నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు హాయిగా ఉంటుందని, జనాలకు తప్పకుండా నచ్చుతుందన్నాడు. అతడి నమ్మకం నిజమైంది. సినీప్రియులు హాయ్ నాన్నకు జై కొట్టారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యారు.
భారీ బడ్జెట్ సినిమాలైన యానిమల్, సలార్ పోటీని తట్టుకుని హాయ్ నాన్న ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది. అక్కడే ఈ సినిమా ఘన విజయం సాధించేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం నేటి (జనవరి 4) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను చూడటం మిస్ అయినవారు, మరోసారి హాయ్ నాన్న చూడాలనుకునేవారు ఎంచక్కా ఓటీటీలో వీక్షించేయండి..
కథ విషయానికి వస్తే..
ముంబైకి చెందిన విరాజ్ (నాని) ఓ ఫోటోగ్రాఫర్. కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే అతడికి పంచప్రాణాలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుతాడు. ప్రతిరోజు రాత్రి మహికి కథలు చెప్తుంటాడు విరాజ్. ఓరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానంటాడు.
అమ్మ కథ వినాలని నెలంతా కష్టపడి క్లాస్‌లో తనే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటుంది. తర్వాత కథ చెప్పమని అడిగితే విరాజ్ చిరాకు పడటంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి మహిని కాపాడుతుంది యష్ణ. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అసలు యష్ణ ఎవరు? విరాజ్ సింగిల్ పేరెంట్‌గా ఎందుకు మారాడు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది ఓటీటీలో చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment