Harom Hara Movie
-
ట్రెండింగ్‌లో సుధీర్ బాబు ‘హరోంహర’
సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 14న థియేటర్స్‌లో విడుదలై మిక్స్డ్ టాక్ని తెచ్చుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రం దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫాంల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో విశేష ఆదరణ సొంతం చేసుకొని టాప్ 1లో నిలిచింది. దేశవ్యాప్తంగా టాప్1లో ఉన్నట్లు తెలుపుతూ అమెజాన్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.హరోంహర కథేంటంటే..ఈ సినిమా కథంతా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని అంతా తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటారు. తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రమణ్యం(సుధీర్ బాబు). అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు.ఆ విషయం శరత్ తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్‌కి వార్నింగ్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మాఫియా లీడర్‌కు ఓ ఊరు మొత్తం ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'హరోం హర'. జూన్ 14న రిలీజైన ఈ సినిమాకు టాక్ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో సరిగ్గా నెల రోజులకు డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు.తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. అలాగే జియో సినిమాలో హిందీ వర్షన్ విడుదలైంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్గా మెప్పించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా సుమంత్ జి నాయుడు నిర్మించాడు.కథ విషయానికి వస్తే..1989లో కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కుమారుడు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. పొలాల్ని కబ్జా చేస్తూ అడ్డొచ్చినవారిని అంతం చేస్తుంటారు. ఆ ప్రాంతంలోని పాలిటెక్నిక్ కాలేజీలోకి సుబ్రమణ్యం(సుధీర్ బాబు) ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు. అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)ను ప్రేమిస్తాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. దీని ఎఫెక్ట్ సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు మూడునెలల్లో తన తండ్రి చేసిన అప్పులు తీర్చాల్సి ఉంటుంది. మరి ఆ సమయంలో హీరో ఏం చేశాడు? అప్పులు తీర్చాడా? తనపై కక్ష సాధించిన విలన్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! -
ఓటీటీలో 'సుధీర్ బాబు' సినిమా.. నేడు సాయంత్రం నుంచే స్ట్రీమింగ్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం 'హరోం హర'. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా గతనెల 14న విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఆగష్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ఆహా ప్రకటించి మళ్లీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా తమ ఎక్స్ పేజీ వేదికగా కొత్త తేదీని ప్రకటించింది.'హరోం హర' మూవీని నేడు (జులై 15) సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆహా తెలుగు వెల్లడించింది. యాక్షన్ ప్యాక్డ్ మండే మూవీ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ తమ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయం తెలిపింది. నేడు సాయంత్రం 5 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న హరోం హర సినిమాను మిస్ కావద్దంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.డార్క్ కామెడీ పేరుతో పలు వీడియోల వల్ల వివాదంలో చిక్కుకున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కూడా 'హరోం హర' సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించాడు. తన యూట్యూబ్ ఛానల్లో ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ వల్ల అరెస్ట్ అయ్యాడు. దీంతో ఆహా ఓటీటీ సంస్థ సినిమా విడుదలను ఆపేసింది. అతడు నటించిన సీన్లను తొలగించి ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీని జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ జి.నాయుడు నిర్మించారు. -
ఓటీటీలో కనిపించని 'హరోం హర'.. అదే కారణమా?
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ హరోం హర. గతనెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీని జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ జి.నాయుడు నిర్మించారు.అయితే హరోం హర ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ముందుగా ప్రకటించినట్లుగా ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ హరోం హర ఓటీటీకి రాలేదు. అయితే సాంకేతికపరమైన సమస్యతోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. మరి ఈ రోజు ఆలస్యమైనా స్ట్రీమింగ్కు వస్తుందా? లేదా కొత్త తేదీని ప్రకటిస్తారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. -
ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
యాక్షన్ మూవీ లవర్స్ రెడీ అయిపోండి. ఎందుకంటే మరో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మహేశ్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హరోం హర'. కొన్ని రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లు కాకుండా మరో ఓటీటీలోకి రాబోతుంది. ఇంతకీ డీటైల్స్ ఏంటి?సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ సినిమా 'హరోం హర'. కుప్పం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా జూన్ 14న థియేటర్లలోకి వచ్చింది. 'పుష్ప', 'కేజీఎఫ్' లాంటి చిత్రాలని పోలినట్లు ఉందని టాక్ వల్ల జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ డీల్ సెట్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?)తొలుత ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆహా ఓటీటీలో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అంటే ఈ వీకెండ్ ఏదైనా యాక్షన్ మూవీ చూస్తూ టైమ్ పాస్ చేద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.అది 1980. కుప్పంలో ముగ్గురు రౌడీలు ఉంటారు. ఈ ఊరిలోనే కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు). ఓ సందర్భంలో రౌడీతో గొడవపడటం వల్ల ఉద్యోగం కోల్పోతాడు. అదే టైంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. దీంతో సొంతంగా తుపాకులు తయారు చేస్తాడు. సస్పెండ్ అయిన పళని స్వామి (సునీల్)తో కలిసి గన్స్ తయారు చేస్తాడు. పోలీసులు-రౌడీలు ఇతడు ఎందురు టార్గెట్ అయ్యాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే!) -
హీరో సుధీర్ బాబుకి కొత్త ట్యాగ్.. సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్!
తెలుగులో బోలెడు మంది హీరోలు. వీళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఉంటుంది. చిరంజీవికి మెగాస్టార్, మహేశ్ బాబుకి సూపర్ స్టార్, అల్లు అర్జున్‌కి ఐకాన్ స్టార్.. ఇలా దాదాపు స్టార్ హీరోలు చాలామందికి పేరుకి ముందు ఏదో ఓ ట్యాగ్ ఉంటుంది. కానీ కొందరు యంగ్ హీరోలు కూడా ఇలా ట్యాగ్స్ కోసం తెగ తాపత్రయ పడుతున్నారు. తాజాగా సుధీర్ బాబు కూడా అలానే కొత్తగా ట్యాగ్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: ‘హరోం హర’ మూవీ రివ్యూ)స్టార్ హీరోలు పెట్టుకున్న ట్యాగ్ గురించి పెద్దగా కంప్లైంట్స్ ఉండవు గానీ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఎవరైనా ట్యాగ్స్ పెడితే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మహేశ్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు.. చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా వంక పెట్టడానికేం లేదు. కానీ హిట్ మాత్రం దక్కట్లేదు. ఇప్పుడు పూర్తిగా మాస్‌ని నమ్ముకుని 'హరోం హర' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. కానీ 'పుష్ప', 'కేజీఎఫ్' సినిమాల పోలికలు మరీ ఎక్కువైపోయావని అంటున్నారు.ఈ సినిమా ముందు వరకు 'నైట్రో స్టార్' అని పెట్టుకున్న సుధీర్ బాబు.. 'హారోంహర' కోసం 'నవ దళపతి' అని ట్యాగ్ మార్చుకున్నాడు. దళపతి అనగానే మనకు తమిళ హీరో విజయ్ గుర్తొస్తాడు. 'లియో' మూవీ టైటిల్ కార్డ్స్ లో విజయ్ కి పడ్డట్లే ఈ చిత్రంలో ఫొటోలు దాదాపు అలానే పడ్డాయి. దీంతో విజయ్-సుధీర్ బాబు ఫొటోలతో సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే 'హరోంహర'లో సుధీర్ బాబుతో పాటు సునీల్, మాళవిక శర్మ కీలక పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)Perfect mass ComeBack Anna🙌🏻🔥After a long waittt🥵NAVA DHALAPATHY🔥🔥🔥@isudheerbabu #Haromhara #Sudheerbabu #Maheshbabu pic.twitter.com/kbLH3zMDw7— KritiSam❤️ (@kritisam7) June 14, 2024 -
‘హరోం హర’ మూవీ రివ్యూ
టైటిల్: హరోం హరనటీనటులు: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కి లక్ష్మణ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులునిర్మాత : సుమంత్ జి నాయుడురచన, దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారకసంగీతం: చైతన్ భరద్వాజ్ఎడిటర్ : రవితేజ గిరిజాలవిడుదల తేది: జూన్ 14, 2024వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూనే ఉంటాడు. ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం ‘హరోం హర’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘హరోం హర’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని అంతా తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటారు. తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రమణ్యం(సుధీర్ బాబు). అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. ఆ విషయం శరత్ తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్‌కి వార్నింగ్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. (Harom Hara Review) ఇలాంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మాఫియా లీడర్‌కు ఓ ఊరు మొత్తం ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని కొంతమంది దుర్మార్గులు తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను హింసించడం.. అక్కడకు హీరో సాధారణ వ్యక్తిలా వచ్చి వారిని అంతమొందించి ప్రజలకు విముక్తి కలిగించడం.. ఇలాంటి కథలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. హరోం హర మూవీ లైన్ కూడా ఇదే. కేజీయఫ్, పుష్ప సినిమాల మాదిరి హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. (Harom Hara Review)సినిమా ప్రారంభం మొదలుకొని క్లైమాక్స్ వరకు ప్రతీ సన్నివేశం.. పుష్ప, కేజీయఫ్, ఛత్రపతి సినిమాలను గుర్తు చేస్తుంది. ఇక విలన్లు చేసే అరాచకాలు చాలా పాత సినిమాలను గుర్తు చేస్తాయి. కేజీయఫ్ స్టైల్లో పళని(సునీల్) హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథను ప్రారంభిస్తాడు. తమ్మిరెడ్డి, శరత్ పరిచయ సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. హీరో ఎంట్రీ చాలా సింపుల్‌గా ఉంటుంది. హీరోయిన్‌తో లవ్‌ట్రాక్ నడిపిస్తూనే.. ఊర్లో తమ్మిరెడ్డి మనుషుల ఆగడాలను చూపిస్తారు. అయితే అటు లవ్ ట్రాక్‌తో పాటు రొట్టకొట్టుడు విలనిజం బోర్ కొట్టిస్తుంది. హీరో గన్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యేవరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని ఫైట్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక హీరో తుపాకులు తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వడం.. యాక్షన్ సీన్స్ అదిరిపోవడంతో ఫస్టాఫ్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం నీరసంగా సాగుతుంది. కేజీయఫ్, విక్రమ్ మాదిరి యాక్షన్స్ సీన్స్ వస్తుంటాయి కానీ ఎక్కడా ఆకట్టుకోలేవు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, అమితాబ్ అంటూ పేర్లు పెట్టి కొత్త తుపాకులను అమ్మడం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. (Harom Hara Movie Review) ఇక చివర్లో జ్యోతిలక్ష్మి(హీరో ప్రత్యేకంగా తయారు చేసిన పెద్ద గన్)తో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. అయితే ఈ సినిమా నేపథ్యంతో పాటు పాత్రలను తిర్చిదిద్దిన విధానం.. పలికించిన భాష, యాస అన్ని పుష్స సినిమాను గుర్తు చేసేలా ఉంటాయి. మాస్ యాక్షన్ సినిమాలకు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సుబ్రమణ్యం పాత్రలు సుధీర్ ఒదిగిపోయాడు. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో సుధీర్ నటించలేదు. యాక్షన్ సీన్స్‌లో చించేశాడు. మాళవిక శర్మ తెరపై కనిపించేదే కాసేపే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. పోలీసు ఆఫీసర్‌గా అక్షర గౌడ తన పాత్ర పరిధిమేర నటించింది. సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ పళనిస్వామిగా సునీల్, విలన్లుగా రవి కాలే, అర్జున్ గౌడ, లక్కి లక్ష్మణ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. (Harom Hara Movie Review) హీరో తండ్రిగా నటించిన జయప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చేతన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
Sudheer Babu: కథలో నుంచి హీరో పుట్టాలి
‘‘నాకు కమర్షియల్ సినిమాలు చేయడం ఇష్టమే. కానీ హీరో కోసం కథలో ప్రత్యేకమైన కమర్షియల్ అంశాలు ఉండకూడదు. కథలో నుంచి హీరో పుట్టాలి. అలాంటి కథలను ఎంచుకోవడానికి ఇష్టపడతాను . ‘హరోం హర’ ఈ తరహా చిత్రమే. తెలుగు సినిమాలోని మొదటి పది యాక్షన్ సినిమాల్లో ఎప్పటికీ ‘హరోం హర’ ఉంటుందని నమ్ముతున్నాను. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’’ అని సుధీర్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు. ⇒ ఈ చిత్రంలో నా ΄ాత్ర పేరు సుబ్రహ్మణ్యం. కుప్పంలోని ఓ మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం. అక్కడో సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏంటి? సుబ్రహ్మణ్యం ఎందుకు గన్స్ మేకింగ్‌లోకి రావాల్సి వచ్చింది? అన్నదే ఈ చిత్రకథ. కథలో కొన్ని లేయర్స్ ఉన్నాయి. అందులో మైథాలజీ అంశాలు కూడా ఉన్నాయి. నాకు తెలుగు భాష వచ్చు కాబట్టి కుప్పం యాసలో డైలాగ్స్ చెప్పడం పెద్దగా కష్టం అనిపించలేదు. ⇒ జ్ఞానసాగర్ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇంత పెద్ద కథను చేయగలడా? అనిపించింది. కానీ నాకు చెప్పిన కథను చెప్పినట్లుగా విజువల్‌గా తెరపై చూపించాడు. ఈ విషయంలో అతనికి నూటికి నూరు మార్కులు వేస్తాను. అదే విధంగా ఇటీవలి కాలంలో తెలుగులో ‘హరోం హర’లాంటి సినిమా రాలేదని నా నమ్మకం. ఈ సినిమాలో ఓ సస్పెండెడ్ ΄ోలీస్ కానిస్టేబుల్ పళని ΄ాత్రను సునీల్‌గారు చేశారు. సుబ్రహ్మణ్యంకు స΄ోర్టివ్గా ఉండే ΄ాత్ర ఇది. ఈ సినిమా కథ డిమాండ్ చేసిన మేరకు ఖర్చు పెట్టారు నిర్మాత సుమంత్. ‘హరోం హర’కు సీక్వెల్ తీసే స్కోప్ ఉంది. స్టోరీ లైన్ ఉంది. అయితే ఈ సినిమా రిజల్ట్‌పై స్వీకెల్ ఆధారపడి ఉంటుంది. ⇒ జేమ్స్ బాండ్ లాంటి క్యారెక్టర్‌కి చాలా హెవీ వెపన్స్, గాడ్జెట్స్ తయారు చేస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ మన ఊర్లో ఉంటే, మన పక్కింటి కుర్రాడు గన్స్ తయారు చేయాల్సి వస్తే కొంచెం నాటుగా ఉంటుంది. అందుకే ‘హరోం హర’ సినిమాను జేమ్స్ బాండ్ బ్యాక్‌డ్రాప్ ఇన్ కుప్పం అనొచ్చు. ⇒ సూపర్‌స్టార్ కృష్ణగారు నన్ను మాస్ యాక్షన్ మూవీలు చేయమని చెప్పేవారు. ఆయన మంచి మాస్ హీరో. గతంలో నేను చేసినవి చాలావరకు క్లాస్ చిత్రాలు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే ‘హరోంహర’ నేను చేసిన మంచి యాక్షన్ మూవీ అని నమ్మకంగా చూపించేవాడిని. ⇒ నా గత చిత్రాల్లో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. అవి ‘హరోం హర’ సినిమాలో పునరావృతం కాకుండా చూసుకున్నానని అనుకుంటున్నాను. నా ప్రతి సినిమాకు వంద శాతం కష్టపడతాను. అయితే కొన్నిసార్లు మనం ఊహించిన ఫలితాలు రాక΄ోవచ్చు. కానీ ఏదో ఒక మోటి వేషన్ను తీసుకుని ముందుకు వెళ్తుంటాను. -
నమ్మకం ఉంది కాబట్టే ముందే షో వేశారు
‘‘హరోం హర’ ట్రైలర్ చాలా నచ్చింది. సుధీర్‌బాబు మంచి సినిమా చేశాడని తెలిసి, ఈ వేడుకకి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందే డిస్ట్రిబ్యూటర్స్‌ని పిలిచి షో వేశారంటే సినిమాపై యూనిట్‌కి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌పై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ (టీజర్, ట్రైలర్, ΄ాటలు...) ్ర΄ామిసింగ్గా ఉంది. సుబ్రహ్మణ్యం, సుమంత్ లాంటి ΄్యాషన్ ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ‘హరోం హర’ లాంటి నేపథ్యంలో సినిమా రాలేదు. నాతో ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానసాగర్కి థ్యాంక్స్. ఈ సినిమా చూశాక ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం’’ అన్నారు నిర్మాత సుమంత్. ‘‘హరోం హర’లోని తండ్రీ కొడుకుల ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగో΄ాల్, డైరెక్టర్ మారుతి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. -
నాన్న నటించిన ఆ సినిమా అంటే చాలా ఇష్టం: మహేశ్ బాబు
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం 'హరోం హర' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అడివి శేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అయితే ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మహేశ్ బాబుతో సుధీర్ బాబు మాట్లాడిన ఫోన్ రికార్డ్ ఆడియోను ప్లే చేశారు. వీరి మధ్య దాదాపు ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. సుధీర్ బాబు అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధాలిచ్చారు. మొదటిసారి గన్ వాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? అని సుధీర్ ప్రశ్నించగా.. టక్కరి దొంగ సినిమాలో ఎక్కువసార్లు గన్స్ వాడా.. కానీ గన్ కాల్చేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని మహేశ్ అన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మోసగాళ్లకు మోసగాడు గుర్తొచ్చింది.గన్స్ చూపించే సినిమాల్లో మీకు నచ్చిన చిత్రమేది అని సుధీర్ బాబు అడిగాడు. నాన్న గారు నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను వందసార్లు చూశానని మహేశ్ అన్నారు. హరోంహరలో నీకు బాగా నచ్చిన పాట ఏదని అడగ్గా.. టైటిల్ సాంగ్ అని మహేశ్ ఆన్సరిచ్చారు. హరోంహర ట్రైలర్లో నీకు నచ్చిన అంశాలు ఏంటి? అని సుధీర్ ప్రశ్నించాడు. ఈ సినిమాలో నువ్వు చాలా కొత్తగా ఉన్నావ్.. ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదనిపించింది.. అని మహేశ్ బాబు అన్నారు. మీరు నటించిన నిజం సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఏమైనా ఉన్నాయా? అని సుధీర్ బాబు అడిగారు. నిజం చాలా నచ్చిన సినిమా అది. అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్. నా సినిమాల్లో నిజం ఒక ఫెవరేట్ ఫిల్మ్ అని మహేశ్ బాబు అన్నారు. కాగా.. సుధీర్ బాబు నటించిన హరోం హర జూన్ 14 థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు హరోం హర పెద్ద హిట్ అవ్వాలని.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. Here we go from the man himself @urstrulyMahesh about #HaromHara#HaromHaraOnJune14th pic.twitter.com/e5iUutn4ML— Sudheer Babu (@isudheerbabu) June 11, 2024 -
నెమలి కనబడటం నాకో పాజిటివ్ సైన్: డైరెక్టర్ జ్ఞానసాగర్
సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హరోం హర’. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో జ్ఞానశేఖర్ మాట్లాడుతూ –‘‘కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్ ఇది. కుప్పంలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేసే ఓ మామూలు కుర్రాడు సుబ్రహ్మణ్యం ఎందుకు గన్స్ మేకింగ్‌లో ఇన్వాల్స్ కావాల్సి వచ్చింది? ఆ తర్వాత అతని జీవితం ఏ విధంగా మలుపు తిరిగింది? అన్నదే ఈ సినిమా కథ. ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. మంచి ఫాదర్ ఎమోషన్ కూడా ఉంది. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుణ్ణి. అందుకే ఈ సినిమాకు ‘హరోం హర’ టైటిల్, హీరోకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టాను. ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రతి లొకేషన్లో మాకు నెమలి కనిపించింది. దీన్ని ఓ పాజిటివ్ సైన్‌గా తీసుకున్నాను. సుధీర్‌బాబుగారు అద్భుతంగా నటించారు. కథని నమ్మి, గ్రాండ్‌గా నిర్మించిన నా ఫ్రెండ్ సుమంత్‌కి ధన్యవాదాలు. ఈ సినిమాను ముందు పాన్ ఇండియాగానే అనుకున్నాం. అయితే ఇతర భాషల్లో డైలాగ్స్ సరిగ్గా కుదరలేదనిపించింది. నాకు నాలుగు భాషలు వచ్చు. నేనే కూర్చుని, పర్ఫెక్ట్గా చేయించాలంటే సినిమా రిలీజ్‌కు చాలా టైమ్ పడుతుంది. అందుకే ΄ాన్ ఇండియా రిలీజ్ వద్దనుకున్నాం’’ అన్నారు. -
Harom Hara Movie: ‘హరోం హర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఈ సినిమాతో మేమిచ్చే మెసేజ్ ఇదే..
-
రైనీ డే కావాలి.. రెడ్ అలర్ట్ లో షూట్
-
కృష్ణగారు యాక్షన్ సినిమాలు చేయమనేవారు: సుధీర్‌బాబు
‘‘సూపర్‌స్టార్ కృష్ణగారి జయంతి (మే 31) సందర్భంగా ‘హరోం హర’ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. యాక్షన్ సినిమాలు చేయమని కృష్ణగారు చెప్పే వారు. ‘హరోం హర’ విషయంలో ఆయన ఆనందపడతారని నమ్ముతున్నాను. తెలుగు, ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ ‘హరోం హర’లాంటి నేపథ్యం ఉన్న సినిమా రాలేదనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్‌బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి. నాయుడు నిర్మించారు.ఈ సినిమా ట్రైలర్‌ను హీరో మహేశ్‌బాబు గురువారం సోషల్ మీడియాలో రిలీజ్ చేసి, ‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సుధీర్‌బాబు, టీమ్‌కు శుభాకాంక్షలు’ అన్నారు. అనంతరం నిర్వహించిన ట్రైలర్ లాంచ్ వేడుకకి దర్శకులు అనిల్ రావిపూడి, సంపత్ నంది అతిథులుగా హాజరయ్యారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ–‘‘హరోం హర’లో హీరో పాత్ర గురించి సింగిల్ లైన్లో చెప్పాలంటే జేమ్స్ బాండ్ ఇన్ కుప్పం లేదా రాంబో ఇన్ కుప్పం అనొచ్చు’’ అన్నారు.‘‘ఈ సినిమా సుధీర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టవుతుంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘ఈ మూవీ ట్రైలర్ టెరిఫిక్‌గా అనిపించింది’’ అన్నారు సంపత్ నంది. ‘‘హరోం హర’లో రెండు వేల మందితో షూట్ చేసిన ఓ సీక్వెన్స్ థియేటర్స్‌లో అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు జ్ఞానసాగర్ ద్వారక. ‘‘నేనిప్పటివరకూ చేయని పాత్రను ఈ సినిమాలో చేశాను’’ అన్నారు మాళవికా శర్మ. ‘‘మా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు సుమంత్ జి. నాయుడు. నిర్మాతలు సుబ్రహ్మణ్యం, కేఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ పాల్గొన్నారు. -
జూన్‌లో హరోం హర
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ సినిమా విడుదల తేదీ మారింది. ముందుగా ఈ నెల 31న సినిమా విడుదలకు యూనిట్ ΄్లాన్ చేసింది. అయితే జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, సుధీర్ కొత్తపోస్టర్ని రిలీజ్ చేశారు.జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ‘హరోం హర’లో మాళవికా శర్మ కథానాయిక. సుమంత్ జి. నాయుడు నిర్మించారు. ‘‘ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘హరోం హర’. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగే పీరియాడికల్ ఫిల్మ్ ఇది’’ అన్నారు మేకర్స్. -
మిస్సవుతున్నందుకు బాధగా ఉంది.. సుధీర్ బాబు ట్వీట్!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్‌బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన తాజా చిత్రం హరోం హర. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మూవీని మే 31న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించారు.కానీ ఊహించని విధంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు సుధీర్ బాబు ట్వీట్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల హరోం హర మూవీని వాయిదా వేస్తున్నట్లు రాసుకొచ్చారు. సినిమా వాయిదా వేస్తున్నందుకు బాధగా ఉందన్నారు. స్పెషల్ డేట్ మిస్ అవుతున్నానని సుధీర్ బాబు ట్విటర్ ద్వారా వెల్లడించారు.సుధీర్‌బాబు తన ట్విటర్లో రాస్తూ..' వివిధ కారణాల వల్ల హరోం హర సినిమాను వాయిదా వేస్తున్నాం. వచ్చేనెల జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తాం. మొదట అనుకున్న ప్రకారం కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నా. కానీ మిస్ అయినందుకు బాధగా ఉంది. అయినప్పటికీ జూన్ ఇప్పటికీ నా లక్కీ నెల. ఈ సమయంలోనే ప్రేమకథా చిత్రం, సమ్మోహనం చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే హరోం హర కూడా మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది.' అని పోస్ట్ చేశారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. For various reasons, #HaromHara will now be releasing in theaters worldwide on 14th June. Although I feel sad for missing the release on the occasion of Krishna gari birthday, nevertheless June is still my lucky month. PKC & Sammohanam were both released during this time😎 I… pic.twitter.com/NZvcKA2Fdu— Sudheer Babu (@isudheerbabu) May 21, 2024 -
ఆ రోజే హరోం హర
సూపర్ స్టార్ కృష్ణ జయంతి మే 31న. కృష్ణ అల్లుడు, హీరో సుధీర్‌బాబు నటించిన ‘హరోం హర’ చిత్రం ఆ రోజే ధియేటర్లలోకి రానుంది. 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్‌గా ‘హరోం హర’ రూపొందింది. ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం శనివారం ప్రకటించింది.జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ కథానాయికగా నటించగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘‘ఈ సినిమా కోసం సుధీర్ బాగా మేకోవర్ అయ్యారు. కథానుసారం కుప్పం స్లాంగ్‌లో డైలాగులు చె΄్పారు. ఈ వేసవి సెలవుల్లో మంచి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
నా కెరీర్లో గేమ్ చేంజర్ అయ్యే చిత్రమిది: సుధీర్ బాబు
‘‘హరోం హర’ సినిమా కోసం యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. ఒక్కో రోజు సెట్స్‌లో వెయ్యిమంది ఉండేవారు. మంచి ఎమోషన్స్, హై కమర్షియల్ కంటెంట్ ఉన్న చిత్రమిది. ఇందులో చాలా బలమైన పాత్ర చేశాను. ఈ సినిమా నా కెరీర్లో గేమ్ చేంజర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సుధీర్ బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి. నాయుడు నిర్మించిన పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. మాళవికా శర్మ హీరోయిన్. హైదరాబాద్‌లో యూనిట్ నిర్వహించిన ఈ చిత్రం టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సుధీర్ బాబు మాట్లాడుతూ– ‘‘సుమంత్ జి. నాయుడు వంటి నిర్మాతలు చిత్ర పరిశ్రమకు రావాలి. మైత్రీ, సితార, వైజయంతి.. లాంటి బ్యానర్స్లానే కథని నమ్మి ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాణ సంస్థగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పరిశ్రమలోకి వచ్చినట్లేనని నమ్ముతున్నాను. నా కోసమే ఈ చిత్రకథ రాసుకొచ్చిన సాగర్‌కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా రెండో చిత్రానికి ఇంత హై బడ్జెట్ ఇస్తారని ఊహించలేదు. మంచి సినిమా చేశాం’’ అన్నారు జ్ఞానసాగర్. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. టీజర్‌కి వస్తున్న స్పందన చూస్తుంటే ఓ మంచి సినిమా చేశాననే నమ్మకం వచ్చింది’’ అన్నారు సుమంత్ జి. నాయుడు. ఈ వేడుకలో కెమెరామేన్ అరవింద్, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.