
బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో ఐదు వారాలు గడిచిపోయాయి. ఆట ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. మొదట్లో గేమ్‌పై పెద్దగా ఫోకస్ పెట్టని వారు కూడా బరిలోకి దిగుతూ ఇతర కంటెస్టెంట్లకు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఈ క్రమంలో వారితో మరిన్ని కఠినతరమైన టాస్కులు ఆడించేందుకు బిగ్‌బాస్ రెడీ అయ్యాడు. అందులో భాగంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు కొన్ని ఆసక్తికరమైన డీల్స్ ఇస్తున్నాడు. వాటిని చేసేందుకు కొందరు తెగ ఇబ్బంది పడుతుండగా మరికొందరు మాత్రం సునాయాసంగా ఒప్పేసుకుంటున్నారు. బిగ్‌బాస్ ఇచ్చిన డీల్‌లో భాగంగా కుమార్ సాయి ఒంటి మీదున్న దుస్తులను ముక్కలు ముక్కలుగా కత్తిరించేశాడు. (చదవండి: నాగార్జున ఒక్కసారి కూడా మెచ్చుకోలేదు)
అభిజిత్ తన దుస్తులన్నింటినీ త్యాగం చేసేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. మరో డీల్‌లో ఒకమ్మాయి మెడ వరకు జుట్టును చిన్నగా కత్తిరించుకోవాలని ఆదేశించాడు. "దీనికి నేను అంగీకరించను, ఈ విషయం గురించి ఇక్కడికి వచ్చే ముందే మా అన్న నాకు వార్నింగ్ ఇచ్చి పంపించాడు" అని హారిక వెనకడుగు వేసింది. పైగా దీనివల్ల తన జుట్టు పెరగదు అని ఏడుస్తూనే హెయిర్ కత్తిరించుకునేందుకు అంగీకరించింది. అయితే ఇచ్చిన మాట తప్పుతున్నందుకుగానూ తన అన్నయ్యకు సారీ చెప్పింది. మరి బిగ్‌బాస్ ఇంకా ఏమేం డీల్స్ ఇచ్చాడో, వాటిని ఇంటి సభ్యులు పూర్తి చేశారో లేదో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: ఎలిమినేట్ అవుతా అనుకోలే: సుజాత)
Comments
Please login to add a commentAdd a comment