
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ (Return Of The Dragon) ఓటీటీ ప్రకటన అధికారికంగా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ఫిబ్రవరి 21న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు, నిర్మాత అర్చనా కల్పతిలను డైరెక్టర్ శంకర్ కూడా మెచ్చుకున్నారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ సైతం ఈ మూవీని మెచ్చుకున్నారు.
తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడలో మార్చి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు పోస్టర్‌ను విడుదల చేశారు. కేవలం రూ. 35 కోట్లతో తెరకెక్కించిన డ్రాగన్ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్ల మార్క్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. ‘లవ్‌టుడే’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రంతో మరోసారి హిట్ అందుకున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ కీలకపాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

కథేంటి..?
డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్‌లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.
దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలౌతుంది. డ్రాగన్‌కు ప్రిన్సిపల్ పెట్టే కండీషన్స్ ఏంటి..? బీటెక్‌లో 48 సబ్జెక్టులను ఎలా పూర్తి చేశాడు. కాలేజీ డేస్‌లో తను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) మరోసారి ఆయన జీవితంలోకి ఎందుకొస్తుంది..? ఉద్యోగం ఉందని చెప్పి పెళ్లి సెట్ చేసుకున్న పల్లవితో ఏడడుగులు వేస్తాడా..? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment