గూగుల్ ఆధ్వర్యంలోని యూట్యూబ్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఇషాన్ ఛటర్జీ తన పదవికి రాజీనామా చేశారు. వయాకామ్ 18 యాజమాన్యంలోని జియో సినిమా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ (సీఆర్‌ఓ)గా చేరబోతున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది.
యూట్యూబ్ ఇండియాలో నాలుగేళ్ల నుంచి సేవలందిస్తున్న ఛటర్జీ గూగుల్‌లో దాదాపు 13 ఏళ్లు పనిచేశారు. ఆ సమయంలో యూరప్, ఆసియా అంతటా అనేక హోదాల్లో సేవలందించారు. యూట్యూబ్ ఎండీగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు యూట్యూబ్ ఏపీఏసీ, ప్రోడక్ట్ పార్టనర్‌షిప్ ఎండీగా వ్యవహరించారు. ఛటర్జీ రాజీనామాపై వయోకామ్18, యూట్యూబ్ రెండు సంస్థలు వివరాలు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: కాల్ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!
ఇదిలాఉండగా, అమెజాన్ ప్రైమ్ వీడియో కంట్రీ డైరెక్టర్ సుశాంత్ శ్రీరామ్‌ను వయోకామ్ 18 చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ)గా ఇటీవల నియమించింది. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం ఛటర్జీని సీఆర్‌ఓగా చేర్చుకుంటే వయోకామ్‌లో జరిగే రెండో అతిపెద్ద నియామకమవుతుంది. వీరిద్దరు వయోకామ్ 18 డిజిటల్ వెంచర్స్ సీఈఓ కిరణ్ మణికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఇప్పటికే వాల్ట్ డిస్నీలో వాటాలు పెంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment