ఓటీటీకి హనుమాన్‌.. ఇంతలోనే సడన్‌గా ఏమైంది? | Negative Comments On Hanu-Man Movie OTT Streaming On Zee5 | Sakshi
Sakshi News home page

ఓటీటీకి హనుమాన్‌.. సడన్‌గా ఎందుకిలా చేస్తున్నారు!

Published Sun, Mar 17 2024 7:26 PM | Last Updated on Mon, Mar 18 2024 10:01 AM

Negative Comments On Hanu Man Movie OTT Streaming On Zee5 - Sakshi

టాలీవుడ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హనుమాన్ ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసింది. మొదట హిందీ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించిన మేకర్స్.. తెలుగులో ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. మొదట్లో శివరాత్రి సందర్భంగా ఓటీటీకి వస్తుందని భావించినప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాతనైనా మార్చి 16న హిందీ వర్షన్‌తో పాటే సర్‌ప్రైజ్‌ ఉంటుందేమోనని ఫ్యాన్స్ భావించారు. దీంతో హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్స్‌ వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 

కానీ ఎవరూ ఉహించని విధంగా హిందీ వర్షన్ స్ట్రీమింగ్‌ అయిన కొద్దిగంటల్లోనే చెప్పా పెట్టకుండా తెలుగులోనూ స్ట్రీమింగ్ చేశారు. అసలు హనుమాన్ ఓటీటీకి వచ్చిందన్న విషయం జీ5లో చూస్తే కానీ అభిమానులకు తెలియరాలేదు. కానీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్న సినిమాను సడన్‌గా స్ట్రీమింగ్‌ ఎందుకు చేశారు? ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ కోసం తేదీని ప్రకటించకుండా స్ట్రీమింగ్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ విషయంలో నెటిజన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఓటీటీ రిలీజ్‌ ఆలస్యం కావడంతో ఆడియన్స్‌కు ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా పోతుందనే సడన్‌ స్ట్రీమింగ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. 

మరోవైపు హనుమాన్ ఓటీటీ రిలీజ్ తర్వాత నెటిజన్స్‌ కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. థియేటర్లలో అలరించిన హనుమాన్‌కు.. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌కు వచ్చేసరికి నెగెటివిటీ స్ప్రెడ్‌ కావడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరేమో కావాలనే ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన మూవీ అని ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా థియేటర్లలో మెప్పించిన ఈ సినిమాకు ఓటీటీలో ఇలాంటి టాక్‌ రావడం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement