
తేజ సజ్జ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం..ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ లాంటి బడా హీరోల సినిమాలు బరిలో ఉన్నా..వాటన్నింటిని తట్టుకొని సంక్రాంతి హిట్ సినిమాగా నిలిచింది. టాలీవుడ్‌లోనే కాకుండా..బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా హను-మాన్ భారీ వసూళ్లను రాబట్టింది. స్టార్ హీరోలు లేని ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 350 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ పంచుకుంది. వీడియోతో పాటు హనుమాన్ చాలీసాను యాడ్ చేశారు. ఆ వీడియో నిడివి 2:43 నిమిషాలు ఉంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న హనుమాన్ మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి.