బిగ్‌బాస్ నాల్గో సీజన్లో నలభై రోజులు గడిచిపోయాయి. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవగా గంగవ్వ స్వచ్ఛందంగా హౌస్‌లో నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు మరో కంటెస్టెంటు ఇంటిని వీడే సమయం ఆసన్నమైంది. ఈ వారం నామినేషన్లో అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, అఖిల్, నోయల్, లాస్య, హారిక, దివి ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉన్నారో చూసేద్దాం..
ఓవర్ యాక్షనే ఆమెకు మైనస్
అభిజిత్, అఖిల్ దుమ్ము రేపే ఓట్లతో తొలి రెండు స్థానాల్లో హవా చూపిస్తున్నారు. ఇక లాస్య, కుమార్ సాయి, దివి, హారిక, నోయల్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. కానీ వారికి మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉంది. ఇక చివరి రెండు స్థానాల్లో అరియానా గ్లోరీ, మోనాల్ ఉన్నారు. వీరి బలాబలాలు చూసుకున్నట్లైతే అరియానాకు పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేనప్పటికీ ఆమె ఆడే తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఫేక్‌గా ఉండకుండా తనకు ఏది అనిపించిందో అదే మొహంపై చెప్పేస్తుంది. టాస్కులోనూ తనకు చేతైననంత వరకు కష్టపడుతుంది. కానీ ఓవర్ ఎగ్జైట్మెంట్ మాత్రం జనాలకు విసుగు తెప్పిస్తుంది. ప్రతీదానికి అతిగా రియాక్ట్ అవడమే ఆమె దగ్గర ఉన్న ఏకైక మైనస్. ఇక గ్లామర్‌గా ఉంటూ అందరినీ తనవైపు తిప్పుకోడానికి ప్రయత్నిస్తోంది. కానీ మోనాల్‌ను మాత్రం బీట్ చేయలేకపోతోంది. (చదవండి: ఏడేళ్లు అతడు నా భర్త అని చెప్పలేదు: లాస్య)
ఫ్యామిలీ ఆడియన్స్‌కు మోనాల్ దూరం
ఇక మోనాల్ విషయానికొస్తే వీకెండ్స్‌లో ఆమె ధరించే బట్టల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఆగ్రహానికి గురవుతోంది. అలాగే అటు అభిజిత్, ఇటు అఖిల్ ఇద్దరితో లవ్ ట్రాక్ నడిపించేందుకు ప్రయత్నిస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తోంది. పైగా మోనాల్ వాళ్ల ఎమోషన్స్‌తో ఆడుకుంటోందంటూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్సే ఆమె గురించి నిజాలు బయటపెట్టారు. దీంతో ఆమె వ్యవహారం ఆడియన్స్‌కు అంతగా మింగుడు పడటం లేదు. దానితోపాటు ఇప్పటికీ తెలుగులో మాట్లాకుండా హిందీ, ఇంగ్లీషులోనే ముచ్చట్లు పెట్టడంతో ఆమె ఏం మాట్లాడుతుందనేది కూడా చాలామందికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. (చదవండి: నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మానాన్న విడిపోయారు)
అమ్మాయిలను వదిలేస్తే కుమార్‌కు డేంజర్
ఈ కారణం వల్ల తెలుగు ప్రేక్షకులకు ఆమె అంతగా చేరువ కాలేకపోయింది. దీంతో ఆమెకు అత్యంత స్వల్పంగా ఓట్లు వచ్చాయి. అయితే హౌస్‌లో మసాలా కంటెంట్ కావాలన్నా, ట్రయాంగిల్ స్టోరీని ముందుకు తీసుకువెళ్లాలని బిగ్‌బాస్ నిర్వాహకులు ఓట్లతో సంబంధం లేకుండా ఆమెను సేవ్ చేసే అవకాశం ఉంది. దీంతో అరియానా, ఆ తర్వాత కుమార్ సాయిపై ఎలిమినేషన్ కత్తి వేలాడే అవకాశం ఉంది. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఓటింగ్ అవకాశం ఉండటంతో ఓట్ల సంఖ్య తారుమారయ్యే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అత్యంత ఆసక్తిగా మారింది. (చదవండి: అవునా.. అరియానాకు బిగ్‌బాస్ అంత ఇస్తున్నాడా?)
Comments
Please login to add a commentAdd a comment