్థాపించిన దాఖలాలు లేవన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెం టనే ఆక్రమిత ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. కిరణ్ పాలనలో పీలేరులో తాగునీరు బిందె రూ. 3 నుంచి 5, వాల్మీకిపురంలో 25 రోజులకు ఒకసారి తాగునీరు వదులుతున్నారని తెలిపారు. గుర్రంకొండలో తాగునీరు లేద ని, కిరణ్ సొంత మండలం కలికిరిలోనూ తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారని తెలిపారు. విద్యుత్ సబ్స్టేషన్లలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.3 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. కిరణ్ చరిత్రహీనుడుగా మిగిలిపోతారని అన్నారు. కిరణ్ కొమ్ముకాసి అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలకు పాల్పడిన వారు త్వరలోనే శంకరగిరి మాన్యాలు చూడాల్సి వస్తుందన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంతటికైనా దిగుజారుతారని ధ్వజమెత్తారు. మతతత్వ బీజీపీతో పొత్తుపెట్టుకోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ముస్లీం మైనారిటీలు వాస్త వ పరిస్థితులను గుర్తించి టీడీపీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. ముస్లీం మైనారిటీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిం చామన్నారు. తాను జీవించినంత కాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కుటుంబానికి విధేయుడుగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఈనెల 16న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీలేరు ఎమ్మె ల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి హాజరవుతారని తెలి పారు. అలాగే ఈనెల 17న రాజంపేట లోక్‌సభ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నామినేషన్ వేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ నారే వెంకట్రమణారెడ్డి, మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకట్రామయ్య, జెడ్పీటీసీ అభ్యర్థి ఎం.రెడ్డిభాష, సర్పం చ్‌లు ఎం.రవీంద్రనాథరెడ్డి, ఆదినారాయణ, శ్రీనివాసులు, పార్టీ నేతలు ఏ.రాజారెడ్డి, షామియాన షఫీ, బీడీ.నారాయణరెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, కాకులారంపల్లె రమేష్‌రెడ్డి, దండు జగన్మోహన్రెడ్డి, ఎస్.హబీబ్భాష, కొత్తపల్లె సురేష్‌కుమార్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, ఎల్ఐసీ ద్వారకనాథరెడ్డి, పీ.అమరనాథరెడ్డి, కేశవరెడ్డి, ధర్మరాజు పాల్గొన్నారు. -
ఓరుగల్లు వేయి స్తంభాల గుడిలో అద్భుతం
తొలగించిన రాళ్లతో కొత్త కట్టడం మార్చికల్లా కల్యాణ మండపం పూర్తి సాక్షి ప్రతినిధి, వరంగల్: కాకతీయుల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఓరుగల్లు వేయి స్తంభాల ఆలయంలో కల్యాణ మంటపాన్ని పునర్నిర్మించే పనులు వేగం పుంజుకున్నాయి. దేశంలోనే తొలిసారిగా... ఏడేళ్ల కిందట తొలగించిన ఓ కట్టడం రాళ్లను ఒకదానిపై ఒకటి పేరుస్తూ పునర్నిర్మించేందుకు 50 మంది శిల్పులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి ప్రతీకగా 132 రాతి స్తంభాలుండే ఈ ప్రాంగణాన్ని క్రీస్తు శకం 1163లో రుద్రదేవుడు 850 ఏళ్ల క్రితం నిర్మించాడు. కాలక్రమంలో ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో పురావస్తుశాఖ పునర్నిర్మాణానికి సిద్ధపడగా, ప్రభుత్వం రూ.7 కోట్లు కేటాయించింది. దీని పునాదుల్లో కాకతీయులు అనుసరించిన ‘స్యాండ్ బాక్స్ టెక్నాలజీ’ని అనుసరించినట్లు ఇంటాక్ ప్రతినిధి రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఎన్ఐటీ ఇంజనీర్లు తెలిపారు. మండపం అడుగున 3 మీటర్ల లోతు మట్టి తొలగించి ఇసుక నింపి గ్రానైట్, ఇటుక, కరక్కాయలు, బెల్లం మిశ్రమంతో క్యూరింగ్ చేశారు. ఆ ఇసుక బేస్‌మెంట్‌పైనే రాళ్లను పేర్చుతున్నారు. భూకంపాలు వచ్చినా కట్టడం చెక్కు చెదరకుండా రాళ్లకు రాళ్లను పట్టి ఉంచేలా స్టెయిన్ లెస్ స్టీల్ పట్టీలు అమర్చుతున్నారు. 3000 శిలలు, గ్రానైట్ కళా ఖండాలు, రాతి స్తంభాలు పాత కట్టడం తొలగించినప్పుడు వెలికితీసి క్రమ పద్ధతిలో నంబర్లు వేసి భద్రపరిచారు. వీటిలో 41 స్తంభాలు పగిలి పోగా, శిల్పులతో మళ్లీ చెక్కించి, మండపాన్ని పునర్నిర్మిస్తున్నారు. బేస్మెంట్ నుంచి పది మీటర్ల ఎత్తు నిర్మాణం పూర్తయింది. చుట్టూ ఉండే ప్రదక్షిణ పథానికి ఏడు వరుసల్లో రాళ్లు పేర్చి, 4 వరుసల్లో కక్షాసనం నిర్మించారు. రంగ మండపం పశ్చిమాన గ్రానైట్ శిలలను నిలబెట్టారు. 10 మీటర్ల ఎత్తు నిర్మాణంతో 60% పనులు పూర్తయ్యాయి.వచ్చే మార్చి నెలాఖరుకల్లా మండపం పూర్తవుతుందని స్తపతి శివకుమార్ తెలిపారు.