గుణ అనే పిలుస్తారు | Guna 369 Movie Success Celebrations | Sakshi
Sakshi News home page

గుణ అనే పిలుస్తారు

Aug 3 2019 6:06 AM | Updated on Aug 3 2019 6:06 AM

Guna 369 Movie Success Celebrations - Sakshi

అనిల్, ప్రవీణ, తిరుమల్, కార్తికేయ, అర్జున్‌

‘‘హిట్లు, సూపర్‌హిట్లు, బ్లాక్‌బస్టర్లు, ఫ్లాప్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే మనకు గౌరవం తెస్తాయి.. మనల్ని చూసే విధానం బాగుంటుంది. అలాంటి పాత్ర చేసే అవకాశం ‘గుణ 369’తో వచ్చింది. ఇక నన్ను ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో అనరు. గుణ అనే పిలుస్తారు’’ అన్నారు కార్తికేయ. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ, అనఘ జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్‌ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందంæ కేక్‌ కట్‌ చేసి సంతోషం పంచుకున్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఈ క్షణం కోసం వేచి చూశా. ఇప్పటివరకూ నన్ను యూత్‌ఫుల్‌ హీరో, షర్ట్‌లెస్, లిప్‌లాక్స్‌... అనే కోణంలో చూసేవారు.

ఈ సినిమాతో మహిళలు నన్ను ఓన్‌ చేసుకుంటున్నారు. మహిళల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ఇది కదా మనకు కావాల్సింది? అనిపించింది. ఇలాంటి మంచి పాత్ర నాతో చేయించిన అర్జున్‌కి రుణపడి ఉంటా. మా కాంబినేషన్‌లో మరో సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. ‘‘గుణ 369’ సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉంది. మంచి విషయాన్ని ఎప్పుడు చెప్పినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమాతో మేం కచ్చితంగా హిట్‌ కొట్టాం’’ అన్నారు ప్రవీణ.. ‘‘మా అబ్బాయి హీరో ఎందుకు అయ్యాడా? అనిపించింది. కానీ ‘గుణ 369’ చూశాక చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’’ అన్నారు కార్తికేయ తల్లి రజనీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement