‘మీర్జాపూర్‌ 2’ ట్రైలర్‌ వచ్చేసింది.. | Web Series Mirzapur 2 Trailer Out | Sakshi
Sakshi News home page

మీర్జాపూర్‌ 2 ట్రైలర్‌ విడుదల

Published Tue, Oct 6 2020 2:32 PM | Last Updated on Tue, Oct 6 2020 2:48 PM

Web Series Mirzapur 2 Trailer Out - Sakshi

ముంబాయి: క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌గా నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది మీర్జాపూర్‌. పంక్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, దివ్యేందు శర్మ, శ్వేత త్రిపాఠి, హర్షితా శేఖర్‌, అమిత్‌ సియాల్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ను కరణ్‌ అన్షుమన్‌, గుర్మీత్‌ సింగ్‌లు తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ సిరీస్‌కు కొనసాగింపుగా మీర్జాపూర్‌ 2 వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన రెండో సిరీస్‌ కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో అక్టోబర్‌ 23న సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల కానుంది. (‘మీర్జాపూర్‌-2’ రిలీజ్‌ ఎప్పుడంటే..)

ఈ సిరీస్‌ను గుర్మీత్‌ సింగ్‌, మిహిర్‌ దేశాయ్‌లను తెరకెక్కిస్తుండగా.. ఎక్సెల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఫర్హాన్ అక్తర్, రితేశ్‌ సిద్వానీ నిర్మిస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి సీజన్‌ 2 కోసం ఎదురు చూస్తుండగా.. తాజాగా మీర్జాపూర్‌ 2 ట్రైలర్‌ చిత్ర బృందం విడుదల చేసింది. మీర్జాపూర్‌2 సిరీస్‌ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నఈ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదల చేసినందుకు సంతోషంగా ఉందని, ఈ సినిమా అభిమానులకు ఖచ్చితంగా ఆక్టుకుంటుందని ఆశిస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన రితేశ్‌ తెలిపారు. కాగా 2 నిమిషాల 48 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌ను చూస్తుంటే సినిమాపై ఉన్న అంచనాలను మించి ఉండేలా కన్పిస్తోంది. అభిమానులను కట్టిపడేసే మలుపులు, అనేక ట్విస్టులతో ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే  ఈ సిరీస్‌లో మరి కొందరు నటులు కొత్తగా కనిపించనున్నారు. ('రొమాంటిక్ డిన్న‌ర్ ప్లాన్ చేసి ప్ర‌పోజ్ చేశాడు')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement