ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి రికార్డ్ స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటనైతే రాలేదు. దీంతో కొందరు ఫ్యాన్స్ సైతం ఉన్న ఇంట్రస్ట్ కాస్తా పోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇప్పటికే హనుమాన్ హిందీ వర్షన్ ఓటీటీ హక్కులను జియో సినిమా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచే స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ వారంలో ఫుల్ బజ్ ఉన్న సినిమాల్లో హనుమాన్ నంబర్‌వన్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత యానిమల్, డంకీ చిత్రాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోను ప్రశాంత్ వర్మ అభిమానులతో పంచుకున్నారు.
కాగా.. అయితే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓటీటీ రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన రానుందని పోస్ట్ చేశారు.
— Prasanth Varma (@PrasanthVarma) March 16, 2024
Comments
Please login to add a commentAdd a comment