
ఇప్పటి వరుకు తెలుగులో చాలా తక్కువ సెటైరికల్ కాన్సెప్ట్ మూవీస్ వచ్చాయి. అందులోను పొలిటికల్ సెటైరికల్ కామెడీ మాత్రం ఇంకా తక్కువ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులని నవ్వించడానికి 'లక్ష్మీ కటాక్షం' అనే చిత్రం నుంచి డైలాగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ డైలాగ్ పోస్టర్ లో ఓటరే తన రేటును తాను నిర్ణయించుకుంటాడు అనేలా చూపించారు.
(ఇదీ చదవండి: 'రేసుగుర్రం' విలన్ సీక్రెట్ ఫ్యామిలీ.. ఎన్నికల టైంలో ఇరికించేశారు!)
మహతి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ 'లక్ష్మీకటాక్షం' సినిమాకు సూర్య దర్శకుడు. శ్రీనివాసులరెడ్డి నిర్మించగా, అభిషేక్ రుఫుస్ సంగీతం అందించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకి చాలా ఆప్ట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.
సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించగా.. వినయ్, అరుణ్, దీప్తి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే సరదాగా ఉండే టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్రబృందం వెల్లడించింది.
(ఇదీ చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' నటి)
Comments
Please login to add a commentAdd a comment