తేజ సజ్జ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లాంటి బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నా..వాటన్నింటిని తట్టుకొని సంక్రాంతి హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్‌లోనే కాకుండా..బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా హను-మాన్ భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది.
(చదవండి: 'కన్నప్ప' పేరుతో యూట్యూబర్స్‌కి మెయిల్స్.. నిజమేంటి?)
ఇలా పాన్ ఇండియా స్థాయిలో అలరించిన ఈ చిత్రం..ఇప్పుడు జపాన్‌లోనూ సందడి చేయనుంది. అక్టోబర్ 4న ఈ చిత్రం జపాన్‌లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా తెలియజేస్తూ.. ‘విడుదలైన అన్ని చోట్ల సెస్సేషన్ క్రియేట్ చేసిన ‘హను-మాన్’..ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4న జపనీస్ సబ్‌టైటిల్ వెర్షన్ విడుదల కానుంది’ అని పేర్కొన్నాడు.
After creating a sensation all over❤️🔥#HanuMan is now all set to amaze the audience in Japan 💥
The Japanese subtitled version is all set to hit the screens on October 4th 🤩#HanuManInJapan 🔥
🌟ing @tejasajja123@Actor_Amritha @Niran_Reddy @varusarath5 @VinayRai1809… https://t.co/ccprtfKEs3— Prasanth Varma (@PrasanthVarma) July 27, 2024
Comments
Please login to add a commentAdd a comment