యంగ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. నిజమేనా? | Is Sreeleela Dating With Kartik Aryan? | Sakshi
Sakshi News home page

Sreeleela-Kartik Aaryan: హీరో తల్లి కామెంట్స్.. శ్రీలీలపై రూమర్స్

Published Wed, Mar 12 2025 10:47 AM | Last Updated on Wed, Mar 12 2025 11:01 AM

Is Sreeleela Dating With Kartik Aryan?

ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్లలో శ్రీలీల ఒకరు. 2023-24లో వరస తెలుగు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. కాస్త గ్యాప్ తీసుకుంది. త్వరలో 'రాబిన్ హుడ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇది కాకుండా మరో హిందీ మూవీలోనూ నటిస్తోంది. ఇదంతా పక్కనబెడితే శ్రీలీలపై ఇప్పుడు డేటింగ్ రూమర్స్ వస్తున్నాయి.

తెలుగమ్మాయి అయిన శ్రీలీల.. ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేస్తోంది. అయితే బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో ఈమె డేటింగ్ లో ఉందని తెగ మాట్లాడేసుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.

(ఇదీ చదవండి: సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే నన్ను చితక్కొట్టండి: టాలీవుడ్ నిర్మాత)

ప్రస్తుతం శ్రీలీల-కార్తిక్ ఆర్యన్.. అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సరే ఈ విషయం పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం కార్తిక్ ఇంట్లో ఫ్యామిలీ అంతా కలిసి పార్టీ చేసుకుంటే శ్రీలీల అక్కడ కనిపించింది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకల్లో కార్తిక్ తల్లి కూడా వచ్చింది. ఎలాంటి కోడలు మీకు కావాలి అనే ప్రశ్నకు.. డాక్టర్ కోడలు అని చెప్పారు. 

ఈ క్రమంలోనే కార్తిక్ ఆర్యన్ తల్లి చెప్పిన కామెంట్, శ్రీలీల డాక్టర్ కోర్స్ పూర్తి చేసి ఉండటాన్ని లింక్ చేసి శ్రీలీల-కార్తిక్ ఆర్యన్ డేటింగ్ లో ఉన్నారని అనేస్తున్నారు. ఇది నిజమా అంటే చెప్పలేం. ఎందుకంటే బాలీవుడ్ ఇలాంటి గాసిప్స్ కావాలనే పుట్టిస్తారేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది. శ్రీలీలది కూడా బహుశా ఇలాంటి రూమరే అయ్యిండొచ్చేమో?

(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement