బిగ్‌బాస్ రియాల్టీ షోలో ఎలిమినేషన్ అనేది ప్రేక్షకులు ఇచ్చే ఓటింగ్ ప్రకారం జరుతుంది. కానీ బిగ్‌బాస్ సీజన్ 4లో ఆరోవారం ఎలిమినేషన్ చూస్తే మాత్రం నిజంగా ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ చేస్తారా లేదా రేటింగ్‌ని దృష్టిలో ఉంచుకొని నచ్చని కంటెస్టెంట్స్‌ని పంపిస్తారా అనే సందేహాలు ప్రేక్షకుల్లో కలుగుతున్నాయి. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ప్రేక్షకుల ఓటింగ్‌కు విరుద్దంగా మోనాల్‌ని సేవ్ చేసి కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మోనాల్ కంటే కుమార్ సాయికి ఎక్కువ ఓట్లు వచ్చినా కావాలనే ఎలిమినేట్ చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు.
(చదవండి : నేను బైటకచ్చినంక అందరు ఏడిసిర్రట..)
వాస్తవానికి కుమార్ మొదట్లో కాస్త సైలెంట్‌గా ఉన్నా..తర్వాత వేగంగా పుంజుకున్నాడు. బిగ్‌బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్‌ని 100 శాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడాడు. మరీ ముఖ్యంగా గత వారం మాత్రం ఫిజికల్ టాస్క్‌లో కుమార్ సాయి ఒక్కడే హైలెట్‌గా నిలిచాడు. సోదరా అంటూ హౌస్‌మేట్స్‌తో కూడా కలిసేందుకు ప్రయత్నించాడు. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. ఇక మోనాల్ మాత్రం హౌస్‌లోకి వచ్చిన దగ్గరనుంచి ఆట మీద ఫోకస్ లేకుండా ముందు అభి పక్కన ఆ తరువాత అఖిల్ పక్కన చేరి ముచ్చట్లు పెడుతూ వచ్చింది. ఆ తర్వాత మరికొంత ముందు కెళ్లి అఖిల్‌కి హగ్గులు, పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్‌తో స్క్రీన్ స్పేస్‌ని పెంచుకుంది. అయితే మోనాల్ ప్రవర్తన ప్రేక్షకులకు ఏమాత్రం గిట్టడం లేదు. బిగ్‌బాస్ హౌస్‌కి ఆడటానికి వచ్చారా రొమాన్స్ చేయడానికి వచ్చారా అని బుల్లితెర ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
దీంతో గతవారం వారికి ఉన్న ఓటు ఆయుధంతో మోనాల్‌ని బయటకు పంపాలని భావించారు. అనుకున్నట్లే మోనాల్‌కి తక్కువ ఓట్లు వచ్చాయి కూడా. దీంతో ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఆమె బిగ్‌బాస్ హౌస్ నుంచి ఉద్వాసన పలుకుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆట మీద ఫోకస్ చేస్తూ తన పనేదో తాను చేసుకుంటున్న కుమార్ సాయి ఎలిమినేట్ చేశారు బిగ్‌బాస్.
హౌస్‌లో ఇతర కంటెస్టెంట్స్ సపోర్ట్ అంతగా లేకున్నా ఒంటరిగా గేమ్ ఆడుతూ అలరించిన కుమార్ సాయి ఎలిమినేషన్‌ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ మమ్మల్ని ఓట్లేయమని అడగడం ఎందుకు అని బిగ్‌బాస్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. టీఆర్పీ రేటింగ్ కోసం నిజాయితీగా ఆట ఆడేవాళ్లను ఎలిమినేట్ చేస్తారా? ఇక బిగ్ బాస్ షో చూడం.. హాట్ స్టార్ యాప్‌తో పాటు స్టార్ మా ఛానల్‌ను అన్ లైక్ చేస్తాం. అలాగే యూట్యూబ్‌లో బిగ్ బాస్ ప్రోమోకి డిస్ లైక్‌లు కొట్టి మా సత్తా చూపిస్తాం.. అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియ ఓటింగ్ ప్రకారం జరగట్లేదు.. రేటింగ్ ప్రకారమే జరుగుతోంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి ట్రోలింగ్ బిగ్‌బాస్-4 కి కొత్తేమి కాదు. గత వారాల్లో కూడా దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment