
హాస్య నటుడిగా ప్రేక్షకులను నవ్వించిన, నవ్విస్తున్న సప్తగిరి హీరోగా మారిన విషయం తెలిసిందే. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’తో మంచి విజయం అందుకున్న ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’. హిందీ హిట్ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’కి రీమేక్ ఇది. కాశిష్ వోహ్రా కథానాయిక. చరణ్ లక్కాకులను దర్శకునిగా పరిచయం చేస్తూ డా. రవికిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ఎడిటర్ గౌతంరాజుగారి వద్ద నేను అసిస్టెంట్‌గా పనిచేశా. నేను దర ్శకత్వం చేస్తే ఆయన్నే ఎడిటర్‌గా పెట్టుకోవాలనుకున్నా. ఈ సినిమాతో నా కల నెరవేరింది. మా గురువులు పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకి మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి చాలా మంచి పాటలిచ్చారు. ఆద్యంతం సినిమా నవ్వుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘సప్తగిరి ఈ సినిమా కోసం బాగా హార్డ్‌వర్క్, హోమ్‌వర్క్ చేశాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడు ఎవరు అనే ఆలోచన రాగానే సాయికుమార్‌గారు గుర్తొచ్చారు. ఆయన తప్ప ఈ పాత్ర వేరే ఎవరూ చేయలేరు. ఈ సినిమాలో చెప్పాలంటే ఇద్దరు హీరోలు. ఒకరు సాయికుమార్, మరొకరు సప్తగిరి. పేదవాడికి కూడా న్యాయం దక్కాలన్నదే ఈ చిత్రకథ’’ అన్నారు రవికిరణ్. ‘‘శివప్రసాద్‌గారు, సాయికుమార్‌గారి సపోర్ట్ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. చివరి 45 నిమిషాల్లో తల తిప్పుకోలేనంతగా సన్నివేశాలు ఉంటాయి. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ఎంత విజయం సాధించిందో అంతకుమించి ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ హిట్ అవుతుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా’’ అన్నారు సప్తగిరి. చిత్రకథానాయిక కాశిష్ వోహ్రా, నిర్మాత ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి, దర్శకుడు అనిల్ రావిపూడి, నటలు సాయికుమార్, జయప్రకాశ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎడిటర్ గౌతంరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment