ఏడాది తర్వాత ఓటీటీకి వచ్చేసిన కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Malayalam Comeday Entretainer Streaming On This OTT From Today | Sakshi
Sakshi News home page

ఓటీటీకి వచ్చేసిన కామెడీ ఎంటర్‌టైనర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Sun, Sep 15 2024 2:11 PM | Last Updated on Sun, Sep 15 2024 3:33 PM

Malayalam Comeday Entretainer Streaming On This OTT From Today

సీనియర్ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జలధార పంప్‍సెట్ సిన్స్ 1962'.  గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రాన్ని సెటైరికల్ కామెడీగా తెరకెక్కించారు. ఈ మూవీకి  ఆశిష్ చిన్నప్ప దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ఈ సినిమా సెప్టెంబర్ 15 నుంచే జియోసినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన దాదాపు 13 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కేవలం మలయాళంలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఊర్వశితో పాటు ఇంద్రన్స్, సనుషా, సాగర్ రాజన్, జానీ ఆంటోనీ, టీజీ రవి, విజయరాఘవన్, నిషా సారంగ్, జయన్ చేర్తలా కీలకపాత్రలు పోషించారు. ఓ చిన్న కేసు కూడా కోర్టుల్లో ఎన్నేళ్లు కొనసాగుతుందో సెటైరికల్‍గా ఈ చిత్రంలో చూపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement