
విలక్షణ నటుడు సాయికుమార్ ప్రధాన పాత్రలో విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా షూటింగ్ మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పోచంపల్లి, రేవనపల్లి, ముక్తాపూర్ గ్రామాల్లో జరిగింది. అక్కడ సాయికుమార్‌పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
సాయికుమార్ మగ్గం నేసే, రచ్చబండ వద్ద గ్రామస్తులతో మాట్లాడే సీన్స్‌తోపాటు ఆయన బైక్‌పై వెళ్తున్న పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనుప్రసాద్ మాట్లాడుతూ.. మగ్గం నేసే తండ్రి కుమారుడిని అమెరికాకు పంపించడానికి చేసిన అప్పులు, ఆ కుటుంబం పడే బాధలు కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment