
డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వన్ బై టు’.ఆనంద్, శ్రీ పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించారు. చెర్రీ క్రియేటివ్ వర్క్స్ మరియు వీ ఐ పీ క్రియేషన్స్ బ్యానర్ ల పై కరణం శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి శివ ఏటూరి దర్శకత్వం వహించారు.
ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 22 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. లియాండర్ లీ మార్టీ, ఆదేశ్ రవి సాంగ్స్ సంగీతం సమకూర్చగా సందీప్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. శంకర్ కేసరి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కపిల్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా, శంకర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా తమ బాధ్యతలు నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment