మత్స్యకారులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి | Congress Fishermen Wing Protest Infront Of Telangana Assembly | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి

Published Sun, Feb 12 2023 3:20 AM | Last Updated on Sun, Feb 12 2023 10:24 AM

Congress Fishermen Wing Protest Infront Of Telangana Assembly - Sakshi

అసెంబ్లీ వద్ద మెట్టు సాయికుమార్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: తమకు రూ.10 లక్షల కవరేజీతో హెల్త్‌కార్డులు ఇవ్వాలని మత్స్యకారులు చేపట్టిన ఆందోళన అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తతకు దారి తీసింది. మత్స్యకారులను ఆదుకోవాలంటూ టీపీసీసీ ఫిషర్‌మెన్‌ సెల్‌ చైర్మన్‌ మెట్టు సాయి కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీసులు ముందుగా అంచనా వేయలేకపోయారని చెపుతున్నారు.

అనూహ్యంగా ఆటోలో అసెంబ్లీ ముందుకు వచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, మత్స్యకారులు ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్‌ మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, రూ.10 లక్షల కవరేజీతో హెల్త్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement