మీర్జాపూర్‌-3 విడుదలపై అధికారిక ప్రకటన | Mirzapur Season 3 Release Date Confirmed | Sakshi
Sakshi News home page

మీర్జాపూర్‌-3 విడుదలపై అధికారిక ప్రకటన

Published Tue, Jun 11 2024 12:47 PM | Last Updated on Tue, Jun 11 2024 1:13 PM

Mirzapur 3 OTT Streaming Date locked

ఓటీటీలో మోస్ట్‌ పాపులర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ల్లో 'మీర్జాపూర్‌' మొదటి లిస్ట్‌లో ఉంటుంది. ఈ వెబ్‌ సిరీస్‌ నుంచి ఇప్పటికే విడుదలైన దీని రెండు భాగాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో మూడో సీజన్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్‌ శుభవార్త చెప్పారు. మీర్జాపూర్‌ విడదల తేదీని చెబుతూ ఒక‌ పోస్టర్‌ను అమెజాన్‌ విడుదల చేసింది. జులై 5 నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతున్నట్లు వారు ప్రకటించారు.

గుర్మీత్‌సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌  ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో కొనసాగుతుంది. పంకజ్‌ త్రిపాఠి, శ్రియ పిల్గోంగర్‌, శ్వేతా త్రిపాఠి,అలీ ఫజల్‌, దివ్యేందు శర్మ,హర్షిత గౌర్‌ తదితరులు మొదటి భాగంలో నటించారు. రెండో సీజన్‌లో విజయవర్మ కీలకపాత్రలో కనిపించారు. 2018 నవంబరు 16న ఈ సీరిస్‌ విడుదలైంది. దానికి సీక్వెల్‌గా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదలైంది. ఇప్పుడు సుమారు నాలుగేళ్ల తర్వాత జులై 5న మీర్జాపూర్‌-3 ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement