రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా (Game Changer Movie) బాక్సాఫీస్ వద్ద తడబడుతోంది. మిక్స్‌డ్ రివ్యూలు కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాపై దర్శకుడు ఎస్. శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ అవుట్‌పుట్ నాకంత సంతృప్తికరంగా అనిపించలేదు. ఇంకా బెటర్‌గా చేసుండేవాడిననిపిస్తోంది.
ఐదు గంటల సినిమా
షూటింగ్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్‌కు వెళ్లాక ఎక్కువ ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమా నిడివి ఐదుగంటలపైనే ఉంది. దీన్ని కుదించే క్రమంలో ముఖ్యమైన సన్నివేశాలు కట్ చేయాల్సి వచ్చింది. దీని ప్రభావం సినిమాలోని ఇతర సీన్లపై పడింది. కానీ మూడు గంటల వ్యవధిలో అన్ని సన్నివేశాలను పెట్టలేం కదా.. అన్నాడు. పాటలకు ఎక్కువ ఖర్చవడం వల్లే సినిమా బడ్జెట్ రెట్టింపైందన్న వార్తను సైతం కొట్టిపారేశాడు.
(చదవండి: డబ్బు కోసం నన్నే చంపాలనుకుంది.. నా వందకోట్ల ఆస్తి..: హీరోయిన్ మాజీ భర్త)
పాటలకే రూ.75 కోట్లు!
గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌లో దిల్‌రాజే స్వయంగా నాలుగైదు పాటలకే రూ.75 కోట్లు ఖర్చయిందని వెల్లడించాడు. రిహార్సల్స్ కలుపుకుంటే అది ఇంకా ఎక్కువే అవుతుందన్నాడు. జరగండి.. జరగండి .. పాటలో 600 మంది డ్యాన్సర్లు పని చేయగా ఈ సాంగ్ షూటింగ్ 13 రోజులపాటు జరిగిందట!
చదవండి: 3 కోట్ల బడ్జెట్.. 136 కోట్ల కలెక్షన్స్.. ‘పుష్ప2’ని మించిన హిట్!
Comments
Please login to add a commentAdd a comment