ఓటీటీలో టాప్ లేపిన వెబ్ సిరీస్.. మూడో సీజన్ రిలీజ్ డేట్ ఫిక్స్? | Mirzapur Season 3 Series OTT Release Date Confirmed, Deets In Telugu - Sakshi
Sakshi News home page

Mirzapur 3 Series Release Date: 'మీర్జాపూర్ 3' నుంచి క్రేజీ అప్డేట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

Published Wed, Jan 17 2024 8:59 PM | Last Updated on Thu, Jan 18 2024 9:55 AM

Mirzapur 3 Series Ott Streaming Details In Telugu - Sakshi

క్రేజీ వెబ్ సిరీస్ నుంచి కేక పుట్టించే అప్డేట్ వినిపిస్తుంది. ఓటీటీ ట్రెండ్ మొదలైన తర్వాత కొన్ని వెబ్ సిరీసులు.. జనాల్ని ఓ రేంజులో ఊపేశాయి. అలాంటి వాటిలో ఒకటి 'మీర్జాపూర్'. క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ నాటు సిరీస్.. మిగతా వాళ్లకేమో గానీ తెలుగు ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది. ఇప్పుడు దీని మూడో సీజన్ నుంచి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు)

ఓటీటీలో రికార్డులు సృష్టించిన వెబ్ సిరీసుల లిస్టు తీస్తే అందులో కచ్చితంగా 'మీర్జాపూర్' ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని  ఓ ప్రాంతమైన మీర్జాపూర్‌ నేపథ్యంగా కల్పిత పాత్రలతో ఈ సిరీస్ తీశారు. ఊరమాస్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌లో అద్భుతమైన డ్రామాతో పాటు బూతులు కూడా గట్టిగానే ఉంటాయి. అలా 2018 నవంబరు 16న రిలీజైన తొలి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2020 అక్టోబరు 23న వచ్చిన రెండో సీజన్ అంతకు మించి హిట్‌గా నిలిచింది.

ఇక మూడో సీజన్‌కి సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాది క్రితమే పూర్తయిపోయినప్పటికీ.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మూడో సీజన్.. ఈ మార్చి చివరి వారంలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మున్నాభయ్యా ఫ్యాన్స్‌కి పండగే. ఇకపోతే తొలి సీజన్‌లో గుడ్డూ భయ్యా, అతడి కుటుంబాన్ని మున్నా ఇబ్బంది పెట్టడం చూపించారు. రెండో సీజన్‌లో గుడ్డు భయ్యా.. మున్నా భయ్యాపై ప్రతీకారం తీర్చుకోవడం చూపించారు. మూడో సీజన్‌లో ఏం చూపించబోతున్నారో?

(ఇదీ చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement