
టాలీవుడ్ మూవీ హనుమాన్ సంక్రాంతికి రిలీజైన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీపడి రికార్డ్ స్థాయి వసూళ్లతో అదరగొట్టింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హిందీ వర్షన్ తేదీ ఖరారు చేశారు. ఈనెల 16 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు.
అయితే తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే స్ట్రీమింగ్ డేట్‌పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటనైతే రాలేదు. మరో వైపు గతంలోనే మహా శివరాత్రికి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అలా జరగలేదు.
ఈ నేపథ్యంలో హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓటీటీ రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చాడు. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన రానుందని పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో వెయిటింగ్ అన్న అంటూ కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరేమో ఉన్న ఇంట్రెస్ట్ కాస్తా కూడా పోయిందని పోస్ట్ చేస్తున్నారు. మరీ హిందీ స్ట్రీమింగ్‌తో పాటే ఈ నెల 16 నుంచైనా ఓటీటీకి వస్తుందేమో వేచి చూద్దాం.
#HanuMan OTT streaming date announcement is coming! 😊👍🏼
— Prasanth Varma (@PrasanthVarma) March 11, 2024