ఓటీటీల చుట్టూ సినిమా ప్రపంచం తిరుగుతుంది. ఒక చిత్రం విడుదలైన 30 రోజుల్లోనే ఓటీటీలోకి అందుబాటులో రానున్నడంతో వాటిపై ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్,నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ5 వంటి ప్రముఖ సంస్థలు ఈ రంగంలో రాణిస్తున్నాయి. వీటికి పోటీగా జియో సినిమా రంగంలోకి దిగింది. కానీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల ధర కాస్త ఎక్కువగా ఉందనే టాక్ రావడంతో రేట్లు తగ్గిస్తూ కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. తాజాగా రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌ను ఉచితంగా అందిస్తున్న జియో సినిమా తన వినియోగదారులను మరింత పెంచుకునేందుకు ప్లాన్ వేసింది. దీంతో తాజాగా అందరికీ అందుబాటు ధరలో రూ. 29, రూ. 89లకు రెండు కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను లాంచ్ చేసింది. అంతేకాకుండా డివైజ్‌ల సంఖ్య పరిమితులను కూడా జియో సినిమా పెంచింది.
రూ.29 ప్లాన్ వివరాలు
జియో సినిమాలో ప్రీమియం కంటెంట్ చూడాలంటే గతంలో రూ. 59 చెల్లించాల్సి వచ్చేది. ఈ ప్లాన్‌ను తాజాగా మార్చేసిన జియో కేవలం రూ. 29కే అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ఒక డివైజ్‌లోనే అందుబాటులో ఉంది. ఎలాంటి యాడ్స్ లేకుండా కూడా చూడొచ్చు. ఇందులో డౌన్‌లోడ్ సదుపాయం కూడా ఉంది. స్మార్ట్ టీవీ డివైజ్‌లోనైనా యాక్సస్ ఉంటుంది.
రూ. 89కే ఫ్యామిలీ ప్లాన్
ఒక కుటుంబంలో ఎక్కువ మందికి యాక్సస్ కావాలంటే ఈ ప్లాన్ బాగుంటుంది. గతంలో రూ. 149 ఉన్న ఈ ప్లాన్.. తాజాగా రూ. 89కు అందుబాటులో ఉంది. అయితే, ఓకేసారి నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌ను చూడొచ్చు. ఇందులో కూడా ఎలాంటి యాడ్స్ రావు. స్పోర్ట్స్ వంటి వాటిలో మాత్రం యాడ్స్ వస్తాయి. ఎక్కువగా జియో సినిమాలో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులు చూస్తున్నారు. హెచ్‌బీఓ, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ నిర్మించిన చిత్రాలు ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment