ఆహాలో వరల్డ్‌ ప్రీమియర్‌గా ‘అర్థ శతాబ్దం’ | Ardha Shathabdham Movie Release On AHA On March 26th | Sakshi
Sakshi News home page

ఆహాలో వరల్డ్‌ ప్రీమియర్‌గా ‘అర్థ శతాబ్దం’

Published Mon, Mar 15 2021 7:41 PM | Last Updated on Mon, Mar 15 2021 9:05 PM

Ardha Shathabdham Movie Release On AHA On March 26th - Sakshi

ఆహాలో వరల్డ్ ప్రీమియర్‌గా మార్చి 26న ‘అర్ధ శతాబ్దం’ మూవీ విడుదల కానుంది. ఈ మూవీని జాతీ, మత, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రేమ కోసం జరిగే పోరాటంగా 2003లో జరిగిన నిజ జీవితం కథ ఆధారంగా ‘అర్ధ శతాబ్దం’ మూవీని దర్శకుడు రూపొందించాడు. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 26 నుంచి ఆహా వరల్డ్ ప్రీమియర్గా‌ స్ట్రీమ్ కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో‌ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ.. ‘పెద్ద డైరెక్టర్ అయిన క్రిష్‌కు కథ నచ్చడంతో ఆయన మా సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేయడంతో సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. కార్తీక్‌కు హీరో రానా బర్త్ డే విషెస్ తెలపడం. ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికి మా టీంతో టైం స్పెండ్ చేసి మా చిత్రం గురించి తెలుసుకుని టీజర్‌ను లాంచ్‌ చేశారు. హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌ సింగ్‌ ఒక సాంగ్ లాంచ్ చేశారు. ఇలా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ మా సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు. వారందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. ఈ ‘అర్ధశతాబ్దం’ సినిమా 1950 నుంచి 2003 వరకు జరుగుతుంది. ఇండియన్ డెమాక్రసీ మాములు పబ్లిక్‌పై ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది దాన్ని ఎలా అర్థం చేసుకుని యుటిలైజ్ చేసుకుంటున్నాం. అలాగే దాని ఎలా మిస్ యూజ్ చేసుకొంటున్నాం అనే కథాంశంతో అద్భుతమైన లవ్ స్టొరీని జోడించి సినిమాను తెరకెక్కించడం జరిగింది.

నిర్మాతల సపోర్టుతో చిత్రాన్ని పూర్తి చేసి చిత్ర టీజర్‌ను విడుదల చేశాము. ఆహా వారికి మా టీజర్ నచ్చడంతో ఈ సినిమాను ఆహాలో విడుదల చేయమని ఆఫర్ రావడంతో సినిమాను మార్చి 26 నుంచి వరల్డ్ ప్రీమియర్‌గా తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా విడుదల చేస్తున్నాం’ అని ఆయన చెప్పారు. అలాగే  నిర్మాత చిట్టి కిరణ్ మాట్లాడుతూ.. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో   ఈ నెల 26వ తేదీన వస్తున్న ‘అర్ధ శతాబ్దం’  మూవీని ఆదరించి మాకు సపోర్ట్‌గా నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని అన్నారు. ఇక నిర్మాత రాధాకృష్ణ మాట్లాడుతూ... 22 సంవత్సరాల నుంచి ఆర్టిస్ట్‌గా మీ అందరికీ పరిచయస్తున్నే. అయితే రవి, కిరణ్‌లు షూటింగ్ మొదలు పెట్టిన తరువాత నాకు ఈ కథ చెప్పడం జరిగింది. ఈ కథ నచ్చడంతో నిర్మాతగా వారితో కలసి నిర్మించడం జరిగింది. సినిమా పూర్తి అయిన తరువాత థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశాము.

అయితే కరోనా టైంలో థియేటర్స్ మూతపడటంతో మూవీని ఎలా విడుదల చేయాలని అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. ఈ క్రమంలో​ఆహా నుండి తమకు కాల్ వచ్చిదని, ఈ ఆఫర్‌ను మిస్ చేసుకోకుండా ప్రస్తుతం జనాల్లోకి వెళ్లేలా ఆహాలో విడుదల చేస్తే మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని ఈ నెల 26 న ఆహా లో విడుదల చేస్తున్నామన్నారు. అందరు అర్థ శతాబ్ధం మూవీ చూసి తమని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామన్నారు.  ఇందులో ప్రముఖ నటీనటులు కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్‌, కృష్ణ ప్రియ, సుహాస్‌, పవిత్ర లోకేష్‌, అజయ్‌, శుభలేఖ సుధాకర్‌, రాజా రవీంద్ర, రామ రాజు, దిల్‌ రమేష్, టీఎన్‌ఆర్‌, శరణ్య, నవీన్‌ రెడ్డి, ఆమనిలు నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement