భారత్‌లో ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్ 2028 నాటికి దాదాపు రూ.1.08 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తుందని ‘మీడియా పార్టనర్స్ ఏషియా’ నివేదిక తెలిపింది. రానున్న నాలుగేళ్లలో ఈ పరిశ్రమలో 2.8 లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది.
నివేదికలోని వివరాల ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో వీడియో మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో సేవలందిస్తున్న కంపెనీలు అమలు చేస్తున్న ప్రీమియం వల్ల వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ ఎకానమీ 2028 నాటికి 8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. 2018లో ఈ ఇండస్ట్రీ మార్కెట్ విలువ రూ.27 వేలకోట్లుగా ఉంది. 2023లో ఇది రూ.48 వేలకోట్లకు పెరిగింది. 2028 నాటికి వీడియో స్ట్రీమింగ్ మార్కెట్ విలువ రూ.1.08 లక్షల కోట్లుకు చేరుకుంటుందని అంచనా. దానివల్ల దాదాపు 2.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?
ఈ సందర్భంగా మీడియా పార్టనర్స్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కూటో మాట్లాడుతూ..‘నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ కంపెనీలు భారత్‌లో స్థానిక కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి ఏటా సుమారు రూ.4 వేలకోట్లు వెచ్చిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా క్రీడలను ప్రసారం చేయడానికి ఏటా సుమారు రూ.8,300 కోట్లు ఖర్చు చేస్తోంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment