బాక్సాఫీస్ సంచలనం హనుమాన్ మూవీ ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోంది. ఈనెల 17న సడన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసిన ఈ చిత్రం ఓటీటీ దూసుకెళ్తోంది. స్ట్రీమింగ్‌కు వచ్చేసిన 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించింది. జీ5 ఓటీటీ చరిత్రలో తొలి రోజున ఉన్న రికార్డులను తిరగరాసింది. 2024లో జీ 5ను ప్రపంచ వ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలబెట్టింది.
బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొడుతోంది. వ్యూస్‌తో గ్లోబల్‌గా జీ5లో నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయాన్ని జీ5 తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. విజువల్స్, భక్తి పారవశ్యంలో మునిగిపోయే సన్నివేశాలు, రోమాలు నిక్కబొడిచే యాక్షన్‌తో పాటు పాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
హనుమాన్ కథేంటంటే...
అంజనాద్రి ప్రాంతంలో ఉండే హనుమంతు (తేజ సజ్జ) అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. తల్లిదండ్రి లేని హనుమంతుని అక్క అంజనమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) అన్నీ తానై హనుమంతుని పెంచి పెద్దచేస్తుంది. ఆ ప్రాంతంలో అన్యాయం చేస్తోన్న గజపతిని ఓ సందర్భంలో హనుమంతు ఆ ఊళ్లో వైద్యం చేయటానికి వచ్చిన డాక్టర్ మీనాక్షి కారణంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనాక్షిని హనుమంతు చిన్నప్పటి నుంచి ఇష్టపడుతుంటాడు. గజపతి కారణంగా హనుమంతు ప్రమాదంలో చిక్కుకుంటే అతని ఆంజనేయ స్వామికి సంబంధించిన ఓ అపూర్వశక్తి దొరుకుతుంది. దాంతో అతను ప్రజలకు మంచి చేస్తుంటాడు. చివరకు విషయం విలన్ వరకు చేరుతుంది. అపూర్వ దైవశక్తిని సంపాదించుకోవటానికి ప్రతినాయకుడు ఏం చేశాడు?.. అతన్ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు.. చివరకు ఆంజనేయస్వామి భక్తుడి కోసం ఏం చేశాడనే కథే హనుమాన్.
RECORDS BROKEN AND HEARTS WON! HanuMan now streaming on ZEE5 in Telugu with English subtitles.
https://t.co/TfUtuuoNTx @tejasajja123 @PrasanthVarma @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @GowrahariK @AsrinReddy @Primeshowtweets @tipsofficial pic.twitter.com/8EymDJjKbU— ZEE5 Telugu (@ZEE5Telugu) March 18, 2024
Comments
Please login to add a commentAdd a comment