'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే? | Hanuman Director Prasanth Varma Cryptic Tweet On Ranveer Singh? | Sakshi
Sakshi News home page

Prasanth Varma: బ్లాక్ బస్టర్ హిట్.. కానీ ప్రశాంత్ వర్మకు రిజెక్షన్

Published Mon, Jul 8 2024 2:59 PM | Last Updated on Mon, Jul 8 2024 3:41 PM

HanuMan Director Prasanth Varma Cryptic Tweet On Ranveer Singh

'హనుమాన్'తో ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి ప్రశాంత్ వర్మ. అప్పటివరకు తెలుగులో పలు సినిమాలు తీసినప్పటికీ ఓ మాదిరి గుర్తింపు వచ్చింది. ఎప్పుడైతే 'హనుమాన్' థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుందో ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోయింది. సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల్లో ఇతడు బిజీగా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది.

(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ)

'హనుమాన్' తర్వాత దీనికి సీక్వెల్‌గా 'జై హనుమాన్' ఉందని ప్రకటించారు. త్వరగా ఈ మూవీ వస్తే బ్రేక్ ఇద్దామని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ మాత్రం వేరే ప్రాజెక్టులు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. అలా బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో 'రాక్షసుడు' అనే మూవీ ఓకే అయిందని కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. అనంతరం కొన్నాళ్లకు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్ వినిపించింది.

ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ పెట్టాడు. 'ప్రతి తిరస్కరణ ఏదో ఒకరోజు తిరిగి ఆశీర్వాదం అవుతుంది' అని రాసుకొచ్చాడు. దీంతో ఎవరికీ తోచింది వాళ్లు అనేసుకుంటున్నారు. హీరో రణ్‌వీర్ సింగ్ రిజెక్ట్ చేయడమే ఈ ట్వీట్‌కి కారణమని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత? అసలేం జరిగిందనేది ప్రశాంత్ వర్మ చెప్తే తప్ప క్లారిటీ రాదు!

(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement