బాల్యాన్ని గుర్తు చేసేలా ‘కమిటీ కుర్రాళ్లు’ టీజర్‌ | Committee Kurrollu Movie Teaser Out Now | Sakshi
Sakshi News home page

బాల్యాన్ని గుర్తు చేసేలా ‘కమిటీ కుర్రాళ్లు’ టీజర్‌

Jun 15 2024 1:18 PM | Updated on Jun 15 2024 1:26 PM

Committee Kurrollu Movie Teaser Out Now

నటి, నిర్మాత నిహారిక కొణిదెల సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయికుమార్, సందీప్‌ సరోజ్, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, ప్రసాద్‌ బెహరా, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక లీడ్‌ రోల్స్‌లో నటించారు. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. ఈ మూవీ టీజర్‌ని హీరో నితిన్‌ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

 ‘‘యువత అయినా, పెద్దవాళ్లైనా ఏదో ఒక సందర్భంలో చిన్నతనమే బాగుందని అనుకుంటుంటారు. ఎలాంటి పొరపొచ్ఛాలు, అడ్డుగోడలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే ఎంతో గొప్పది. ఈ పాయింట్‌ ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ప్రస్తుతం మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మూవీ విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement