huge assets
-
ఏపీ అధికారికి కళ్లు చెదిరే ఆస్తులు!
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని జీఏడీ విభాగం జాయింట్ సెక్రటరీ సాయికుమార్ ఆస్తుల చిట్టా కొండవీటి చాంతాడులా పెరుగుతూనే ఉంది. ఏసీబీ అధికారులు గత రెండు రోజులుగా ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు బయటపడిన ఆస్తుల వివరాలు చూసి అధికారులే విస్తుపోయారు. బెంగళూరులో రెండు ఫ్లాట్లు, హైదరాబాద్‌లో రెండు ఫ్లాట్లు, ఒక షాపింగ్ కాంప్లెక్సుతో పాటు కడప, బెంగళూరు నగరాల్లో ఏడు విలువైన స్థలాలను గుర్తించారు. అలాగే కిలో బంగారం, పది కిలోల వెండి, రూ. 20 లక్షల నగదు, 15 లక్షల డిపాజిట్లు, రూ. 20 లక్షల చిట్‌ఫండ్ రసీదులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాంకు లాకర్లు తెరిచిన ఏసీబీ అధికారులు వాటిలో ఉన్న వజ్రాల ఉంగరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా తవ్వేకొద్దీ ఇంకెన్ని ఆస్తులు బయటపడతాయోనని చూస్తున్నారు. -
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఇంట్లో మరోసారి సోదాలు
హైదరాబాద్: మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ ఎన్కౌంటర్ తదనంతరం రెండు రోజులుగా జరుగుతున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్కాపురిలోని నయీం ఇంట్లో గురువారం మరోసారి పోలీసులు సోదాలు నిర్వహించనున్నారు. నయీం ఇంట్లో పెద్ద ఎత్తునా బంగారం, ఏకే 47, ఫారెన్ వాచ్‌లు, వందల సంఖ్యలో డాక్యుమెంట్లు ఉన్నట్టు సమాచారం ఉంది. దాంతో పోలీసులు నయీం ఇంట్లో నేడు సోదాలు నిర్వహించి అతడి ఆస్తుల వివరాలను పోలీసులు కోర్టుకు తెలుపనున్నారు. నేడు నయీం పనిమనిషి ఖాజా ఉద్దీన్‌ను కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు. నిన్న గోవాలో నయీం బంగ్లాలో అనుచరుడు ఖాజాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నయీం అక్కా బావను మహబూబ్‌నగర్ జైలుకు పోలీసులు తరలించారు. కాగా, నయీం ఇంట్లో బుధవారం పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అల్కాపురిలోని నయీం ఇంట్లోని బెడ్రూంను పోలీసులు తెరిచి అతడి బెడ్రూంలో కీలకమైన డాక్యుమెంట్లు, భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, ఈ రోజు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)తో నార్త్‌జోన్ ఐజీ, సిట్ చీఫ్ నాగిరెడ్డి భేటీ కానున్నారు. నయీం కేసుపై అధికారులు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల టార్గెట్‌తో విచారణ ను సిట్ వేగవంతం చేసే పనిలో పడింది. -
నయీమ్ ఇంట్లో మరోసారి సోదాలు
హైదరాబాద్: మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ ఎన్కౌంటర్ తదనంతరం జరుగుతున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నయీం ఇంట్లో బుధవారం మరోసారి పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. అల్కాపురిలోని నయీం ఇంట్లోని బెడ్రూంను పోలీసులు తెరవనున్నట్టు తెలుస్తోంది. అతడి బెడ్రూంలో కీలకమైన డాక్యుమెంట్లు, భారీగా నగదు ఉన్నట్లు సమాచారం ఉంది. దాంతో తమ కస్టడీలో ఉన్న నయీం వంటమనిషి ఫర్హానా, డ్రైవర్ భార్య అఫ్షాలను నయీమ్ ఇంటికి పోలీసులు తీసుకెళ్లినట్టు తెలిసింది. నయీం ఇంట్లో పనిచేసే వీరిద్దరిని మూడురోజుల పాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ నయీం బాడిగార్డ్స్గా పోలీసులు అనుమానిస్తున్నారు. -
నయీమ్ ఇంట్లో మరోసారి సోదాలు
-
నయీమ్ కేసు దర్యాప్తునకు సిట్
నేడు అధికారికంగా ప్రకటించనున్న డీజీపీ అనురాగ్‌శర్మ సాక్షి, హైదరాబాద్: మాజీ మావోయిస్టు, గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ అలియాస్ నయీ మ్ ఎన్కౌంటర్ తదనంతరం జరుగుతున్న విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. నయీమ్, అతని అనుచరుల నివాసాల్లో జరుగుతున్న సోదాల్లో రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు, బంగారు నగలు, వజ్రాలు బయటపడుతున్నాయి. లెక్కకు మించి ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వందలాది ఎకరాల భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో విచారణను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐజీ (పర్సనల్) సందీప్ శాండిల్య నేతృత్వంలో ఈ సిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సిట్ నియామకాన్ని డీజీపీ అనురాగ్‌శర్మ బుధవారం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. శాంతి భద్రతల విభాగానికి చెందిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నా.. అంతర్గతంగా వివిధ కోణాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో సిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దర్యాప్తు వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నయీమ్ ఆస్తుల స్వాధీనానికి జీవో! విలువ రూ.2,500 కోట్ల దాకా ఉంటుందని అంచనా సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రాథమిక అంచనాల మేరకు నయీం కూడబెట్టిన ఆస్తి రమారమి రూ.2,500 కోట్ల దాకా ఉంటుందని అంచనా. పోలీసు శాఖ నియమించే సిట్ విచారణ అనంతరం ఆస్తులకు సంబంధించి స్పష్టత వస్తుందని ఆ వర్గాలు వెల్లడించాయి. నయీమ్ వివిధ ప్రాంతాల్లో కూడబెట్టిన ఆస్తులతో జాబితారూపొందించి వాటి వివరాల ఆధారంగా ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది. ఆ జీవో ద్వారా కోర్టు అనుమతితో ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది. నయీమ్ సోదరి ఇంట్లో సోదాలు కోహీర్: మెదక్ జిల్లా కోహీర్‌లోని ఘడీ ప్రాంతంలో నయీమ్ సోదరి అయేషా బేగం ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారు. ఆమె పేరిట ఉన్న రూ.80 లక్షల విలువ చేసే ప్లాట్లకు సంబంధించిన పత్రాలు, సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. -
నయీం కేసు విచారణ సిట్‌కు అప్పగింత
-
రాజధాని ప్రాంతంలో భారీగా భూముల కొనుగోలు