
ఇటీవల థియేటర్లలో రిలీజైన తర్వాత ఓటీటీ రావడం సహజం. ఎక్కువశాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడిన తర్వాత నెల రోజుల తర్వాతే ఓటీటీకి వచ్చేస్తుంటాయి. అయితే షూటింగ్ పూర్తయిన దాదాపు రెండేళ్ల తర్వాత ఓటీటీకి రావడం చాలా అరుదు. కానీ హిందీలో తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ది మిరిండా బ్రదర్స్ రెండేళ్ల అనంతరం డైరెక్ట్‌గా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.
తాజాగా ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా వెల్లడించింది. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీకి వస్తోన్న ఈ మూవీలో హర్షవర్దన్ రాణే, మీజాన్ జాఫెరీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంజయ్ గుప్తా దర్శకత్వం వహించారు. ది మిరిండా బ్రదర్స్ సినిమా అక్టోబర్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్‍కు రానుంది.
ఆతిష్, కాబిల్, షూటౌట్ అట్ లోఖంద్వాలా, కాంటే లాంటి బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయిన సంజయ్ గుప్తా.. ది మిరండా బ్రదర్స్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇద్దరు సోదరులు రెండు వేర్వేరు ఫుట్‍బాల్ జట్లకు ఆడుతూ పోటీపడడం చుట్టూ తిరిగే కథే ఈ మూవీ. ఈ సినిమా షూటింగ్ రెండేళ్ల క్రితమే జరిగింది. 2022లో గోవాలోనే ఈ మూవీ ఎక్కువ భాగం షూటింగ్ నిర్వహించారు. చిత్రీకరణ పూర్తయినప్పటికీ సినిమా విడుదల ఆలస్యమైంది. దీంతో ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు.
Football in their hearts… vengeance in their souls.#TheMirandaBrothers, streaming 25 October onwards, only on JioCinema Premium.@MeezaanLifeLine #HarshvardhanRane @_SanjayGupta #AnuradhaLekhiGupta #WhiteFeatherFilms @TSeries#TheMirandaBrothersOnJioCinema #JioCinemaPremium pic.twitter.com/tVWHoEWCi4
— JioCinema (@JioCinema) October 15, 2024