
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ చెందిన ఓ టీవీ మెకానిక్ కుమార్తె సానియా మీర్జా నేషనల్ ఢిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వార్తల్లో నిలిచింది. దీంతో ఆమె భారత్‌లోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా కానున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పేర్కొంది. ఆమె ఫైటర్ పైలట్‌గా ఎంపికవ్వడానికి ముందుగా నాలుగేళ్ల శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉందని ఐఏఎఫ్ తెలిపింది.
ఈ మేరకు ఆమె ఎన్‌డీఏలో చేరి అకాడమీ కోర్సుగా ఫైటర్ పైలట్ స్ట్రీమ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలో వైమానిక దళం ఆమె కల నిజమవ్వాలంటూ.. సానియాకు శుభాకాంక్షలు తెలిపింది. ఆమె ఎన్‌డీఏ ఎగ్జామ్‌లో 149వ ర్యాంకును సాధించింది. హిందీ మీడియంలో చదివినా విజయం సాధించవచ్చని నిరూపించింది సానియా. తాను తొలి మహిళా పైలట్ అవనీ చతుర్వేదిని చూసి ప్రేరణ పొంది రెండో ప్రయత్నంలో ఎన్‌డీఏలో విజయం సాధించినట్లు సానియా పేర్కొంది.
(చదవండి: సోనియా వ్యాఖ్యలకు స్పందించకపోతే.. బాధ్యత పరంగా విఫలమైనట్లే: ధన్‌ఖర్)
Comments
Please login to add a commentAdd a comment