అనఘ
‘‘నాది కేరళ. మా తల్లిదండ్రులు టీచర్స్. నాకు ఎటువంటి సినిమా నేపథ్యం లేదు. నటన అంటే ఇష్టం. కానీ, అమ్మానాన్న చదువు పూర్తయ్యాక ప్రయత్నించమన్నారు. ఎంటెక్ చదివాక చిన్న చిన్న యాడ్స్‌లో మోడల్‌గా చేశా. కొచ్చిలో పీజీ ఇంటర్న్‌షిప్ చేస్తుండగా మలయాళంలో సెకండ్ లీడ్ రోల్‌లో నటించే అవకాశం వచ్చింది’’ అని అనఘ అన్నారు. కార్తికేయ హీరోగా, అనఘ హీరోయిన్‌గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనఘ పంచుకున్న విశేషాలు.
► మలయాళంలో మూడు సినిమాల్లో నటించా. హీరోయిన్‌గా నా తొలి సినిమా ‘నట్పే తునై’ (తమిళ్). ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగులో నా మొదటి చిత్రం ‘గుణ 369’. అర్జున్ సార్ హైదరాబాద్‌కి పిలిపించి లుక్ టెస్ట్, ఫొటోషూట్ చేశారు. ఇందులో గీత పాత్రకి సరిపోతానని అదే రోజు ఓకే చెప్పారు.
► ‘గుణ 369’ కథ చాలా బాగుంది. పైగా నా పాత్ర కూడా నచ్చింది.. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నా. ఇందులో గ్రామీణ ప్రాంతానికి చెందిన మధ్య తరగతి అమ్మాయి గీత పాత్ర చేశా. నా పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కార్తికేయ మంచి సహనటుడు. తన పాత్ర బాగా రావడానికి ఎంతో కష్టపడతాడు.
► రొమాన్స్, లవ్, యాక్షన్... ఇలా అన్నీ ఈ చిత్రంలో రియలిస్టిక్‌గా ఉంటాయి. సెకండాఫ్‌లో ఎమోషన్స్ చాలా బాగుంటాయి. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతకి బాగా నచ్చుతుంది. మలయాళ, తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో పనిచేశా. అయితే టాలీవుడ్‌లో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంది. మంచి గౌరవం ఇస్తారు.. ఓ రాణిలా చూస్తారు.
► మలయాళ హీరోయిన్లు ఎక్కువగా టాలీవుడ్‌లో ఉండటం గర్వంగా ఉంది. నాకు సమంత, నయనతారలంటే ఇష్టం.. వారి క్రమశిక్షణ అన్నా కూడా ఇష్టమే. ఈ పోటీ ఇండస్ట్రీలో 10–15 ఏళ్లుగా వారు కష్టపడి రాణిస్తున్నారు.
► అల్లు అర్జున్‌గారి ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా చూశా.. ఆయన గ్రేట్ డ్యాన్సర్.
► ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఉంది. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ చే యడానికి రెడీ.
Comments
Please login to add a commentAdd a comment