
ఏపీ అధికారికి కళ్లు చెదిరే ఆస్తులు!
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని జీఏడీ విభాగం జాయింట్ సెక్రటరీ సాయికుమార్ ఆస్తుల చిట్టా కొండవీటి చాంతాడులా పెరుగుతూనే ఉంది. ఏసీబీ అధికారులు గత రెండు రోజులుగా ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు బయటపడిన ఆస్తుల వివరాలు చూసి అధికారులే విస్తుపోయారు.
బెంగళూరులో రెండు ఫ్లాట్లు, హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, ఒక షాపింగ్ కాంప్లెక్సుతో పాటు కడప, బెంగళూరు నగరాల్లో ఏడు విలువైన స్థలాలను గుర్తించారు. అలాగే కిలో బంగారం, పది కిలోల వెండి, రూ. 20 లక్షల నగదు, 15 లక్షల డిపాజిట్లు, రూ. 20 లక్షల చిట్‌ఫండ్ రసీదులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకు లాకర్లు తెరిచిన ఏసీబీ అధికారులు వాటిలో ఉన్న వజ్రాల ఉంగరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా తవ్వేకొద్దీ ఇంకెన్ని ఆస్తులు బయటపడతాయోనని చూస్తున్నారు.