కమిటీ కుర్రోళ్లు చిత్రంపై రామ్ చరణ్‌ ప్రశంసలు! | Ram Charan Congratulates Committe Kurrollu Movie Team For Success, Tweet Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Ram Charan On Committe Kurrolu: కమిటీ కుర్రోళ్లు చిత్రంపై రామ్ చరణ్‌ ప్రశంసలు!

Published Tue, Aug 13 2024 4:47 PM | Last Updated on Tue, Aug 13 2024 6:53 PM

Ram Charan Congratulates Committe Kurrollu Team For Movie Success

టాలీవుడ్ మూవీ కమిటీ కుర్రోళ్లు చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిహారిక నిర్మాతగా తొలిసారి నిర్మించిన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ ఈ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. మీ కృషి, అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కథకు జీవం పోసిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాగా..  ఇప్పటికే కమిటీ కుర్రోళ్లు చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం స్పందించారు.

కాగా.. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అదరగొడుతోంది. ఈ సినిమాతోనే యదువంశీ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. స్నేహితుల మధ్య బంధం, రూరల్‌ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో 11 మంది నటీనటులు అందరూ కొత్తవారే విశేషం.  ఈ సినిమాను  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధాదామోదర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఇప్పటికే దాదాపు రూ.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మరిన్ని కలెక్షన్స్‌ సాధించే అవకాశముంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement