Online video
-
ఇక యూట్యూబ్‌లో షాపింగ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ భారత్‌లో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అర్హత కలిగిన క్రియేటర్లు తమ వీడియోలకు ఉత్పత్తులను జోడించడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించేందుకు ఈ కార్యక్రమం వీలు కలి్పస్తుంది. వీడియోలు, షార్ట్స్, లైవ్స్ట్రీమ్స్కు కంటెంట్ క్రియేటర్లు ప్రొడక్ట్స్‌ను ట్యాగ్ చేస్తే.. వీడియో డి్రస్కిప్షన్లో, అలాగే ప్రొడక్ట్ సెక్షన్లో అవి ప్రత్యక్షం అవుతాయి. వ్యూయర్స్ వాటిని క్లిక్ చేయడం ద్వారా రిటైలర్స్ సైట్‌కు చేరుకుని షాపింగ్ చేయవచ్చు. వీక్షకులు చేసే కొనుగోళ్ల ఆధారంగా కంటెంట్ క్రియేటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుతానికి ఈ–కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, మింత్రా పోర్టల్‌లో లిస్ట్ అయిన ఉత్పత్తులను క్రియేటర్లు తమ వీడియోలకు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా సక్సెస్..: యూట్యూబ్ షాపింగ్ అంతర్జాతీయంగా విజయవంతం అయిందని యూట్యూబ్ తెలిపింది. అంతర్జాతీయంగా 2023లో వ్యూయర్స్ ఏకంగా 3,000 కోట్లకుపైగా గంటల షాపింగ్ సంబంధ కంటెంట్‌ను యూట్యూబ్‌లో వీక్షించారు. ఈ నేపథ్యంలో షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను భారత్‌లో పరిచయం చేసినట్టు యూట్యూబ్ షాపింగ్ జీఎం, వైస్ ప్రెసిడెంట్ ట్రావిస్ కజ్ తెలిపారు. -
వైరల్ వీడియోల కోసం మరీ ఇలానా..! ఏకంగా రైలు పట్టాలనే..!
ఇటీవల సోషల్ మీడియా పిచ్చి మాములుగా లేదు. ఎంతలా అంటే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసేందుకు ఎలాంటి పిచ్చి పనులు చేసేందుకైనా వెనకాడటం లేదు. వ్యూస్, లైక్‌లు, ఫాలోవర్లు ఇదే లోకం, లక్ష్యం అన్నట్లుగా ఎలా పడితే అలా వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. అది సమంజసమైన వీడియోనేనా, నెటిజన్లకు ఉపయోగపడుతుందా అనేది అనవసరం. కొందరైతే ఘోరం ప్రమాదాలను సృష్టించి ఇతరుల ప్రాణాల రిస్క్‌లో పడేసి మరీ వీడియోలు తీసేస్తున్నారు. ఇలాంటి పనే చేశాడు 17 ఏళ్ల కుర్రాడు.ఏం చేశాడంటే..అమెరికాలోని నెబ్రస్కా రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల కుర్రాడికి యూట్యూబ్‌లో వీడియో వైరల్ చేయాలనే కోరికతో దారుణానికి ఒడిగట్టాడు. వీడియో కోసం అని ఏప్రిల్‌లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అక్కడ రైళ్ల మార్గాలను నిర్దేశించే స్విచ్‌ల లాక్ తీసి వాటిల్లో మార్పులు చేశాడు. సమీపంలో తన కెమెరా ట్రైపాడ్ అమర్చి కాచుకొని కూర్చున్నాడు. ఇంతలో బీఎన్ఎస్ఎఫ్ సంస్థకు చెందిన రెండు లోకోమోటీవ్‌లు, ఐదు బోగీలు వచ్చాయి. ఆ డ్రైవర్ ఏం జరిగిందో గుర్తించే సమయానికి అవి పట్టాలు తప్పాయి.ప్రమాదం సృష్టించిన ఈ బాలుడే మళ్లీ రైల్వే అధికారులకు ఫోన్ చేసి అప్రమత్తం చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఎవరో కీలక స్విచ్‌లను మార్చినట్లు గుర్తించారు. ఎందుకనో పోలీసులు అనుమానంతో సమాచారం అందించిన బాలుడినే గట్టిగా విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. విచారణలో ఆ బాలుడు..తాను పట్టాలు తప్పుతున్న రైలు వీడియో చిత్రీకరించాలనుకున్నట్లు తెలిపాడు. కానీ ఆ స్విచ్ మార్పులతో తనకు సంబంధం లేదని బుకాయించాడు. అయితే అధికారులు అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ప్రమాదానికి ముందు వాహనంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. అతడు బాలుడితో సరిపోలాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. ఈ ప్రమాదం కారణంగా ఒహామా పబ్లిక్ పవర్ డిస్ట్రిక్ట్‌కు, బీఎన్ఎస్ఎఫ్ రైల్వేకు దాదాపు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందట.(చదవండి: స్టైల్ ఐకాన్ నటాషా పూనావాలా గ్లాస్ మాదిరి పర్సు ధర ఎంతంటే..?) -
వీడియో స్ట్రీమింగ్ రంగంలో 2.8 లక్షల మందికి ఉపాధి
భారత్‌లో ఆన్లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్ 2028 నాటికి దాదాపు రూ.1.08 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తుందని ‘మీడియా పార్టనర్స్ ఏషియా’ నివేదిక తెలిపింది. రానున్న నాలుగేళ్లలో ఈ పరిశ్రమలో 2.8 లక్షల ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో వీడియో మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో సేవలందిస్తున్న కంపెనీలు అమలు చేస్తున్న ప్రీమియం వల్ల వీడియో ఎంటర్టైన్మెంట్ ఎకానమీ 2028 నాటికి 8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. 2018లో ఈ ఇండస్ట్రీ మార్కెట్ విలువ రూ.27 వేలకోట్లుగా ఉంది. 2023లో ఇది రూ.48 వేలకోట్లకు పెరిగింది. 2028 నాటికి వీడియో స్ట్రీమింగ్ మార్కెట్ విలువ రూ.1.08 లక్షల కోట్లుకు చేరుకుంటుందని అంచనా. దానివల్ల దాదాపు 2.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?ఈ సందర్భంగా మీడియా పార్టనర్స్ ఏషియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కూటో మాట్లాడుతూ..‘నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ కంపెనీలు భారత్‌లో స్థానిక కంటెంట్‌ను కొనుగోలు చేయడానికి ఏటా సుమారు రూ.4 వేలకోట్లు వెచ్చిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన జియో సినిమా క్రీడలను ప్రసారం చేయడానికి ఏటా సుమారు రూ.8,300 కోట్లు ఖర్చు చేస్తోంది’ అన్నారు. -
చైనా తన గొప్ప కోసం ఎంతకు తెగించిందంటే..ఆఖరికి ఆన్లైన్ వీడియోలు సైతం..
ప్రతి దేశంలోనూ ఎంతో కొంత మేర పేదరికం కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల రీత్యా లేదా వాతావరణం లేదా మౌలిక వనరుల దృష్ట్యా పేదరికంలో ఉండటం జరుగుతుంది. కానీ చైనా తమ దేశంలో ఆ స్థితే తలెత్తదు అన్నట్టుగా వ్యవహిరిస్తుంది. అందుకు సంబంధించి చిన్న విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతోందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఆ క్రమంలో వాటికి సంబంధించిన ఆన్లైన్ వీడియోలను కూడా తొలగించి.. బ్యాన్ చేస్తోందని చెబుతోంది. అందుకు ఉదహారణగా చైనాలోని కొన్ని ఆన్లైన్ వీడియోల గురించి కూడా వెల్లడించింది న్యూయార్క్ టైమ్స్. ఆయా వీడియోల్లో ఓ మహిళ ఇటీవలే తాను పదవీ విరణమ పొందానని, తన జీతం 100 యువాన్లని చెప్పింది. ఈ సొమ్ముతో ఎంత కిరాణ సామాగ్రిని కొనగోలు చేయవచ్చో చెప్పండి అని వాపోయింది. మరోక యువ గాయకుడు ఉద్యోగావకాశాల గురించి సోషల్ మీడియా వేదికగా నిరాసక్తతను వ్యక్తం చేశాడు. అలాగే ఒక వలస కార్మికుడు కరోనా సమయంలో తన కుటుంబాన్ని పోషించడానికి ఎలా కష్టపడ్డాడో వివరించాడు. దీంతో అతను విస్తృతమైన నెటిజన్ల సానుభూతిని పొందాడు. అంతే.. చైనా ఆయా వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలను మరుక్షణమే నిలిపేసింది. పైగా సదరు కార్మికుడు ఇంటికి ఎవరూ అప్రోచ్ కాకుండా ఉండేలా అధికారులు ఇంటి వద్దే మోహరించి ఉన్నారు. ఆఖరికి జర్నలిస్టులను కూడా రాకుండా అడ్డుకున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే వీడియోలను, ఆర్థికపరిస్తితికి సంబంధించిన ఇలాంటి వీడియోలు లేదా పోస్టులు ప్రచురించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించింది చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది వృద్ధులు, వికలాంగులు, పిల్లలకు సంబంధించిన విచారకరమైన వీడియోలను కూడా నిషేధిస్తుంది. చైనాకు సంబంధించినంత వరకు సానుకూల విషయాలనే ఉంచడానికే ప్రయారిటీ ఇస్తుంది. కేవలం చైనా కమ్యానిస్ట్ పార్టీ గత నాలుగు దశాబ్దాలుగా ఎంతమందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందనే దాని గురించే గొప్పగా చెప్పుకుంటుంది. కానీ మావో జెడాంగో హయాంలో మొత్తం దేశాన్ని ఎలా కడు పేదరికంలో నెట్టిందో ప్రస్తావించడానికి నిరాకరిస్తుంది చైనా. నిజానికి చైనా చాలా సరిపడని సామాజికి భద్రతా వలయంలో చిక్కుకుంది. చైనా ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నప్పటికీ.. అక్కడి ప్రజలు చాలా మంది దారిద్యరేఖకు దిగువన జీవిస్తున్నారు. అక్కడి ప్రజలు చాలా దయనీయమై పేదరికంలో బతుకుతున్నారు. ఒక పక్క దేశ ఆర్థిక పరిస్థితులు మసకబారుతుండటంతో ప్రజలు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఐతే చైనా ప్రభుత్వం పేద ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితి గురించి చర్చించడాన్ని నిషేధించడమే గాక ప్రభుత్వం దృష్టిలో ఆ విషయమే ఒక నిషిద్ధ అంశంగా మారింది. ఎంతలా అంటే.. చైనా దేశంలోని అతి పెద్ద వార్తా పోర్టల్ క్యూక్యూ డాట్ కామ్‌లో.. చైనీస్ పదం పిన్‌కున్(పేదరికం)ని సర్చ్ చేస్తే.. అమెరికా వంటి దేశాల్లో మరణాలు సంభవించడానికి నాల్గవ ప్రధాన కారణం పేదరికం అని చూపిస్తే, చైనాలోని పేదరికం సంబంధించిన వార్తలే అరుదుగా కనిపించడం గమనార్హం. చైనా తమ దేశంలోని పేదరికిం గురించి బయటపడకుండా ఉండేలా వాటికి సంబంధించిన ఆన్లైన్ వీడియోలన్నింటిని నిషేధించింది. దీంతో చైనాలో చాలామందికి తమ దేశంలో పేదరికిం ఎంత ప్రబలంగా ఉందో తెలియదు. కాగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాత్రం 2021లో పేదరికానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఒక సమగ్ర విజయం సాధించాం అని ప్రకటించడం గమనార్హం. (చదవండి: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 9 మంది మృతి) -
వెలుగులోకి అలీబాబా చీఫ్ జాక్‌మా
బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, అలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా రెండున్నర నెలల తర్వాత ఆన్లైన్ వీడియోలో ప్రత్యక్షమయ్యారు. 50 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో.. తన ఫౌండేషన్ మద్దతు పొందిన టీచర్లకు అభినందనలు తెలియజేశారు. తను రెండున్నర నెలలుగా కనిపించకుండా పోవడానికి, అలీబాబా గ్రూపుపై చైనా సర్కారు నియంత్రణ చర్యల గురించి మా ప్రస్తావించలేదు. ఈ వీడియో చైనా బిజినెస్ న్యూస్, ఇతర పోర్టళ్లలో దర్శనమిచ్చింది. ‘‘జనవరి 20న జరిగిన వార్షిక గ్రామీణ టీచర్ల ఆన్లైన్ కార్యక్రమంలో జాక్‌మా పాల్గొన్నారు’’అంటూ జాక్‌మా ఫౌండేషన్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 24న షాంఘై కాన్ఫరెన్స్ సందర్భంగా చైనా నియంత్రణ సంస్థలను జాక్‌మా విమర్శించారు. ఆవిష్కరణలను తొక్కి పెడుతున్నాయని ఆయన ఎత్తిచూపారు. తర్వాత కొన్ని రోజుల్లోనే జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూపు భారీ ఐపీవో ప్రయత్నాలను నియంత్రణ సంస్థలు సస్పెండ్ చేశాయి. వ్యాపార దిగ్గజంగా ఎదిగిన 56 ఏళ్ల జాక్‌మా ఆ తర్వాత నుంచి కనిపించకుండాపోవడంతో.. చైనా కమ్యూనిస్ట్ సర్కారు నిర్బంధించి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
మూడో ప్రపంచ యుద్ధం తప్పదట!
న్యూయార్క్: మూడో ప్రపంచ యుద్ధం అతి సమీపంలోకి వచ్చిందని, ఏ క్షణాన్నైనా యుద్ధం ప్రారంభకావొచ్చని హెచ్చరిస్తూ అనానిమస్ (గుర్తుతెలియని)గా చెప్పుకుంటున్న హ్యాకర్ల బృందం ఓ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసింది. గతంలో జరిగిన ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తరహాలో ఈ మూడో యుద్ధం కొన్ని సంవత్సరాలుగానీ, నెలల తరబడిగాని జరగదని కూడా పేర్కొంది. సత్వరం ముగిసే ఈ యుద్ధం గతంలోకంటే హోరాహోరీగా, క్రూరంగాను జరుగుతుందని హ్యాకర్ల బృందం అంచనా వేసింది. మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఉత్తరకొరియా ద్వీపకల్పంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని కూడా అనానిమస్ హ్యాకర్లు చెబుతున్నారు. చైనా, జపనీస్ ప్రభుత్వాలు పౌర హెచ్చరికలు జారీ చేయడం కూడా ఇందుకు సూచననేనని అంటున్నారు. దక్షిణ కొరియాలో అమెరికా థాడ్ ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించడంతోపాటు మూడు ఖండాంతర క్షిపణులను కూడా అమెరికా పరీక్షించడాన్ని హ్యాకర్లు ప్రస్తావించారు. ఉత్తర కొరియా సరిహద్దుల్లో మోహరిస్తున్న ఆ దేశ సైన్యాన్ని, సైనిక సంపత్తిని కూడా హ్యాకర్లు యుద్ధ సన్నాహాలుగానే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా నుంచి చైనా పౌరులను వెనక్కి రావాల్సిందిగా చైనా ప్రభుత్వం ట్రావెల్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర కొరియా అణు దాడికి పాల్పడితే ప్రాణాలతో బయటపడేందుకు పది నిమిషాలకు మించి సమయం దొరకదని చైనా పేర్కొంది. ప్రపంచ దేశాలు మూడు బృందాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తాయని హ్యాకర్లు పేర్కొన్నారు. ఎవరి నాయకత్వాన ఆ బృందాలు ఏర్పాడతాయనే విషాయాన్ని మాత్రం తెలపలేదు. అమెరికా, ఉత్తరకొరియా రెండు బృందాలుగా చీలిపోతే మరి మూడో బృందం ఏ దేశం నాయకత్వాన ఏర్పడుతుందనే విషయంలో హ్యాకర్ల మాటల్లో స్పష్టత లేదు. రష్యా పేరును అసలు ప్రస్తావించకపోవడం కూడా ఇక్కడ గమనార్హం. మూడో ప్రపంచ యుద్ధం కచ్చితంగా జరుగుతుందని తాము చెప్పడం లేదని, యుద్ధం జరిగేందుకు కచ్చితమైన పరిస్థితులు ఉన్నాయని మాత్రమే తాము చెబుతున్నామని పేర్కొన్నారు. అనానిమస్ హ్యాకర్లు విడుదల చేసిన ఏడు నిమిషాల నిడివిగల వీడియోలో మాట్లాడిన హ్యాకర్ తనను గుర్తుపట్టకుండా చిత్రమైన మాస్క్ ధరించాడు. -
ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్ జోరు!
న్యూఢిల్లీ: ఈ కొత్త ఏడాది ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్దే అంటోంది యాడోమంత్ర డిజిటల్. ఈ సంస్థ ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తుంది. హైస్పీడ్ మొబైల్ నెట్వర్క్ విస్తరణ, ఇంటర్నెట్ వినియోగం పెరుగుదల వంటి పలు అంశాలు ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్ జోరుకు దోహదపడతాయని తాజాగా తన నివేదికలో పేర్కొంది. ఇక అడ్వర్టైజింగ్ జోరులో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్ వంటి వాటితో వీడియో వీక్షణంతోపాటు వీడియో అడ్వర్టైజింగ్ కూడా పెరుగుతుందని వివరించింది. ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్ విభాగపు ఆదాయం గతేడాది దాదాపు రెండు రెట్లు పెరిగిందని పేర్కొంది. ఆన్లైన్ వీడియో అడ్వర్టైజింగ్ పరిశ్రమలో 2016లో 200 శాతం వృద్ధి నమోదయ్యిందని తెలిపింది.