
Bramha Mishra Demise: బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. హిందీ నటుడు బ్రహ్మ మిశ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ముంబైలో తను నివసిస్తున్న వెర్సోవాలోని ఫ్లాట్‌లో శవమై కనిపించాడు. కుళ్లిపోతున్న స్థితిలో ఉన్న ఆయన శరీరాన్ని పోలీసులు శవపరీక్ష చేయడం కోసం డా.కూపర్ ఆస్పత్రికి తరలించారు. ఆయనది హత్యా? ఆత్మహత్యా? ఆకస్మిక మరణమా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా మీర్జాపూర్ సిరీస్‌లో మున్నా త్రిపాఠి స్నేహితుడు లలిత్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మిశ్రా. 'మీర్జాపూర్' 1, 2 సిరీస్‌లతో పాటు 'మంజి: ద మౌంటెన్ మ్యాన్', 'కేసరి' సహా పలు చిత్రాల్లో నటించాడు. మిశ్రా మరణంపై మీర్జాపూర్ కోస్టార్ దివ్యేందు సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment