ఓ సినిమా థియేటర్లలో రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీలోకి వస్తున్న రోజులివి. అలాంటిది ఈ మూవీ మాత్రం ఏకంగా ఏడాది తర్వాత ఇప్పుడు అందుబాటులోకి రానుంది. అప్పుడు ఇప్పుడు అని కొన్నాళ్ల ముందు హడావుడి చేశారు. కానీ ఇన్నాళ్లకు స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో రిలీజ్ కానుంది?
(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్)
విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన సినిమా 'జర హట్కే జర బచ్కే'. రొమాంటిక్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ చిత్రం.. గతేడాది జూన్ లో థియేటర్లలో రిలీజైంది. ఇందులో 'తేరే వాస్తులే' అనే పాట అప్పట్లో తెగ పాపులర్ అయింది. రీల్స్ తెగ చేశారు. ఇక ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని జియో సినిమా దక్కించుకోగా... స్ట్రీమింగ్ మాత్రం ఇప్పుడు ఏడాది తర్వాత చేస్తోంది. మే 17 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. కపిల్ (విక్కీ కౌశల్), సౌమ్య (సారా) పెళ్లయిన కొత్త జంట. మిడిల్ క్లాస్ కుటుంబం కావడంతో వీళ్లకు బెడ్ రూమ్ ఇచ్చి, హాల్‌లో తల్లిదండ్రులు పడుకుంటూ ఉంటారు. అయితే భర్తతో సరదాగా గడుపుదామంటే అత్తమామ ఇంట్లోనే ఉన్నారని, కొత్తిల్లు తీసుకుందామని సౌమ్య అనుకుంటుంది. ఆవాస్ యోజన పథకం కోసం అప్లికేషన్ పెట్టడానికి వెళ్లి, అక్కడి అధికారితో కపిల్ గొడవపడతాడు. ఈ క్రమంలోనే విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: భయంకరమైన వ్యాధి.. అందరూ నన్ను దూరం పెట్టారు: హీరోయిన్)
Sah-parivaar shaadi ki thi, ab sah-parivaar divorce bhi hoga! Toh aap sab #DivorceMeinZaroorAana 💔#ZaraHatkeZaraBachke streaming May 17 onwards, exclusively on JioCinema Premium. #ZHZBOnJioCinema #JioCinemaPremium@vickykaushal09 @SaraAliKhan pic.twitter.com/Vy4K5tLJDy
— JioCinema (@JioCinema) May 12, 2024
Comments
Please login to add a commentAdd a comment