పక్కనోడి జీవితానికి హాని జరగకూడదు | Kartikeya new movie Guna 369 teaser released | Sakshi
Sakshi News home page

పక్కనోడి జీవితానికి హాని జరగకూడదు

Published Tue, Jun 18 2019 2:39 AM | Last Updated on Tue, Jun 18 2019 2:39 AM

Kartikeya new movie Guna 369 teaser released - Sakshi

కార్తికేయ

‘‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా పర్వాలేదు.. కానీ, పక్కనోడి జీవితానికి ఏ హానీ జరగకూడదు’ అంటూ నటుడు సాయికుమార్‌ డైలాగ్‌తో ‘గుణ 369’ చిత్రం టీజర్‌ ప్రారంభమవుతుంది. ‘మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్లను చూసి భయపడేది, గొడవలంటే మూసుకుని కూర్చునేది మాకేదన్నా అవుతుందని కాదు.. మా అనుకున్న వాళ్లకు ఏదన్నా అవుతుందన్న చిన్న భయంతో’ అంటూ కార్తికేయ ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌ కూడా ఆకట్టుకుంటోంది.

కార్తికేయ, అనగ జంటగా అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్‌ విడుదలైన కొన్ని క్షణాల నుంచే చాలా బావుందంటూ ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. డైలాగులు, లొకేషన్లు, నటన, కెమెరా, కాస్ట్యూమ్స్‌... ఇలా ప్రతి విషయం గురించి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. టీజర్‌ ఎంత బావుందో, సినిమా అంతకు వెయ్యి రెట్లు బావుంటుందని నమ్మకంగా చెప్పగలను’’ అన్నారు.

‘‘యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ కోరుకునే విషయాలు, మాస్‌ ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాల సమాహారంగా టీజర్‌ ఉందని, ఫుల్‌ మీల్స్‌ లాంటి సినిమా అవుతుందనే ప్రశంసలు అందుతున్నాయి. మూడు రోజులు మినహా షూటింగ్‌ పూర్తయింది. ఇప్పటిదాకా వచ్చిన ఔట్‌పుట్‌ చూశాం. ప్రేక్షకులను ఆకట్టుకునే హిట్‌ సినిమా తీశామనే నమ్మకం వచ్చింది. ఇదే ఉత్సాహంతో ఈ నెలాఖరున పాటలను విడుదల చేస్తాం. కార్తికేయ, మా కెరీర్‌లో ‘గుణ 369’ చెప్పుకోదగ్గ గొప్ప సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్, కెమెరా: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: సత్య కిశోర్, శివ మల్లాల.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement