మీడియాతో ఢీ | Manalo Okadu movie will release on november 4th | Sakshi
Sakshi News home page

మీడియాతో ఢీ

Published Sun, Oct 23 2016 11:11 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

మీడియాతో ఢీ - Sakshi

మీడియాతో ఢీ

‘‘సమాజంలో ఎవరైనా మా ముందు తలదించాల్సిందేననే ఓ మీడియా అధినేతతో మనలో ఒకడు, ఓ సామన్య అధ్యాపకుడు ఢీ అంటే ఢీ అంటూ తలపడితే.. ఏం జరిగిందనే కథతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు ఆర్పీ పట్నాయక్. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మనలో ఒకడు’. జగన్‌మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయాలను కుంటున్నారు.

‘‘కృష్ణమూర్తిగా ఆర్పీ, మీడియా అధినేతగా సాయికుమార్ అద్భుతంగా నటించారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది’’ అని నిర్మాత అన్నారు. ‘నువ్వు నేను’ ఫేమ్ అనిత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి పాటలు: చైతన్య ప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, కెమేరా: ఎస్.జె.సిద్ధార్థ్, సహ నిర్మాతలు: ఉమేశ్ గౌడ, బాల సుబ్రమణ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement