ఓటీటీలో హనుమాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి...! | Hanu Man Movie Ott Streaming On Zee5 A Girl Cries After Watching | Sakshi
Sakshi News home page

Hanu Man Movie Ott: ఓటీటీలో హనుమాన్.. కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి...!

Published Mon, Mar 18 2024 3:45 PM | Last Updated on Mon, Mar 18 2024 5:00 PM

Hanu Man Movie Ott Streaming On Zee5 A Girl Cries After Watching - Sakshi

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్‌ కొత్త ఏడాదిలో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చి సూపర్‌ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన హనుమాన్ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. 

అయితే ఈ సినిమాకు చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అయ్యారు. హనుమాన్ విజువల్స్.. తేజ సజ్జా ఫర్మామెన్స్‌కు పిల్లలు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ మూవీని వీక్షించిన ఓ చిన్నారి.. కన్నీళ్లు పెట్టుకుంది. హనుమాన్ చిత్రంలో కుస్తీ ఫైట్‌ సీన్‌ను చూసిన చిన్నారి బోరున ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ పాప తండ్రి ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రిప్లై కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement